ప్రపంచ వ్యాపితంగా అరుదైన సూపర్ మూన్ -ఫోటోలు
అరుదుగా కనిపించే సూపర్ మూన్ ఆగస్టు 10, 2014 తేదీ రాత్రి సంభవించింది. చంద్ర కళల ప్రకారం నెలకొకసారి పౌర్ణమి రోజున పూర్తి రూపంలో చంద్రుడు కనిపించే సంగతి తెలిసిందే. భూమి చుట్టూ వర్తులాకారంలో (elliptical shape) తిరిగే చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీపంలో వచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. కానీ ఆ సందర్భం ఎప్పుడూ పౌర్ణమి రోజు కానవసరం లేదు. పౌర్ణమి రోజున పూర్తిగా చంద్రుడు కనిపించే రోజునే భూమికి అతి దగ్గరిగా…