అదే సచిన్ అయితే పెద్ద గొడవై ఉండేది -ఇంగ్లండ్ క్రికెట్ కోచ్
ఇంగ్లండు క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ జింబాబ్వే ఆటగాడు ఆండి ఫ్లవర్, సచిన్ టెండూల్కర్‌ను ఒకసారి తలచుకున్నాడు. రెండవ టెస్టు మ్యూచ్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ రనౌట్‌ను తిరిగి పరిశీలించాలని భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్ళి కోరడాన్ని ఆయన సమర్ధించుకుంటూ తన నిర్ణయంలో సచిన్‌ని ప్రతిక్షేపించుకున్నాడు. “ఇయాన్ బెల్ లాగే సచిన్ అవుటై ఉన్నట్లయితే క్రికెట్ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి ఉండేది” అని చెబుతూ తమ చర్యను సమర్ధించుకున్నాడు.…