భారత్ బెదిరింది; పాక్ సాధించింది

ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్…

చరిత్రాత్మక యు.ఎన్ సభలో ఇరాన్ ధిక్కరణ

అమెరికా నిధులిచ్చి నడిపే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ చరిత్రాత్మక ప్రసంగం ఇచ్చాడు. ఇండియా లాంటి రాజ్యాలు (ప్రజలు కాదు) కలలోనైనా ఊహించని రీతిలో అమెరికా దుర్నీతిని దునుమాడాడు. మధ్యప్రాచ్యంలో ఏకైక అణ్వస్త్ర రాజ్యం ఇజ్రాయెల్ కి అండగా నిలిచే అమెరికా, అణు బాంబు వాసనే తెలియని ఇరాన్ పై దుష్ప్రచారం చేయడం ఏమిటని నిలదీశాడు. అణ్వస్త్రాలు ధరించిన ‘ఫేక్ రెజిమ్’ (ఇజ్రాయెల్) ని అమెరికా కాపాడుతోందని దుయ్యబట్టాడు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రపంచ ప్రజల…

‘ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి’ అన్నదెవరు?

“ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి” అన్నాడని ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ పైన పశ్చిమ దేశాల పత్రికలు, ఇజ్రాయెల్ తరచూ విషం కక్కుతుంటాయి. ఆయన ఎన్నడూ అనని మాటల్ని ఆయన నోటిలో కుక్కి అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు లాంటి దేశాలు ఇరాన్ పైన చేసే ఆధిపత్య దుర్మార్గాలకు చట్ట బద్ధతని అంటగట్టడానికి అవి నిత్యం ప్రయత్నిస్తుంటాయి. కెనడాకు చెందిన ప్రఖ్యాత పోలిటికల్ ఎకనమిస్టు ‘మైఖేల్ చోసుడోవ్ స్కీ’ ఇటీవల రాసిన పుస్తకం (Towards…