ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసన సభ విశ్వాసం గెలిచింది. బి.జె.పి కూటమి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసింది. కాంగ్రెస్ కాకుండా మరో అదనపు ఓటు కూడా ఎఎపి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. మంత్రి మనిష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి అరవింద్ భావోద్వేగ ప్రసంగంతో తమ ప్రభుత్వాన్ని సమర్ధించాలని సభ్యులను కోరారు. తీర్మానానికి అనుకూలంగా 37 ఓట్లు, వ్యతిరేకంగా 32 ఓట్లు పడ్డాయి. దీనితో…

మరో వాగ్దానం: ఢిల్లీ వాసులకు సగం ధరకే విద్యుత్

ఎఎపి ప్రభుత్వం మరో వాగ్దానం నెరవేర్చింది. గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెలకు 400 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపింది. అంటే సబ్సిడీ ఇచ్చిన మేరకు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంది. 400 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారు పూర్తి ఛార్జీలు చెల్లించాల్సిందే. ధరలను యధావిధిగా కొనసాగిస్తూనే సబ్సిడీ ఇవ్వడం ద్వారా కింది తరగతులకు విద్యుత్ భారాన్ని ఎఎపి ప్రభుత్వం తగ్గిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా…

మరుగుజ్జు ఎఎపి కి ఆమ్ ఆద్మీయే కవచం -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు. ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు…

ఉచిత నీరు వాగ్దానం నెరవేర్చిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనదాన్ని నెరవేర్చారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా రోజుకు 700 లీటర్ల త్రాగు నీరు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేరుస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మీటర్ ఉన్న ప్రతి ఇంటికీ ఇంటి వాడకం నిమిత్తం 667 లీటర్ల నీరు ఉచితంగా అందిస్తారు. ఘజియాబాద్ లోని కౌసాంబి లోని తన…

అరవింద్ వాహనం నేటి వ్యవస్ధలో ఇమిడేనా? -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్/ఆమ్ ఆద్మీ పార్టీ తనకు తాను విధించుకున్న గీటురాళ్ళు సామాన్యమైనవి కావు. నిజానికి ఆబ్సల్యూట్ దృష్టికోణంలో చూసినపుడు అవి సామాన్యమైనవే. కానీ నేటి వ్యవస్ధ నిర్మాణం అయి ఉన్న తీరుతో పోలిస్తే అవి అసామాన్యమైనవి. ఎర్ర లైటు వాహనంలో తిరగను, మెట్రోల్లోనే ప్రయాణిస్తాను… లాంటివి చిన్న విషయాలు. ప్రజా పాలనలో అవేమీ పెద్ద విషయాలు కావు. అసలు విషయాలు వేరే ఉన్నాయి. అవినీతి నిర్మూలన గురించి ఆయన చేసిన వాగ్దానం భారీ వాగ్దానం. ఎందుకంటే అవినీతి…

ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం…

అవినీతి ఫైళ్ళు తగలబెడుతున్న ఢిల్లీ అధికారులు!

అరవింద్ కేజ్రివాల్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ఆయనింకా అధికార పీఠంపై కూర్చోనేలేదు. అప్పుడే ఢిల్లీ బ్యూరోక్రాట్ అధికారులకు చెమటలు కారిపోతున్నట్లున్నాయి. అవినీతి జరిగిన దాఖలాలను రుజువు చేసే ఫైళ్లను వారు తగలబెడుతున్నారని ఇండియా టుడే/ఆజ్ తక్ పత్రికా సంస్ధలు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బైటపడింది. మరి కొందరు అధికారులు బదిలీ చేయించుకోడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి రోజుకు 700 లీటర్ల మంచి నీరు ఉచితంగా సరఫరా చేస్తామన్న కేజ్రీవాల్…

ఢిల్లీ: బ్యాలట్ ఓట్ Vs సోషల్ మీడియా ఓట్ -కార్టూన్

“ధన్యవాదాలు, ఢిల్లీ! ప్రజాస్వామిక ఓటింగ్ తీర్పును పక్కన పెట్టినందుకు…” అవినీతి వ్యతిరేక నినాదంతో వినూత్న రీతిలో ఢిల్లీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. పార్టీ స్ధాపించిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టి కరిపించి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎ.ఎ.పి ఎన్నికల అనంతరం కూడా పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన బి.జె.పి, ఎ.ఎ.పి…

ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…

కోడి పిల్లొచ్చి కోడిని వెక్కిరించినట్టు! -కార్టూన్

‘గుడ్డొచ్చి కోడిని వెక్కిరించినట్టు’ అంటాం కదా! కార్టూనిస్టు ఇక్కడ కోడి పిల్లే వచ్చి కోడి తల్లిని వెక్కిరిస్తోందని సూచిస్తున్నారు. అన్నా హజారే కష్టపడి ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ అనే గుడ్డును పొదిగిన తర్వాత అందులోంచి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ కోడి పిల్లగా బైటికి వచ్చిందని, ఆ కోడి పిల్ల ఇప్పుడు అన్నా హజారేను వెక్కిరిస్తోందని కార్టూన్ సూచిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేల మధ్య రెండు రోజులుగా ఒక కొత్త వివాదం నడుస్తోంది. అన్నా హజారే, మరో…

ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఏపాటిది? -కార్టూన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోర్టీ మొదటిసారిగా తన బలాన్ని నిరూపించుకోబోతోంది. బడా భూస్వామ్య – బడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలయిన బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలతో అది పోటీపడుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పరిస్ధితి కాంగ్రెస్, బి.జె.పిలతో పోలిస్తే ఎలా ఉంటుందో కార్టూనిస్టు ఈ కార్టూన్ లో చెబుతున్నారు. జన, ధన బలాలూ, బలగాలూ దండిగా ఉన్న కాంగ్రెస్, బి.జె.పి లతో ఆమ్ ఆద్మీ పార్టీ…

కేజ్రీవాల్ కి గ్యాస్ కట్ చేసిన అన్నా -కార్టూన్

“నా పేరు వాడుకోవద్దు, నా ఫోటో పెట్టొద్దు” అని అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ ని హెచ్చరించాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకి సన్నిహిత సహచరుడుగా పేరుపడిన అరవింద్ కేజ్రీవాల్ కి అన్నా హెచ్చరిక శరాఘాతం లాంటిది. ‘అన్నా బృందం’ పేరుతో ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ సంస్ధ కింద సాగిన ఉద్యమానికి అన్నా ముందు నిలబడినప్పటికీ ఉద్యమానికి అవసరమైన రోజువారీ వ్యవహారాలను చూసింది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాలే నని అప్పట్లో పత్రికలు ఘోషించాయి. అదే నిజమయితే…

చెప్పు విసిరింది కేజ్రీవాల్ పైన కాదు, వందిమాగధుల అత్యుత్సాహంపైనే

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఉన్న లాయర్ల ఛాంబర్ లోకి జొరబడి ప్రఖ్యాత లాయర్ ‘ప్రశాంత్ భూషణ్’ పైన దాడి చేసి కొట్టిన కొద్ది రోజుల్లోనే మరో అన్నా టీం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా దాడి జరిగిందని పత్రికలు వార్తను ప్రచురించాయి. సామాజిక కార్యకర్తలపై దాడులు పెరిగి పోతున్నాయని అసహనం వ్యక్తం చేశాయి. అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక దుండగుడు చెప్పు విసిరాడనీ, అతనిని అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారులు అక్కడే పట్టుకుని చావబాదారనీ తెలిపాయి. అయితే,…

‘ఏడు రోజుల’ షరతుకు అంతా ఓకే, ఒక్క అరవింద్ కేజ్రీవాల్ తప్ప; కొనసాగుతున్న ప్రతిష్టంభన

అన్నా హజారే జైలునుండి వెలుపలికి రావడంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. పోలీసులు విధించిన “అంగీకార యోగ్యం కాని ఆరు షరతులను” ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అన్నా హజారే జైలులోనే కొనసాగుతున్నారు. ఎత్తివేసామని చెపుతున్నట్లుగా పోలీసులు 6 ఎత్తివేయలేదనీ, 5 1/2 (ఐదున్నర) షరతుల్ని మాత్రమే ఎత్తివేశారనీ అన్నా హజారే బృందం ఎత్తి చూపుతోంది. అందువలన హజారే ఈ రాత్రికి జైలులోనే కొనసాగే అవకాశం ఉందని కిరణ్ బేడి, జైలు గేటు దగ్గర ఉన్న మద్దతుదారులకు తెలిపారు. అన్ని షరతుల్ని…