అయ్యా అయోమయం జగన్నాధం గారూ! తమరి గొప్ప విమర్శలకి సమాధానం ఇదిగో!!
“రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు” అన్న టైటిల్ తో నేను రాసిన పోస్టు కింద “అయోమయం జగన్నాధం” గారు రాసిన విమర్శకి ఇది సమాధానం. ముందు మీరు విమర్శలుగా భావిస్తున్నవాటికి సమాధానం. మీకు తెలియని విషయాలని అంత కాన్ఫిడెంట్ గా ప్రస్తావించి తప్పులెన్నాలని ప్రయత్నిస్తున్నందుకు ఒకరకంగా తమర్ని అభినందించవలసిందే. ఒక్కోటీ ప్రస్తావిస్తూ సమాధానం ఇస్తాను. (1) “చివరిగా ‘ది గ్రేట్ రిసెషన్’ కాదు ‘ది గ్రేట్ డిప్రెషన్’ ఏమో” అమెరికాలో రిసెషన్…