ఎడ్వర్డ్ స్నోడెన్: రష్యాపై అమెరికా తీవ్ర అసంతృప్తి
ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇవ్వడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. సెప్టెంబర్ లో రష్యా వెళ్లనున్న ఒబామా సందర్శనను తాము పునఃసమీక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ విలేఖరులకు తెలిపాడని హఫింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. రష్యాతో అమెరికాకు గల సంబంధాలు బహుముఖమైనవని, అయినప్పటికీ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన నేపధ్యంలో పుతిన్ తో ఒబామా జరపనున్న శిఖరాగ్ర సమావేశం సంభావ్యతను తాము పునర్మూల్యాంకనం చేస్తున్నామని కార్నీ…
