సంచలనం: ఇసిస్ అమెరికా చర్చల ఆడియో లభ్యం
అమెరికా అసలు రంగు అనుమానం లేకుండా రుజువయ్యే వార్త ఇది. ప్రపంచంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్ధలుగా పేరు పొందిన సంస్ధలు అన్నింటికీ మూలం అమెరికాయే అని మరోసారి రుజువు అయిన సందర్భం ఇది. ప్రస్తుతం అత్యంత కఠిన, పాషాణ, రక్తదాహంతో నిండినదని అమెరికా కూడా చెబుతున్న ఐఎస్/ఇసిస్/ఇసిల్ సృష్టికర్త, మద్దతుదారు, ఆయుధ-ధన-శిక్షణ సరఫరాదారు అమెరికాయే అని తిరుగు లేకుండా రుజువు చేసే ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని సిరియా ప్రభుత్వం ప్రకటించింది. సిరియా కిరాయి తిరుగుబాటు…


