పశ్చిమ దేశాల దాడులకు ఊతమిచ్చిన గడ్డాఫీ చర్యలు
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లకు ఇప్పుడు మరో దేశం జత కలిసింది. అమెరికాతో పాటు ఐరోపాలలోని పెత్తందారీ దేశాలు మరో బాధిత దేశాన్ని తమ ఖాతాలో చేర్చుకున్నాయి. శనివారం లిబియాపై ఫ్రాన్సు జరిపిన విమానదాడులతో ప్రారంభమైన పశ్చిమ దేశాల కండకావరం ఆదివారం అమెరికా, బ్రిటన్ ల క్షిపణి దాడులతో మరింత పదునెక్కింది. ప్రత్యక్షంగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాల్ దేశాల ప్రజలు కష్టాల సుడిగుండం లోకి నెట్టడంతో పాటు పరోక్షంగా తమ దేశాల ప్రజలను కూడా ఆర్ధిక, సామాజిక సంక్షోభం లోకి…