అమెరికా గొంతెమ్మ కోర్కెలకు కర్జాయ్ ససేమిరా
దశాబ్దం పైగా ఆఫ్ఘనిస్తాన్ లో తలదూర్చి ఇల్లూ, ఒల్లూ గుల్ల చేసుకున్నా తగిన ఫలితం దక్కని పరిస్ధితిని అమెరికా ఎదుర్కొంటోంది. ఇరాక్ లో వలెనే ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా తమ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవలసిన అగత్యం అమెరికా ముందు నిలిచింది. అమెరికా గొంతెమ్మ కోర్కెలను ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ససేమిరా నిరాకరించడమే దానికి కారణం. ఆఫ్ఘన్ ఇళ్ళల్లో చొరబడి దాడులు చేసే అధికారం ఇవ్వాలనీ, ఆఫ్ఘన్ చట్టాల నుండి అమెరికా సాయినికులకు మినహాయింపు ఇవ్వాలని అమెరికా…

