ఇరాన్ పై ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -3
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపధ్యంలో G7 గ్రూపు దేశాలు చమురు ధరల్ని తగ్గించటానికి వివిధ దేశాలను తమ రిజర్వ్ నిల్వలను విడుదల చేయాలని కోరుతున్నాయి. ఇప్పటిదాకా జపాన్, అమెరికా ఈ అంశం లో ఆమోదం చెప్పాయి. ఇందులో కలిసేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. అంటే చమురు ధరలు తగ్గించేందుకు G7 కూటమి చేసే ప్రయత్నాలకు మద్దతుగా తమ (స్ట్రాటజిక్) నిల్వలను మార్కెట్ లో విడుదల చేసేందుకు ఇండియా నిరాకరించింది.
