అమెరికాలో వామపక్షం అంటే అర్ధమే వేరు!

అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్…

పోటీ నుండి బైడెన్ ఉపసంహరణ, ట్రంప్ కు తలనొప్పి!

అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు. అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా…

హిల్లరీ ఖాతాలో 8 లక్షల అక్రమ ఓట్లు -పరిశోధన

అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన డొనాల్డ్ ట్రంప్ కంటే ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ కి 2 మిలియన్ల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అనగా పాపులర్ ఓట్ల లెక్కలో చూస్తే ట్రంప్ ఓడిపోయినట్లు లెక్క. కానీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కలో ట్రంప్ కే మెజారిటీ రావడంతో ఆయన విజయుడు అయ్యాడు. ఈ అపభ్రంశానికి కారణం చెబుతూ ట్రంప్, హిల్లరీ క్లింటన్ కు మిలియన్ల సంఖ్యలో అక్రమ ఓట్లు పడ్డాయని, ఆ అక్రమ ఓట్లను తొలగిస్తే, పాపులర్ ఓటింగ్ లో…

అమెరికా (అధ్యక్ష ఎన్నికల) చర్చ -ద హిందూ…

ఒక అనుభవజ్ఞులైన రాజకీయ నేత మరియు వైట్ హౌస్ కు పోటీ చేస్తున్న మొట్ట మొదటి నామిని అయిన వ్యక్తి, మొండి అయినప్పటికీ ఆశ్చర్యకారకమైన ప్రజాభిమానాన్ని చూరగొన్న స్ధిరాస్ధి వ్యాపారిని (ఎన్నికలకు ముందు జరగవలసిన) మూడు చర్చలలోని మొదటిదానిలో ఎదుర్కొంటున్న దృశ్యం హైప్ కు తగినట్లుగానే ఆవిష్కృతం అయింది. అత్యధిక మీడియా సంస్ధలు చర్చ విజయాన్ని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ కే అప్పగించినట్లు కనిపిస్తుండగా, అనేక…