జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రధాన అంశాలు
జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి. సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు. సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి. ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో…









