నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి (అన్నాపై విమర్శలు…. -2)

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి నిజానికి జాతీయ పత్రికలు ఈ కుంభకోణాలన్నింటినీ ప్రచురించినప్పటికీ అవన్నీ జాతీయ స్ధాయిలో తగిన ప్రచారం పొందలేకపోయాయి. దానికి ప్రజల జ్ఞాపక శక్తి పరిమితులకి అతీతమైన సంఖ్యలో కుంభకోణాలు చోటు చేసుకోవడం ముఖ్య కారణం. గతంలో బోఫోర్స్ కుంభకోణంలో గల్లంతయిన ప్రజాధనం కేవలం అరవై నాలుగు కోట్లు మాత్రమే. కాని ఈ దేశంలో ప్రధాన రాజకీయ వంశం అయిన గాంధీలు ఈ కుంభకోణంలో ఉండడంతో అది విస్తృత ప్రచారం…

అన్నా హజారే పై విమర్శలు, అవినీతి వ్యతిరేక ఉద్యమ విశ్లేషణ -1

అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంలో పోరాడుతున్నాడు. నిజానికి అన్నా హజారే పోరాడుతున్నాడు అనడం సమంజసం కాదు. అన్నా హజారే గానీ, ఆయన లాంటివారు గానీ వ్యక్తిగా తలపడి అవినీతి లాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక చెడుగు పై పోరాడడం సాధ్యమయ్యే పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా క్రెడిట్ అంతా ఆయన ప్రజలను కూడగట్టగలగడం లోనే ఉంది. అంటే అన్నా చరిత్ర, నిబద్ధత,…