ఓటెయ్యడానికి వచ్చి చిరంజీవికి పాఠం చెప్పిన ఎన్.ఆర్.ఐ

పలు సినిమాల్లో విలన్లకు సంస్కారం, పౌర బాధ్యత తదితర సుగుణాల గురించి పాఠాలు చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి నిజ జీవితంలో తానే ఓ పౌరుడితో పాఠం చెప్పించుకున్నారు. పాఠం చెప్పింది కేంబ్రిడ్జిలో ఉద్యోగం చేస్తున్న ఎన్.ఆర్.ఐ కావడం విశేషం. కేవలం ఓటు వేయడం కోసమే లండన్ నుండి వచ్చిన కార్తీక్ గంటన్నర నుండి క్యూలో నిలబడి ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చిరంజీవి కుటుంబం నేరుగా బూత్ లోకి వెళ్ళడం సహించలేకపోయారు. ఫలితంగా ఓ కేంద్ర మంత్రి…

అమెరికాలో మళ్ళీ టోర్నడోల భీభత్సం -ఫోటోలు

అమెరికాలో టోర్నడో (గాలివాన) ల సీజన్ మొదలయింది. శనివారం చెలరేగిన టోర్నడోల ధాటికి వేలాది ఇళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి. రెండు డజన్లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన గాలివాన, మొత్తం 6 రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఒక్క ఆదివారమే 30కి పైగా టోర్నడోలు భీభత్సం సృష్టించగా వచ్చే రోజుల్లో మరో 100 టోర్నడోలు అమెరికాను తాకవచ్చని అమెరికా వాతావరణ విభాగం హెచ్చరించింది. అమెరికాలో టోర్నడోగా పిలిచే గాలివాన ఇక్కడ మనం…

బంగాళాఖాతంలో మలేషియా విమానం?

హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా పౌర విమానం MH370 గురించి మరో కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ సదరు విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందని భావించేందుకు తగిన ఆధారాలు తమకు లభ్యం అయ్యాయని ప్రకటించింది. అప్పుడే నిర్ధారించలేము గానీ తమకు దొరికిన శిధిలాలన్నీ బోయింగ్ 777 కి సంబంధించిన శిధిలాలే అనీ కాబట్టి మలేషియా విమానం బంగాళాఖాతంలో కూలిందనేందుకు ఇది గట్టి సాక్ష్యం కావచ్చని తెలిపింది. గత కొద్ది…

ఎవరి (ఎన్ని)కలలు వారివి -కార్టూన్

ఎన్నికల ఫలితాలపై వివిధ పార్టీల నేతలు చెప్పిన జోస్యాలు, వ్యక్తపరిచిన ఆశలు, అన్నీ కలిపి ఒక చోట కుప్ప పోసి ఇదిగో ఈ నాలుగు గీతల్లో చెప్పెయ్యడం ఒక్క కార్టూనిస్టుల వల్లే సాధ్యం. వీటిలో మొదటి కల వెనుక స్వదేశీ, విదేశీ కంపెనీల ఆశలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత రెండింటిలో ఏది నిజమైనా వారికి ఫర్వాలేదు. కాకపోతే మొదట్లో కాస్త షేర్ మార్కెట్లు పడిపోతాయంతే. ఆ తర్వాత అంతా మామూలే! వారికి కావలసినవి యధావిధిగా…

లక్ష్మణ రేఖా…, అదెక్కడ? -కార్టూన్

సీన్ 1: @*@ (తిట్లు…) సీన్ 2: $?#@?& (మరిన్ని తిట్లు….) సీన్ 3: చెప్పు తెగుద్ది, చంపుతా, పొడుస్తా, చీ(పు)రేస్తా… సీన్ 4: లక్ష్మణ రేఖా? అదెక్కడ?  ఎన్నికలను అవినీతి రహితంగా, ప్రలోభాల రహితంగా, కుల-మతాలకు అతీతంగా, పారదర్శకంగా, నిస్పాక్షికంగా, ప్రజాస్వామికంగా జరుపుతున్నామని చెప్పుకోవడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పడరాని పాట్లు పడుతోంది. విద్వేష ప్రసంగం చేసారంటూ వరుస కేసులు పెడుతున్నా ఆ మరుసటి రోజే మరొక నేత తయారవుతున్నాడు. సి.ఇ.సి మందలింపులు, హెచ్చరికలు, కేసులు ఎదుర్కొంటున్నవారి…

నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో పోటీలు –దృశ్య కధలు

సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొందీ, అది మరింతగా ప్రజల చేతుల్లో కుప్పబడే కొద్దీ వార్తల నివేదనలోనూ కొత్త పోకడలు పొడసూపుతున్నాయి. అటువంటి కొత్త పోకడల్లో ఫోటో స్టోరీ ఒకటి. ఒకే ఒక ఫోటోలో ఒక వార్తమొత్తం చెప్పగలగడం ఒక ధోరణి అయితే, కొన్ని ఫోటోలను కలిపి ఒక వార్తా కధనం చూపడం మరొక ధోరణి. అనేక మాటలు చెప్పలేనిది ఒక్క ఫోటో చెబుతుంది అని వార్తా పండితులు చెప్పడం తెలిసిందే కదా! ఛందోబద్ధ కవిత్వం ఒక్క భాషా…

దళితులతో రాహుల్ హానీమూన్, రాందేవ్ వెకిలి వ్యాఖ్యలు

స్వయం ప్రకటిత యోగా గురువు బాబా రాందేవ్ రాహుల్ గాంధీపై విమర్శల పేరుతో వెకిలి వ్యాఖ్యలు చేసి తన మకిలి బుద్ధిని చాటుకున్నాడు. హానీమూన్, పిక్ నిక్ లు జరుపుకోవడం కోసమే రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తున్నాడని కు వ్యాఖ్యలకు దిగాడు. ఆనక దళితులు బాధపడితే క్షమించాలని విన్నవించుకున్నాడు. ఆలోచించి చేసే వ్యాఖ్యలు బహుశా ఆయా వ్యక్తుల అసలు బుద్ధిని బైటపెట్టలేకపోవచ్చు. ఉద్దేశించిన లక్ష్యానికి మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అన్న విచికిత్స చేసుకున్నాక…

ఇది మోడి వానరుల కిష్కింధకాండ -కార్టూన్

రామాయణంలో నాలుగో కాండం కిష్కింధ కాండ. తెలుగు వికీపీడియా ప్రకారం కిష్కింధ కాండలోని ప్రధాన కధాంశాలు: రాముని దుఃఖము, హనుమంతుడు రామనకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ. వాలి వధ కోసం రాముడు చెట్టు వెనక నక్కి బాణం వదులుతాడు. ఎదురు వెళ్తే తనలోని సగం బలం వాలికి వెళ్లిపోతుంది. అందువలన వాలిని చంపడం కష్టం మరి! రామ బాణం దెబ్బ తిన్న వాలి మూర్ఛపోయి, మేలుకున్నాక రాముడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తాడు.…

ఇంకొచ్చి వోటర్ ని వెక్కిరించినట్టు… -కార్టూన్

“సిరా తడి ఆరకముందే…” అంటుంటాం కదా. అలాంటిదే ఇది కూడా. ఆ ఒక్క ముద్ర కోసమే కదా రాజకీయులకు ఇన్ని పాట్లు. ఈ.వి.ఎంల రోజులు కాబట్టి, ఆ ఒక్క నొక్కుడు కోసమే కదా అనాలేమో! రోశయ్య లాంటి తలపండిన నాయకులు కూడా “నువ్వు నాకు ఓటేశావా నీకు సమాధానం చెప్పడానికి?” అని చీరాలలో తనను నిలదీస్తున్న ఒక మహిళను ఎదురు నిలదీశారు. ఇక మద్యం, చికెన్ బిర్యానీ, చీరలు, ఉంగరాలు, వెయ్యి నోట్లు, క్రికెట్ కిట్లు… ఇత్యాదిగా…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -1

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు. పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి…

కెవిపి ని అరెస్ట్ చేయండి -అమెరికా

టైటానియం మైనింగ్ కుంభకోణం విషయంలో నిందితుడుగా అమెరికా కోర్టులు పేర్కొన్న కె.వి.పి రామచంద్ర రావును వెంటనే అరెస్టు చేయాలని అమెరికా కోరింది. రాజ్య సభ సభ్యుడు అయిన కెవిపి ఆంధ్ర ప్రదేశ్ లో టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు ఇప్పించినందుకు గాను అమెరికా కంపెనీ నుండి లంచం వసూలు చేశారని అమెరికా ఆరోపించింది. ఆరోపణలను కెవిపి ఖండించినప్పటికీ ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్ధితి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే లేదు. టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు…

ప్రొ-రష్యా అలజడులతో అట్టుడుకుతున్న తూర్పు ఉక్రెయిన్ -ఫోటోలు

నిన్నటి వరకు పశ్చిమ దేశాల అనుకూల ఆందోళనలతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ కంటికి నిద్ర లేకుండా గడిపింది. రైట్ సెక్టార్, స్వోబోడా లాంటి మితవాద, నయా నాజీ సంస్ధలు హింసాత్మక ఆందోళనలతో యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. అంతటితో ఉక్రెయిన్ చల్లబడలేదు. ఈసారి ఆందోళనలు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఈ సారి ఆందోళనలు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగానూ, ఇ.యు, అమెరికాల మద్దతు ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఎక్కుపెట్టబడ్డాయి. కీవ్ ఆందోళనలకు పశ్చిమ దేశాలు…

మోడి గెలుపు ఆలోచనే భయం గొలుపుతోంది

“మోడి అధికారంలోకి వస్తారన్న ఆలోచనే భయం గొలుపుతోంది” అని విదేశాల్లోని భారతీయ మేధావులు ఒక సంయుక్త ప్రకటనలే పేర్కొన్నారు. బ్రిటన్ లోనే అనేక ప్రసిద్ధి చెందిన యూనివర్సీటీలకు చెందిన బోధకులు ఈ ప్రకటన జారీ చేసినవారిలో ఉన్నారు. మోడి అధికారంలోకి వస్తే ‘మోరల్ పోలీసింగ్’ తీవ్రం అవుతుందని, ముఖ్యంగా మహిళలు అనేక నిర్బంధాలకు గురవుతారని వారు అంచనా వేస్తున్నారు. హిందూత్వ గ్రూపులు రెచ్చిపోతాయని, పొరుగు దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారుతాయని వారు ఊహిస్తున్నారు.  ప్రపంచ ప్రసిద్ధి చెందిన…

ఉక్రెయిన్: అమెరికాకు తా చేసింది ప్రజాస్వామ్యం

‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అని మూర్ఖుల ధోరణిని వర్ణిస్తుంది ఒక సామెత. మనం చెప్పుకునేది మూర్ఖుల గురించి కాదు. ‘ఉంటే నాతో ఉండు. లేదంటే శత్రువుతో ఉన్నట్లే’ అని ప్రపంచ దేశాల్ని శాసించే అమెరికా గురించి. తాను చెప్పిందే నీతి. తన మాటే శాసనంగా చెలాయించుకునే అమెరికా ఏక నీతికి తాజా తార్కాణం ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో విక్టోరియా నూలంద్ వదరిన వాక్కులు! విక్టోరియా నూలంద్ అమెరికాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్.…