రిలయన్స్ పై మరో 3.5 వేల కోట్ల జరిమానా

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కేంద్రం మరో 579 మిలియన్ డాలర్ల (సుమారు రు. 3.5 వేల కోట్లకు సమానం) జరిమానా విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చమురు సహజవాయువు మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఈ సంగతి తెలిపారు. 2013-14 సంవత్సరంలో కాంట్రాక్టు మేరకు సహజవాయువు ఉత్పత్తి చేయనందుకు గాను ఈ జరిమానా విధించామని చెప్పారు. దీనితో రిలయన్స్ కంపెనీపై విధించామని కేంద్రం చెప్పిన జరిమానా మొత్తం…

కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా జవాబులు -ఈనాడు

సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా జవాబు తీరు మలుచుకునే అంశాన్ని ఈ రోజు ఈనాడు పత్రికలో వివరించాను. అధ్యయనం శీర్షికన వెలువడుతున్న వ్యాస పరంపరలో ఇది 3వది కాగా సివిల్స్ కొశ్చెన్ టాగ్స్ వివరణకు సంబంధించి రెండవది. బ్లాగ్ పాఠకులు ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి. జవాబు తీరు మలుచుకునేదెలా? పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో ఆర్టికల్ చదవాలంటే కింది బొమ్మపైన క్లిక్…

బడ్జెట్: జైట్లీ చదవని భారీ సంస్కరణలు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన నోటితో చదవని భారీ సంస్కరణలు బడ్జెట్ లో దండిగానే ఉన్నాయి. ఆంగ్లంలో బిగ్ టికెట్ రిఫార్మ్స్ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పిలిచే ఈ సంస్కరణలే బడ్జెట్ అసలు సారాంశం. జనం మెచ్చే కేటాయింపులు సభలో చదివి తక్షణం ప్రతిపక్షాలు, ప్రజల నుండి విమర్శలు ఎదురయ్యే ప్రతిపాదనలను చదవకుండా ఆర్ధికమంత్రి జాగ్రత్తపడ్డారు. తద్వారా పేదలది ఎంతమాత్రం కాని బడ్జెట్ ని “ఇది పేదల బడ్జెట్” అని ప్రధాని నిరభ్యంతరంగా ప్రకటించే…

ఉత్తర కొరియా: ఓ యువ నియంత దృశ్య కధ

వర్తమాన చరిత్రలో నియంతృత్వం-ప్రజాస్వామ్యంల మధ్య సరిహద్దు రేఖ చెరిగిపోయి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనీ, సుదీర్ఘ ప్రజాస్వామ్యం అనీ చెప్పుకునే దేశాల్లో ప్రజల ప్రయోజనాలకు కాణీ విలువ కూడా లేదు. నియంతృత్వ ప్రభుత్వాలుగా సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలు ముద్రవేసిన దేశాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలకు కొదవలేని పరిస్ధితి. సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఇరాక్ దేశం అన్నీ విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది. చమురు వనరులను ప్రతి పైసాను దేశం దాటి పోనివ్వనందుకు సద్దాం హుస్సేన్…

సంస్కరణలే లక్ష్యంగా బడ్జెట్ 2014-15 -2

వ్యవసాయ రంగం భారత దేశంలో ఇప్పటికీ 60 శాతం ప్రజానీకానికి వ్యవసాయ రంగమే ఉపాధి ఇస్తోంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్, హోటళ్లు లాంటి సేవా రంగాలతో పాటు వ్యాపార రంగానికి, నిర్దిష్ట పారిశ్రామిక రంగాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆదాయం ప్రధాన వనరుగా ఉపయోగపడుతుంది. అనగా వ్యవసాయరంగం కుంటుబడితే దాని ఫలితం బహుళవిధాలుగా ఆర్ధిక వ్యవస్ధపై పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆదాయంపై ఆధారపడిన రంగాలన్నీ ప్రభావితమై అనేక రేట్లు ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై పడుతుంది.…

బడ్జెట్ 2014-15: సామాన్యుడు కాదు సంస్కరణలే లక్ష్యం

ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ జి.డి.పి వృద్ధి-ఆర్ధిక క్రమశిక్షణ-కోశాగార మెలకువ తదితర పదాడంబరాల మాటున సంస్కరణలలు ఉధృతం చేయడమే లక్ష్యంగా చేసుకుంది. రైల్వేలతో పాటు రక్షణ రంగం, భీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులను 26 శాతం నుండి 49 శాతానికి పెంచారు. పన్ను ఆదాయాన్ని పెంచే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలుకు డిసెంబర్ లోపల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లగ్జరీ సరుకులను ప్రజలకు అందుబాటులో తేవడానికి, తద్వారా కంపెనీల అమ్మకాలు,…

షీలా ఇంటికి 31 ఏ.సిలు! -కార్టూన్

“బహుశా ఆమె ఢిల్లీ మొత్తాన్ని చల్లగా ఉంచాలని భావించి ఉంటారు!” ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసానికి ఏకంగా 31 ఏ.సి మిషన్లు అమర్చారట. పోనీ అంతటితో ఆగారా అంటే, లేదు. 31 ఏ.సిలతో పాటు 15 ఎయిర్ కూలర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్లు, 14 హీటర్లు కూడా షీలా ఇంటిలో అమర్చారు. ఇంతా చేసి ఆ ఇల్లు 4 పడక గదుల ఇల్లు. నాలుగు పడకగదుల ఇంట్లో ఇన్ని ఏ.సిలు, ఎయిర్ కూలర్లు…

ఈ దేశంలో బిచ్చగాళ్లూ ధనికులే -కార్టూన్

మేధావులు: ఈయన భోజనంలో రు. 15/- ల అన్నం, రు. 10/- ల పప్పు, రు. 5/0 ల ఉల్లి, రు. 5/- ల మసాలాలు ఉన్నాయి. కాబట్టి ఈయన దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్లే! *** ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ తాజాగా తన దరిద్ర ప్రమాణాల లెక్కలు విడుదల చేయడంతో దేశంలో పేదలు ఎంతమంది అన్న చర్చ మరోసారి రేగింది. సురేష్ టెండూల్కర్ లెక్క సరికాదని చెప్పిన రంగరాజన్ పట్టణ, గ్రామీణ దరిద్రం లెక్కని…

కాప్టర్ కుంభకోణం: ఎ.పి గవర్నర్ ని విచారించిన సి.బి.ఐ

హెలికాప్టర్ల కుంభకోణంలో సి.బి.ఐ విచారణకు నోచుకున్న గవర్నర్ల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ కూడా చేరిపోయారు. కుంభకోణానికి దారి తీసిన నిర్ణయం జరిగిన కీలక సమావేశంలో అప్పటి ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ కూడా పాల్గొనడంతో సి.బి.ఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ మేరకు సి.బి.ఐ బృందం ఒకటి హైద్రాబాద్ వచ్చి గవర్నర్ కు విచారించింది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో యు.పి.ఎ నియమించిన ఇద్దరు…

బంగాళాఖాతం వివాదం: ఐరాస బంగ్లాదేశ్ అనుకూల తీర్పు

మూడు దశాబ్దాల నాటి సముద్ర జలాల సరిహద్దు వివాదంలో ఐక్యరాజ్య సమితి సంస్ధ ఒకటి ఇండియాకు వ్యతిరేకంగానూ, బంగ్లాదేశ్ కు అనుకూలంగానూ తీర్పు చెప్పింది. పొరుగు దేశాలతో వివాదాల్లో హిందూ-ముస్లిం సెంటిమెంట్లను చొప్పించి ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇండియా వైపే మొగ్గు చూపాలని వాదించే బి.జె.పి/ప్రధాని మోడి ఆశ్చర్యకరంగా తీర్పును స్వాగతించారు. ప్రమాణ స్వీకారం రోజే సార్క్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపి స్నేహ పూర్వక పొరుగు సంబంధాలకు ప్రాధాన్యతను ప్రకటించిన మోడి ఆ అవగాననే ఐరాస తీర్పు సందర్భంగానూ…

రైల్వే బడ్జెట్: ఎఫ్.డి.ఐతో సేవల మెరుగు(ట)

నరేంద్ర మోడి/ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్, ఇంతదాకా రైల్వేరంగంలో లేని ఎఫ్.డి.ఐలకు స్వాగతం పలకడంతో మొదలయింది. బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐల వల్ల భారతీయుల ఉపాధి పోతుందని వాదించిన బి.జె.పి అదే ఎఫ్.డి.ఐలకు రైల్వేల్లో రెడ్ కార్పెట్ పరవడానికి సిద్ధం అయింది. కేవలం రైల్వేల అభివృద్ధి కోసమే మౌలిక నిర్మాణాలలో (ఇన్ఫ్రా స్ట్రక్చర్) ఎఫ్.డి.ఐలను ఆహ్వానిస్తాం తప్ప రైల్వేల నిర్వహణలో కాదని హామీ ఇచ్చింది. ఎక్కడికి పిలిచినా ఎఫ్.డి.ఐ, ఎఫ్.డి.ఐ యే. అదేమీ భారత…

మంచి రోజులు కాదు యు.పి.ఏ రోజులే తిరిగొచ్చాయ్

“అచ్ఛే దిన్ ఆనేవాలా హై” (మంచి రోజులు వస్తున్నాయ్)… ఇది బి.జె.పి/ఎన్.డి.ఏ/నరేంద్ర మోడి ఎన్నికల నినాదం. ఇవ్వడానికి ఈ నినాదమే ఇచ్చినా తాము అమలు చేస్తున్నది మాత్రం యు.పి.ఏ విధానాలే అని పార్లమెంటు సాక్షిగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆహార ధరలు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం ఊర్ధ్వ స్ధాయిలో కొనసాగుతుండడంతో స్వల్ప కాల చర్చకు సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. యు.పి.ఏ చేసిన నిర్ణయాలనే తాము అమలు చేస్తున్నామని ఆయన…

తిక్కవెధవలతో వాదన చేటు తెస్తుంది -వీడియో

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ఈ పద్యం ఎవరు రాశారో నాకు గుర్తు లేదు గానీ ఇప్పటికీ ఆచరణీయం అని మూర్ఖ, తిక్క శిఖామణులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు. అంతర్జాలం చాటు చూసుకుని తిక్క వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్న తల తిక్క వెధవల నుండి శాశ్వతంగా తప్పించుకునే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా ఫేస్ బుక్ లో యాదృచ్ఛికంగా…

ఇండియా-అమెరికా సంబంధాల్లో షాడో బాక్సింగ్ -ది హిందూ ఎడిటోరియల్

(ఈ సంపాదకీయం ది హిందూ పత్రిక ఎప్పటి అవగానలో భాగంగా కనిపించడం లేదు. మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ బి.జె.పి నూతన హయాంలో సానుకూల అంశాలను కనిపెట్టడానికి ఆపసోపాలు పడుతున్నట్లు కనిపిస్తున్న ది హిందూ ధోరణిలోనే ఈ సంపాదకీయం సాగింది. లేదంటే తెలిసి తెలిసీ అమెరికాతో సత్సంబంధాలను కోరే దుస్సాహసానికి పత్రిక ఎందుకు పూనుకుందో అంతుబట్టని విషయం. కోరి దృత రాష్ట్ర కౌగిలిలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తున్న ఇటువంటి సంపాదకీయం ది హిందూ నుండి వెలువడడం ఒకింత ఆశ్చర్యకరమే…

సివిల్స్ కొశ్చెన్ ట్యాగ్స్ -ఈనాడు

ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన భాగం సివిల్స్ కోసం సిద్ధపడుతున్నవారిని నేరుగా ఉద్దేశించినది. కొద్ది రోజుల క్రితం మిత్రుడు ఆనంద్ వల్ల ఈసారి నా సిరీస్ కాస్త మలుపు తిరిగింది. సివిల్స్ లో జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రంలో ఎదురయ్యే కొశ్చెన్ ట్యాగ్స్ గురించి చెప్పాలని కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా సమాధానం నిర్మాణం ఎలా మార్చుకోవాలో చెప్పాలని ఆనంద్ కోరారు. మొదట ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని అనుకోలేదు. నేను ‘వలదు, వలదు’ అని చెప్పగా…