లోక్ సభ ప్రతిపక్ష హోదా: రంగంలోకి సుప్రీం కోర్టు?

లోక్ సభలో ప్రతిపక్ష నాయక హోదాను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి బి.జె.పి/ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిరాకరించింది. లోక్ సభ సీట్ల మొత్తం సంఖ్యలో 10 శాతం సీట్లు తెచ్చుకోవడంలో విఫలం అయినందున కాంగ్రెస్ పార్టీ ఆ హోదాకు అర్హురాలు కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తేల్చేశారు. ఇది రాజ్యాంగ పదవుల నియామకానికి ఆటంకంగా పరిగణించడంతో సుప్రీం కోర్టు రంగంలోకి దిగుతోంది. వివిధ రాజ్యాంగ పదవులను భర్తీ చేయడంలో లోక్ సభ ప్రతిపక్ష నేతను విశ్వాసం లోకి…

లోక్ సభ: ప్రతి ముగ్గురు ఎం.పిల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు

….నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మండి ఎం‌పి లలో 34% ఎం‌పి లు అనగా ప్రతి ముగ్గురిలో ఒకరు  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లో 30% అనగా 158 మంది  ఎం‌పి లు,2004 లో 24% మంది ఎం‌పిలు  క్రిమిననల్ కేసులు ఎదుర్కొన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న 186…

చరిత్ర పుటలు: రైట్ బ్రదర్స్ మొదటి విమానం -ఫోటోలు

గాలిలో ఎగురుతున్న పక్షులను చూసిన మనిషి తానూ అలా ఎగరాలని కలలు కన్నాడు. ఆ కలలతోనే అనేక కధలు అల్లుకున్నాడు. జానపద కధల దగ్గరి నుండి, పురాణేతిహాసాల వరకు మనిషి ఏదో విధంగా పక్షుల్లా గాలిలో ప్రయాణం చేశాడు. పక్షి మీద కూర్చొని కావచ్చు, తనకే రెక్కలు కట్టుకుని కావచ్చు లేదా తాను పక్షిలా మారి కావచ్చు… రకరకాలుగా తన ఊహలకు అందిన మేరకు ఎగిరినట్లు రాసుకుని తృప్తి పడ్డాడు. అంతటితో ఆగి ఉంటే మనిషి మనిషి…

ఆర్.బి.ఐ లాభం రు. 53 వేల కోట్లు

2013-14 ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం (RBI fiscal year) లో భారత సెంట్రల్ బ్యాంకు రు. 52,679 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది గత సంవత్సరం లాభంతో పోలిస్తే 14.75 శాతం తక్కువ అని ఆర్.బి.ఐ తెలిపింది. తన లాభం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి తరలిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం జులైలో ప్రారంభమై జూన్ తో ముగుస్తుంది. అనగా జాతీయ ఆర్ధిక సంవత్సరం లేదా జాతీయ కోశాగార సంవత్సరం కంటే ఆర్.బి.ఐ ఆర్ధిక సంవత్సరం…

ఇండియాతో చర్చలు: మండుతున్న పాకిస్ధాన్ -కార్టూన్

“… జనాబ్ మోడీజీ, మీతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మేము గీత దాటితిమి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో…” *** ప్రస్తుతం పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్, ముఖ్యంగా పార్లమెంటు ప్రాంతం ఆందోళనలతో రగులుతోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ, మరో మతగురువు నేతృత్వంలోని సంస్ధ రెండూ పాకిస్ధాన్ పార్లమెంటు మీదికి దండెత్తి వచ్చారు. తమ ఆందోళనకు వారు చెబుతున్న కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని. అక్రమ ప్రభుత్వం కనుక వెంటనే రాజీనామా చేసి…

రష్యా ఆంక్షలను దాటేందుకు ఇ.యు వక్రమార్గం

ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై అట్టహాసంగా ఆంక్షలు ప్రకటించిన యూరోపియన్ దేశాలు, అవే ఆంక్షలను రష్యా తమపై విధించేసరికి కిందిమీదులవుతున్నాయి. అమెరికా, ఇ.యు, కెనడా, నార్వే, ఆస్ట్రేలియా దేశాల నుండి వచ్చే ఆహార దిగుమతులపై రష్యా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు యూరోపియన్ యూనియన్ కంపెనీలు స్విట్జర్లాండ్, దక్షిణ అమెరికా దేశాల లాంటి ప్రత్యామ్న్యాయ వాణిజ్య మార్గాల ద్వారా తమ ఎగుమతులు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ స్విట్జర్లాండ్ సహాయ నిరాకరణతో ఈ ప్రయత్నాలకు చెక్ పడింది.…

కె.సి.ఆర్ దాయాది బాబు -కార్టూన్

“ఈయన ఆంధ్ర నుండి వచ్చిన మా కజిన్. కుటుంబ చర్చల కోసం మాత్రమే ఆయన ఇక్కడకు వచ్చారు” *** ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సలహా మేరకు దాయాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ కలిసి కూర్చుని కష్ట, సుఖాలు మాట్లాడుకున్నారు. చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇద్దరు సి.ఎం లూ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కె.సి.ఆర్ అంగీకరించినట్లుగా కూడా ఎ.పి. సి.ఎం బాబు చెబుతున్నారు. చర్చల…

498A: దుష్ప్రచారం మాని పకడ్బందీగా అమలు చేయాలి

-రచన: రమా సుందరి (ఉపాధ్యక్షురాలు, ప్రగతిశీల మహిళా సంఘం, ఆంధ్ర ప్రదేశ్) భారతదేశ న్యాయం ఎప్పుడూ ఆధిపత్య వర్గాల వైవునే నిల్చోని ఉంటుంది. అందులో కూడా పురుషుల పక్షమే వహిస్తుంది. బలహీన వర్గాలు అయిన దళితులు, స్త్రీల పట్ల శీతకన్ను వేసి ఉంచటమే కాదు, అవసరమైనపుడు వారి వ్యతిరేకవర్గంలో తన స్థానాన్ని నిరభ్యరంతంగా ఖాయం చేసుకొంటుంది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన వర్గ, కుల, లింగ సమానత్వాన్ని నామకా అయినా పాటించాలనే మొహమాటాన్ని కూడా నిస్సంకోచంగా వదిలేస్తుంది.…

ఒక చికాకుపై అతి స్పందన -ది హిందు ఎడిటోరియల్

(ఆగస్టు 25 తేదీన ఇండియా, పాకిస్ధాన్ ల విదేశాంగ శాఖల కార్యదర్శులు సమావేశమై చర్చలు జరపవలసి ఉంది. దానికంటే ముందు ఇండియాలోని పాక్ హై కమిషనర్ కాశ్మీర్ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులకు ఆహ్వానాలు పంపారు. కొందరు హురియత్ నాయకులు వెళ్ళి మాట్లాడారు కూడా. దీనిని కారణంగా చూపిస్తూ మోడి ప్రభుత్వం కార్యదర్శి స్ధాయి చర్చలను రద్దు చేసింది. ఈ అంశంపై ఈరోజు (ఆగస్టు 20, 2014) ది హిందు పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.…

గాజా విధ్వంసం ఖరీదు $8 బిలియన్లు

40 రోజుల గాజా విధ్వంసం ఖరీదు 8 బిలియన్ డాలర్లు. అనగా 48,000 కోట్ల రూపాయలు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ ఆదాయంలో ఇది 2/3 వంతుతో సమానం. కానీ ఉమ్మడి ఏ.పి జనాభా 10 కోట్లు కాగా గాజా జనాభా కేవలం 18 లక్షలు మాత్రమే. “గాజా భూభాగం సర్వ నాశనం అయిపోయింది. అనేక సంస్ధలు ఉమ్మడిగా పూనుకుంటే తప్ప పునర్నిర్మాణం సాధ్యం కాదు” అని గాజా గృహ నిర్మాణం మరియు ప్రజా పనుల…

ప్రశ్న: సుఖ శాంతులున్న తావు భూమిపై ఉందా?

ఎస్ రామ కృష్ణ రావు Dear Sekhar, I regularly follow your Q&A section in the teluguvartalu website. I have one question in this context. We know that every where on this world people are suffering with some problems (may be financial/political/lack of food  … and many more). I was wondering is there any place on the…

ఈనాడు వ్యాసాలన్నింటికి లంకెలు

మిత్రులు కొందరు గతంలో రాసిన ఈనాడు వ్యాసాలు అన్నీ అందుబాటులో ఉన్నాయా అని అడుగుతున్నారు. బ్లాగ్ లో అన్నీ ఉంటే వాటికి లింక్ లు ఇవ్వాలని కోరుతున్నారు. వారి కోరికను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఈనాడులో ప్రచురించబడిన ఈనాడు వ్యాసాలకు లంకెలు కింద ఇస్తున్నాను. *** జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -1వ భాగం సమాచార సేకరణకు చక్కని దారులు -2వ భాగం పరిభాష తెలిస్తే తేలికే -3వ భాగం ఐక్యవేదికలూ… వ్యూహాలూ -4వ…

మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్

కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తోడనే గుజరాత్ లో సంచలన కేసుల కధలు ఒక్కొక్కటీ కంచికి ప్రయాణం కడుతున్నాయి. ఆయా కేసుల్లో నిందితులకు గౌరవ మర్యాదలతో పదవులు దక్కుతున్నాయి. షోరాబుద్దీన్ షేక్ (మరియు) ఆయన భార్య  ఎన్ కౌంటర్, ఇష్రత్ జహాన్ (మరియు మరో ముగ్గురు ముస్లిం యువకులు) ఎన్ కౌంటర్, తులసీరాం ప్రజాపతి హత్య తదితర కేసుల్లో నిందితులైన ఐ.పి.ఎస్ అధికారులు ఇద్దరిని సగౌరవంగా తిరిగి పదవులు కట్టబెట్టారు. ఆషామాషీ పదవులు కాకుండా శక్తివంతమైన…

పశ్చిమ అదుపులో ఉక్రెయిన్ హంతకదళాలు -రష్యా

సైన్యం పేరుతో తూర్పు ఉక్రెయిన్ లో నరమేధం సాగిస్తున్న ఉక్రెయిన్ హంతకదళాలు పశ్చిమ దేశాల అదుపులో ఉన్నాయి తప్ప ఉక్రెయిన్ ప్రభుత్వం అదుపులో కాదని రష్యా విదేశీ మంత్రి తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రజలకు ఆహారం, నీరు తదితర సహాయం అందజేయడానికి వీలుగా జర్మనీలో చర్చలు జరుపుతున్న విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ఈ సంగతి పత్రికలకు తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రికి ఈ దళాలు హెచ్చరిక జారీ చేయడం బట్టి ఇది రుజువవుతోందని ఆయన తెలిపారు.…

రష్యాలో ఇక చైనా క్రెడిట్ కార్డులు

అంతర్జాతీయ ద్రవ్య రంగంలో అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతూ రష్యా మరో నిర్ణయం తీసుకుంది. చైనా క్రెడిట్ కార్డుల సంస్ధ యూనియన్ పే కార్డులను దేశంలో వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు ప్రకటించడంతో వీసా, మాస్టర్ కార్డ్ సంస్ధల క్రెడిట్ కార్డులను రష్యా దేశం నుండి తన్ని తగలేసింది. అమెరికా ఆంక్షలను అనుసరించి కొన్ని రష్యన్ కంపెనీల ఖాతాలను వీసా, మాస్టర్ కార్డ్ లు స్తంభింపజేశాయి. అందుకు ప్రతీకారంగా చైనా…