ఐపిఇఎఫ్: అమెరికా నాయకత్వాన 14 దేశాల కూటమి

అమెరికా, ఇండియాలతో పాటు మరో 12 దేశాలు ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేంవర్క్’ పేరుతో ఏర్పాటు చేసిన మరో కొత్త ఆర్ధిక కూటమి ఈ నెలలో కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా కు పెను సవాలు ఎదురవడంతో ఆయా దేశాలతో సరికొత్త ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా చైనాకు చెక్ పెట్టాలని చూస్తున్నది. అందులో భాగమే ఈ ఐపిఇఎఫ్ కూటమి. మే 23,…

నైజర్, సహేల్ నుండి అమెరికా, ఫ్రాన్స్ సేనల పలాయనం!

People on street in support of Military in Niger waving Russian flags ఆఫ్రికా ఖండంలో చైనా, రష్యాల చొరబాటు పెరిగే కొద్దీ ఒక్కొక్క దేశమూ అమెరికా ఉడుం పట్టు నుండి జారిపోతున్నాయి. అమెరికా కేంద్రంగా ఏక ధృవ ప్రపంచం రద్దయి పోయి బహుళ ధృవ ప్రపంచం స్థిరపడే (consolidate) దిశగా ఒక్కొక్క అడుగూ బలీయం అవుతోంది. తమ దేశాన్ని వెంటనే ఖాళీ చేయాలని నైజర్ మిలటరీ ప్రభుత్వం ఏప్రిల్ 2024లో అల్టిమేటం ఇచ్చిన…

కంగనా చెంప ఛెళ్ళుమనిపించిన కానిస్టేబుల్

బిజేపి తరపు అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ లో పోటీ చేసి ఎంపిగా గెలుపొందిన సినీ నటి కంగనా రణావత్ అనూహ్య రీతిలో ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బ తిన్నది. తమ జీవనోపాధిని దెబ్బ తీసే ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే సాధారణ శ్రామిక ప్రజలకు మద్దతు ఇవ్వడం అటుంచి వారి పట్ల ఎంత మాత్రం సానుభూతి చూపకపోవడమే కాకుండా వారిని అభ్యంతరకర పదజాలంతో దూషించడానికి వెనుకాడబోనని కంగనా రణావత్ అనేక సార్లు…

న.మో, షాల భారీ స్టాక్ మార్కెట్ స్కాం -రా.గా

“నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బూటకం అని బిజేపి నాయకత్వానికి ముందే తెలుసు. వారు జరిపిన అంతర్గత సర్వేలో తమకు 220 సీట్లు మాత్రమే వస్తాయని, ఇంటలిజెన్స్ ఏజన్సీల అంచనాలో 200 నుండి 220 వరకు సీట్లు వస్తాయని తేలింది” అని రాహుల్ గాంధీ వెల్లడించారు.

టిడిపి గెలుపుతో బాబు షేర్లు జంపు!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ 135 సీట్లు గెలవడంతో మిత్ర పక్షాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థానంలో నిలబడి ఉంది. దానితో టిడిపి పార్టీ పెద్దలతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఉన్న ఫళంగా పైపైకి ఎగబాకుతున్నాయి.

ఎలక్షన్ కమిషన్ కప్పదాట్లు, జనస్వామ్యానికి అగచాట్లు!

ముఖ్యంగా బి.జే.పి అగ్ర నేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా లతో పాటు ఇతర చోటా మోటా నాయకులు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ సాగించిన ప్రసంగాల పట్ల, వాటిపై వచ్చిన ఫిర్యాదుల పట్ల ఎన్నికల కమిషన్ “కత్తిని గాయాన్ని ఒకే గాటన కట్టినట్లు” గా స్పందించింది.

ఎఫ్.డి.ఐల దోపిడీ, భారతీయ పాలకులు మేధావుల సహకారం

మార్చి 2024తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా లోకి ఎఫ్.డి.ఐల రాబడి గత ఆర్ధిక సంవత్సరం (FY 2023) తో పోల్చితే ఏకంగా 62 శాతం పడిపోయినట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

2023-24 ఆర్ధిక సం. లో దేశం లోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) కేవలం 10.58 బిలియన్ డాలర్లు మాత్రమే.

డాలర్లు: ఇండియాకి వచ్చేదాని కంటే పోయేది రెట్టింపు

మన ప్రధాన మంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాళ్ళరిగేలా తిరిగి దేశానికి రప్పించుకునే పెట్టుబడుల వల్ల ఎవరికీ లాభం కలుగుతోంది? ఆర్.బి.ఐ లెక్కల ప్రకారం చూస్తే దేశంలోకి వస్తున్న డాలర్ పెట్టుబడుల కంటే దేశం దాటి పోతున్న లాభాల డాలర్లే అధికంగా ఉంటున్నాయి.

ఉక్రెయిన్: కాల్పుల విరమణపై చర్చిస్తున్న పశ్చిమ దేశాలు?!

జూన్ 3 తో ఉక్రెయిన్ యుద్ధం మొదలై 100 రోజులు గడిచాయి. ఉక్రెయిన్ బలగాలపై రష్యా ఫిరంగి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మెల్లగా అయినప్పటికీ ఉక్రెయిన్ లోని ఒక్కొక్క గ్రామం, పట్టణం రష్యా వశం లోకి వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ బింకం ప్రదర్శన కూడా కొనసాగుతోంది. ఉక్రెయిన్ కు అమెరికా, ఈయూ ఆయుధ సరఫరా కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘతిస్తున్నాయని ఓవైపు ప్రశంసలు కురిపిస్తున్న అమెరికా, యూకే, ఈయూ లు మరో…

జపాన్ డిఫెన్స్ పాలసీలో మార్పులు -2

ధాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం జపాన్ ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా మే 2 తేదీన ధాయిలాండ్ వెళ్ళాడు. రక్షణ పరికరాలు మరియు రక్షణ సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం మార్చుకునే సదుపాయాన్ని కల్పించుకునే లక్ష్యంతో ఆ దేశంతో కూడా రక్షణ ఒప్పందం చేసుకున్నాడు. “ద్వైపాక్షిక భద్రతా సహకారం” మరింత లోతుగా విస్తరించుకునేందుకు ఒప్పందంలో వీలు కల్పించారు. ఈ సందర్భంలో కూడా ఇరు దేశాలు “ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాభవం పెరుగుతున్న నేపధ్యంలో” అని చెప్పుకోవడం మానలేదు. ఉక్రెయిన్…

ఆత్మ రక్షణ విధానం వీడి మిలటరీ శక్తిగా మారుతున్న జపాన్!

జపాన్ తన మిలటరీ విధానాన్ని మార్చుకుంటున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి, అణు బాంబు విధ్వంసం దరిమిలా జపాన్, ‘కేవలం ఆత్మరక్షణకే మిలటరీ’ అన్న విధానంతో తనకు తాను పరిమితులు విధించుకుంది. ఇప్పుడు ఆ విధానానికి చరమగీతం పాడుతోంది. తన రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. అదే జరిగితే జపాన్ మిలటరీ బడ్జెట్ ఇక నుండి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరగనుంది. జపాన్ అంతటితో ఆగటం లేదు. వివిధ దేశాలతో వరస…

పశ్చిమ దేశాల పంచ ముఖ ముట్టడికి రష్యా జవాబు ఇచ్చేనా!?

మానవ జాతి నాగరికత మరియు అభివృద్ధి, పరస్పర సహకారం మరియు సౌభ్రాతృత్వం, సమస్త మానవుల ప్రజాస్వామ్యం-సమానత్వం ఇవి మానవ సమాజం సాధించిన మహోన్నత విలువలు. ఈ విలువలతో పోల్చితే అమెరికా, పశ్చిమ దేశాలు తాము ఎంత అనాగరిక పాశవిక దశలో ఉన్నామో స్పష్టంగా తమ నోటి తోనే ప్రకటించుకుంటున్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వారికి ఆ అవకాశం ఇచ్చింది. రష్యాపై విధించిన ఆంక్షలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని పాటిస్తున్న…

రష్యాపై అమెరికా పగను ఇండియా పంచుకుంటుందా? -2

గత ఆర్టికల్ తరువాయి భాగం….. చిరకాల స్నేహం అనేక దశాబ్దాలుగా ఇండియా రష్యాపై ఆధారపడి ఉంది. ఆయుధాలు కావచ్చు. స్పేస్ టెక్నాలజీ కావచ్చు. మిసైల్ టెక్నాలజీ కావచ్చు. క్రయోజనిక్ టెక్నాలజీ కావచ్చు. చివరికి అణు విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఇండియాకు రష్యా పూర్తి స్థాయి సహకారం అందిస్తూ వచ్చింది. ప్రపంచం అంతా అమెరికా నేతృత్వంలో ఇండియాను ఒంటరిని చేసి వెలివేసిన కాలంలో కూడా రష్యా ఇండియాతో స్నేహం, సహకారం, వాణిజ్యం మానలేదు. కానీ ఇండియాకు చైనాతో తగాదా…

ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు…

ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిపై తప్పుడు వార్తలు

గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూ వచ్చింది. ఉక్రెయిన్ తన శక్తి మేరకు ప్రతిఘటన ఇస్తూ వచ్చింది. ఈ యుద్ధం లేదా రష్యా దాడి ఏ విధంగా పురోగమించింది అన్న విషయంలో పత్రికలు ముఖ్యంగా పశ్చిమ పత్రికలు కనీస వాస్తవాలను కూడా ప్రజలకు అందించలేదు. భారత పత్రికలు, ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు పత్రికలతో సహా పశ్చిమ పత్రికల వార్తలనే కాపీ చేసి ప్రచురించాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్^ప్రెస్, ఎన్‌డి‌టి‌వి మొదలు…