చమురు ధరల యుద్ధంలో సౌదీ అరేబియా, అమెరికా?

అమెరికాలో షేల్ చమురు ఉత్పత్తి పెరిగేకొద్దీ ప్రపంచ చమురు మార్కెట్ లో సౌదీ అరేబియా, అమెరికాల మధ్య చమురు యుద్ధం తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో సిరియా కిరాయి తిరుగుబాటు, సో కాల్డ్ ఇస్లామిక్ స్టేట్ విస్తరణల ఫలితంగా చమురు ధరలు నానాటికీ పడిపోతున్నాయి. చమురు ధరలను తిరిగి యధాస్ధితికి తేవడానికి సౌదీ అరేబియా తన ఉత్పత్తుల్లో కోత పెట్టవచ్చనీ తద్వారా సరఫరా తగ్గించి ధరలు పెరగడానికి దోహదం చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా…

పాలస్తీనాకు బ్రిటిష్ పార్లమెంటు గుర్తింపు

పాలస్తీనా ప్రజల స్వతంత్ర పోరాటంలో ఒక చిన్న మలుపు లాంటి పరిణామం చోటు చేసుకుంది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ కామన్స్ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ చర్యను మలుపుగా నిర్ధారించలేము గానీ సంకేతాత్మక మలుపు అనవచ్చు. ఒక దేశం ఇచ్చిన గుర్తింపుతో ప్రోత్సాహం పొంది ఇతర దేశాలు కూడా ఇలాంటి సంకేతాత్మక గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవచ్చు. పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాలు సమాంతరంగా ఉనికిలోకి రావడమే పరిష్కారం అని మెజారిటీ పక్షాలు భావిస్తున్నాయి.…

హుద్ హుద్ విలయం, 21 మంది మరణం -ఫోటోలు

హుద్ హుద్ పెను తుఫాను ఉత్తరాంద్రలోని మూడు జిల్లాలను అతలాకుతలం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ శాఖలన్నింటినీ కదిలించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కేవలం ముగ్గురంటే ముగ్గురే మరణించారని ప్రతిపక్ష నాయకులతో సహా పత్రికలు రిపోర్ట్ చేసినప్పటికీ వాస్తవ మరణాల సంఖ్య సోమవారం నాటికి గాని తేలలేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రకారం తుఫాను తాకిడికి మరణించినవారి సంఖ్య 21కి పెరిగింది. మరణించినవారిలో అత్యధికులు చెట్లు కూలడం వల్లనే మరణించారని…

అద్దాల నేల: కొత్త సొబగుల ఈఫిల్ టవర్ -ఫోటోలు

ఈఫిల్ టవర్ కు కొత్త సొబగులను సమకూర్చిపెట్టారని పత్రికలు ఘోష పెడుతున్నాయి. ‘టూరిజమే నా యిజం’ అన్న మన తెలుగు రాజకీయ నాయకుడి నడమంత్రిజాన్ని ఒంట పట్టించుకున్నారో యేమో తెలియదు గానీ పారిస్ నగర ప్రభుత్వం ఈఫిల్ టవర్ కు 200 అడుగుల ఎత్తులో అద్దాల నేలను అమర్చి మరింత మంది టూరిస్టులను ఆకర్షించే పధకం వేసింది. అంత ఎత్తున అద్దాలను అమర్చడం వలన సందర్శకులకు గాలిలో నిలబడిన భ్రాంతి కలుగుతోందిట. పారిస్ ప్రభుత్వం కోరుకున్నట్లుగానే కొత్త…

నిశి రాత్రిన వెలుగు దివ్వె -ది హిందు ఎడిట్

(భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఈ యేడు నీలం రంగు లైట్ ఎమిటింగ్ డయోడ్ ను ఆవిష్కరించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. ఈ అంశంపై ది హిందూ ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్) జపాన్ లోని నగోయా యూనివర్సిటీకి చెందిన ఇసము ఆకసాకి మరియు హిరోషి అమనో లకూ, సాంతా బార్బార లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కు చెందిన షుజీ నకమూర లకు భౌతిక శాస్త్రంలో ఇచ్చిన నోబెల్ బహుమతి వారి…

పాక్ ఉల్లంఘనల మధ్య మోడి బిజీ -కార్టూన్

ఇక్కడ రాష్ట్రాల ఎన్నికలను చూసుకోవడమా, అక్కడ సరిహద్దులో పాకిస్ధాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను పట్టించుకొనడమా? ‘కిం కర్తవ్యం’ అన్న సంకట కాలాన్ని ప్రధాని నరేంద్ర మోడి ఎదుర్కొంటున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేళ కావడంతో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం పాక్ ఉల్లంఘనలను తమ పార్టీ ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క పాకిస్ధాన్ కాల్పుల్లో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే “అంతా సవ్యంగానే ఉంటుంది” అని ప్రధాని ప్రకటనలు…

కాశ్మీర్: ఇండియా అవగాహనకు దూరమౌతున్న అమెరికా!

జమ్ము&కాశ్మీర్ రాష్ట్రం విషయంలో ఇండియా అవలంబిస్తున్న అవగాహనకు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు. పశ్చిమ రాజ్యాధినేతలు దక్షిణాసియా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇండియాలో ఇండియాకు కావలసిన మాటలు, పాకిస్ధాన్ లో పాకిస్ధాన్ కు కావలసిన మాటలు చెప్పి తమ పనులు చక్కబెట్టుకొని పోవడం పరిపాటి. మొదటిసారిగా అమెరికా సెనేటర్లు కొందరు ఇండియాలో ఇండియా వ్యతిరేక అవగాహన ప్రకటించిన ఘటన చోటు చేసుకుంది. సమస్యలు లేని చోట కూడా సమస్యలు పుట్టించి…

అవినీతి మరియు కోర్టులు -ది హిందు ఎడిట్

(సెషన్స్ కోర్టు విధించిన శిక్షపై హై కోర్టుకు అప్పీలు చేసుకున్నందున హై కోర్టు విచారణ ముగిసేవరకు శిక్షను సస్పెండ్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని చేసుకున్న జయలలిత విన్నపాన్ని కర్ణాటక హై కోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ది హిందు పత్రిక ఈ రోజు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హై కోర్టు నిరాకరించడం వెనుక దొడ్డ సందేశం ఏదన్నా ఉంటే అది ప్రజా…

తెల్లపులి బారిన పడ్డ విద్యార్ధి -వీడియో

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ జూలో చోటు చేసుకున్న దుర్ఘటన గుర్తుంది కదా! తెల్ల పులిని దగ్గరి నుండి ఫోటోలు తీయబోయి పొరబాటున లోపలికి పడిపోవడంతో ఓ విద్యార్ధిని పులి చంపేసింది. ఆ హృదయవిదారక దుర్ఘటనను ఎవరో తమ సెల్ ఫోన్ లు చిత్రీకరించారు. వీడియోను బట్టి చూస్తే పత్రికలు చెప్పినట్లు పులికి బలైన విద్యార్ధి కాదు దానిపై రాళ్ళు వేసింది. పులి ఆవాసం బైట ఉన్నవారు రాళ్ళు వేశారు. తాము పులి నుండి అతన్ని రక్షిస్తున్నామని…

ప్రాకృతిక జీవ(న) వైవిధ్యం -ఫోటోలు

భూ మండలంపై 8.7 మిలియన్ల ప్రాణి కోటి నివసిస్తున్నదని ఒక అంచనా. ఇందులో మూడు వంతులు నేలపైనే నివసిస్తున్నాయని తెలిస్తే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం ఎందుకంటే భూ గ్రహంపై మూడు వంతులు నీరే కదా ఆక్రమించింది! 6.5 మిలియన్ల జీవులు నేలపై సంచరిస్తుంటే 2.2 మిలియన్లు నీటిలో గడుపుతున్నాయని ఆ మధ్య శాస్త్రవేత్తలు లెక్క గట్టారు. జీవ రాశుల సంఖ్యకు సంబంధించి ఇంతవరకూ ఇదే అత్యుత్తమ, సరైన లెక్క అని వారు తమకు తాము సర్టిఫికేట్…

జైలా, బెయిలా? -కార్టూన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎ.ఐ.ఎ.డి.ఏం.ఎ అధినేత్రి, ప్రస్తుతం బెంగుళూరులో ఊచలు లెక్కబెడుతున్న రాజకీయ నాయకురాలు జయలలిత కేసు కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు ముందుకు రానుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో 4 సం.ల జైలు శిక్షను సెషన్ కోర్టు విధించింది. శిక్ష రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు అప్పీలు చేసిన జయలలిత, అప్పీలుపై విచారణ జరిపే లోపు తనకు బెయిలు ఇవ్వాలని హై కోర్టును కోరారు. సదరు అప్పీలును హై…

కానరాని రికవరీ, ప్రపంచ జి.డి.పి తెగ్గోసిన ఐ.ఎం.ఎఫ్

2007-2009 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా బైటపడలేదని అది వాస్తవానికి నిరంతర సంక్షోభంలో తీసుకుంటోందని మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషకులు చెప్పిన మాటలను సాక్ష్యాత్తు ఐ.ఎం.ఎఫ్ ధ్రువపరిచింది. అలవిమాలిన ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటిస్తూ, అమలు చేస్తూ ప్రపంచాన్ని మాంద్యం నుండి బైటికి తేవడానికి మార్కెట్ ఎకానమీ దేశాలు, సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్ధిక పరిస్ధితులు లొంగిరామంటున్నాయి. మంగళవారం ఐ.ఎం.ఎఫ్ వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ పత్రం అనేక…

ఇండియా-పాక్ సరిహద్దు కాల్పులు -పాక్ కళ్ళతో

ఇండియా, పాకిస్ధాన్ సరిహద్దులో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తన ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించిన భారత ప్రధాని నరేంద్ర మోడి క్రమక్రమంగా పాక్ చర్చలకు దూరం జరుగుతూ వచ్చారు. ఇందుకు కారణం మీరంటే మీరే అని ఇరు దేశాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిర్వహించిన ఆందోళనల ఫలితంగా పాక్ విదేశీ విధానం, ముఖ్యంగా ఇండియా విధానం నవాజ్ చేతుల్లో నుండి పాక్…

కాల్పుల విరమణను కాపాడండి! -ది హిందు ఎడిట్

(ఇండియా-పాకిస్ధాన్ ల మధ్య సరిహద్దుల ఆవలి నుండి కాల్పులు జరగడం మళ్ళీ నిత్యకృత్యంగా మారిపోయింది. పాక్ కాల్పుల్లో సోమవారం 5గురు భారతీయ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఇండియా కాల్పుల్లో తమ పౌరులూ మరణించారని, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారత సైనికులు కాల్పులు జరుపుతున్నాయని పాకిస్ధాన్ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ది హిందు పత్రిక ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఆధీన రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చెదురు…

మాంద్యం వైపుకి జర్మనీ నడక, రష్యా ఆంక్షల ఫలితం!

తప్పుడు ఆరోపణలు చేస్తూ రష్యాపై అమెరికా, ఐరోపాలు విధించిన ఆంక్షలు తిరిగి వాటి మెడకే చుట్టుకుంటున్నాయి. 2014 సంవత్సరంలో రెండవ త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్) లో ఇప్పటికే జి.డి.పి సంకోచాన్ని నమోదు చేసిన జర్మనీలో ఆగస్టు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ సంకోచించింది. అనగా పారిశ్రామిక ఉత్పత్తి క్రితం నెలతో పోల్చితే వృద్ధి చెందడానికి బదులు కుచించుకుపోయింది. జర్మనీ ఆగస్టు వ్యాపార ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికా, ఐరోపా దేశాల స్టాక్ మార్కెట్ లు నష్టాల్లోకి…