జాతివివక్ష: ఆందోళనల సుడిలో అమెరికా -ఫోటోలు

ఫెర్గూసన్ పోలీసు కాల్పుల్లో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన కేసులో నిందితుడైన తెల్లజాతి పోలీసుపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. తెల్లజాతి సభ్యులే 75 శాతం స్ధానాల్ని ఆక్రమించి ఉండే గ్రాండ్ జ్యూరీ తెల్లజాతి పోలీసుకు అనుకూలంగా వ్యవహరించిందని అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఫలితంగా గ్యాండ్ జ్యూరీ తీర్పుకు వ్యతిరేకంగా అమెరికా అంతటా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. నల్లజాతి అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ యంత్రాంగం వివక్షా రహితంగా వ్యవహరించబోదని ఫెర్గూసన్…

మోడి దౌత్య మర్యాద ఉల్లంఘించారు -నేపాల్ పత్రికలు

సార్క్ దేశాల కూటమి సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి దౌత్య మర్యాదలను ఉల్లంఘించారని నేపాల్ పత్రికలు ఆరోపించాయి. ఆయన తన పరిమితులు గుర్తెరగకుండా నేపాల్ రాజ్యాంగం ఎలా ఉండాలో సలహా ఇవ్వడం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని విరుచుకుపడ్డాయి. పాత పెద్దన్న వైఖరి, జోక్యందారీ పెత్తనం సహించరానివని కాంతిపుర్, నాగరిక్ పత్రికలు విమర్శించాయి. నేపాల్ లో రాచరికాన్ని కూల్చివేసిన తర్వాత రాజ్యాంగ రచన ఇంకా పూర్తి కాలేదు. అనేక జాతుల సంగమం…

క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఇక లేడు

ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. క్రికెట్ అభిమాన ప్రపంచం అంతా ఏది జరగాలని కోరుకుందో అందుకు విరుద్ధమైనదే జరిగింది. బౌన్సర్ బంతి దెబ్బకు కుప్ప కూలిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (Philip Hughes) డాక్టర్లు కలుగ జేసిన కోమా నుండి మరి కోలుకోలేదు. మెదడుకు తీవ్ర గాయం తగలడంతో గాయం తగ్గడానికి డాక్టర్లు సంక్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ఫలితం ఏమిటో 48 గంటలు గడిస్తే గాని తెలియదని వారు ప్రకటించారు. కానీ వారి…

క్రికెట్: బౌన్సర్ బంతి దెబ్బకు కోమాలోకి… -ఫోటోలు

ఆస్ట్రేలియాలో జరుగుతున్న లీగ్ క్రికెట్ మ్యాచ్ లో ఓ క్రికెట్ ఆటగాడు ప్రాణాపాయ పరిస్ధితికి చేరుకున్నాడు. అప్పటికే అర్ధ సెంచరీ చేసిన ఫిల్ హ్యూస్ ను అవుట్ చేయడానికి బౌలర్ బాడీ లైన్ బౌలింగ్ ని ఎంచుకోవడంతో అది కాస్తా బ్యాట్స్ మేన్ కి ప్రాణాంతకంగా మారింది. ఫాస్ట్ బౌలర్స్ కి పేరు తెచ్చిపెట్టే మెరుపు వేగం బ్యాటింగ్ కు ప్రమాదం కావడం ఒక విషయం అయితే, ఆస్ట్రేలియా గ్రేట్ డాన్ బ్రాడ్ మన్ ఆటకు విరుగుడుగా…

బ్యాట్స్ మేన్, రన్నర్ ఇద్దరూ ఆయనే -కార్టూన్

బి.సి.సి.ఐ భారత ప్రభుత్వ సంస్ధ అని చాలామంది భావిస్తారు. అది కేవలం ప్రైవేటు క్రికెట్ సంఘాలను కేంద్రీకృత స్ధాయిలో నియంత్రించే ప్రైవేటు సంస్ధ మాత్రమేనని వారికి తెలియదు. అనేక యేళ్లుగా భారత ప్రజల్లో క్రికెట్ జ్వరాన్ని పెంచి పోషించి ఆ జ్వరాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బి.సి.సి.ఐ అవతరించింది. బి.సి.సి.ఐని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కొన్ని సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ క్రికెట్ జబ్బు డబ్బు తినడం మరిగిన సంపన్నులు…

మోడి ఎక్స్ ప్రెస్ టు అమెరికా, వయా ఆస్ట్రేలియా -2

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం యురేనియం సరఫరా అన్నది సమాన స్ధాయి వ్యాపార సంబంధాల్లో భాగంగా జరిగినది కాదు. భారత దేశం అమెరికా, దాని మిత్ర దేశాలతో వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక సంబంధాలను మరింత దృఢతరం చేసుకుని, అమెరికా శిబిరానికి మరింత దగ్గర అయ్యే భౌగోళిక రాజకీయ అవసరం రీత్యానే యురేనియం సరఫరా అవుతుంది. అనగా యురేనియం ఇంధనాన్ని ఇచ్చి ఇండియా నుండి చైనా-రష్యా శిబిరంపై వ్యతిరేకతను అమెరికా సంపాదిస్తోంది. ఇది దళారీ పాలకుల లక్షణాల్లో ఒకటి.…

ఆస్ట్రేలియా మీదుగా అమెరికా వెళ్ళు మోడి రైలు -1

భారత ప్రధాని నరేంద్ర మోడి నవంబరు 11 నుండి 20 వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళి వచ్చారు. మియాన్మార్ పర్యటనలో ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సభకు హాజరయిన మోడి ఆస్ట్రేలియా పర్యటనలో జి-20 గ్రూపు సమావేశాలకు హాజరయ్యాడు. ఈ పర్యటనలో మోడియే ప్రధాన ఆకర్షణ అని చెప్పుకుని భారత పత్రికలు మురిసిపోయాయి. వామపక్ష భావాలు కలిగి ఉన్నట్లు భావించే ది హిందు పత్రిక సైతం ఈ పత్రికల్లో ఒకటిగా ఉండడం గమనార్హం. అంటరాని నేతగా దాదాపు ప్రపంచం…

పడిపోనున్న 2014 Q2 వృద్ధి రేటు -అంచనా

2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికంలో (2014 Q1) 5.7 శాతం జి.డి.పి వృద్ధి రేటు సాధించడం తమ ఘనతే అని నరేంద్ర మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ2 ప్రభుత్వం చెప్పుకుంది. తమ ప్రభుత్వం దాదాపు మే నెల చివరి వరకు కొనసాగినందున 5.7 వృద్ధి రేటు తమ ఘనతే అని గత యు.పి.ఏ ప్రభుత్వం మోడి ప్రభుత్వంతో పోటీకి వచ్చింది. ఇప్పుడు 2014 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జి.డి.పి తగ్గడానికి కారణం…

శ్రీలంక మీదుగా తమిళనాట కమల వికాసం -కార్టూన్

సాధారణ ఎన్నికల్లో బి.జె.పి గెలుపుకి వాల్ స్ట్రీట్ కంపెనీలూ స్వయంగా రంగంలోకి దిగడం తెలిసిన విషయమే. సామ్రాజ్యవాద కంపెనీలు గనుక తమ అనుకూల ప్రభుత్వాలు వచ్చేలా చూసుకోవడం అవి ఎప్పుడూ చేసేపనే. కానీ సార్క్ సహోదరి శ్రీలంక ప్రభుత్వం సైతం తన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో బి.జె.పి పునాదులు విస్తరించడానికి సకరిస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. భారతీయ జనతా పార్టీలో వ్యూహ చతురుడుగా ప్రసిద్ధికెక్కిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, తమిళనాడులో కమలం…

స్నేహితా…! –కవిత

(ఈ కవిత 2001లో రాసింది. అంతకుముందు సంవత్సరం నా పుట్టిన రోజు నాడు మా డివిజనల్ మేనేజర్ పంపిన గ్రీటింగ్ కార్డ్ కు ‘ప్రణమీయ హితైషి’ కవితతో బదులిచ్చానని చెప్పా కదా. అది చూసి మా కొలీగ్ ఒకరికి తనకు కూడా నా చేత కవిత రాయించుకోవాలని తోచింది. కానీ నాకు స్ఫూర్తి తెప్పించడం ఎలా? అందుకు తానొక పధకం వేసుకున్నారు. సంవత్సర కాలం పాటు ఓపిక పట్టారు. తర్వాత యేడు పుట్టిన రోజుకి నేను నిద్ర…

గౌరవం పేరుతో జరిగే నేరం -ది హిందు ఎడిట్

(ది హిందు ఎడిటోరియల్ -22/11/2014- అనువాదం. -విశేఖర్) ____________   గౌరవాన్ని మోహరించడం అన్నది మహిళలపై అమలయ్యే సామాజిక నియంత్రణకు ఒక తీవ్ర రూపం. అది శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ. కుటుంబాలు, సామాజిక సమూహాలు, ఒకరి ‘గౌరవహీన’ చర్యలపై పుకార్లమారి పొరుగువారి గూఢచర్యం – ఎవరేమి ధరిస్తున్నారు, ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరేమి ఎగవేస్తున్నారు, ఎవరేమి అవలంబిస్తున్నారు- అన్నింటినీ ఆ తీక్షణ చూపుల ద్వారా పటం గీసేస్తారు. ఏదో ఒక హింసాత్మక రూపంతో కూడిన పితృస్వామిక ఆదేశ…

కనీవినీ ఎరుగని దోషారోపణ -ది హిందు ఎడిట్

(మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను 2జి కేసు విచారణ నుండి పక్కకు తప్పుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించిన పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ వ్యాసం. -విశేఖర్) ************** సి.బి.ఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా హయాం గురించి సానుకూలాంశం ఏదన్నా ఉందంటే అది, మరి కొద్ది రోజులలో ఆయన హయాం ముగింపుకు రావడమే. సున్నితమైన కేసుల్లో అత్యంత సామర్ధ్యంతో పరిశోధన చేసిన…

కమండలం నుండి కమేండోల వరకూ… -కార్టూన్

హిందూత్వ ప్రబోధకులు గొప్పగా చెప్పుకునే సనాతన స్వర్ణ యుగంలో మునులు, సాధువులు, బాబాలు, గురువులు ఏం చేసేవారు? ముక్కు మూసుకుని ఒంటికాలి తపస్సు చేసేవారు. హిమాలయాలకు చేరి పవిత్ర గంగా తీరాన లేదా మరో నది తీరాన కమండల ధారియై తపమాచరించెడివారు. సర్వసంగపరిత్యాగియై హరహర శంభో అంటూ దివ్యజ్ఞానార్ద్ధులై కఠోర బ్రహ్మచర్యం పాటించేవారు. శిష్యులను వెంటేసుకుని ధర్మ ప్రబోధం కావించేవారు. మనం చూడకపోయినా మన పుస్తకాలు, కధలు, బోధనలు ఈ సంగతి చెబుతాయి. మరి ఇప్పుడో! ఏ.సి…

ఫైర్ బు(బా)ల్ తో ఆడుకునే ప్రాణాంతక సరదా -ఫోటోలు

‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అని సామెత. కొమ్ములకు అంటించిన మంటలు చెలరేగి పోతుంటే భయంతో పరుగులు తీసే ఎద్దుతో ఆడుకుంటూ  స్పానియార్డ్ లు పడే సరదా చూస్తే ‘ఇదేం ఆనందం’ అనిపించక మానదు. కొమ్ములు తిరిగిన భారీ ఎద్దులతో పోరాటాలకు దిగడం స్పానిష్ సంస్కృతిలో భాగం అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఫైర్ బుల్ ఫెస్టివల్ (టోరో డి జుబిలో) పేరుతో స్పెయిన్ లో ఏటా జరిగే ప్రాణాంతక పండగ విషయం తెలిసింది తక్కువ…

కటకటాల సంత్ రాంపాల్

ఇంజనీర్ కమ్ సంత్ రాంపాల్ ఎట్టకేలకు కటకటాల వెనక్కి చేరారు. గారడీ విద్యలతో, బూటకపు శాస్త్ర పరిజ్ఞానంతో ఉత్తర, మధ్య భారతంలో అనేకమందిని తన భక్తులు/శిష్యులుగా చేసుకున్న సంత్ రాంపాల్ ను లొంగదీయడంలో పంజాబ్ & హర్యానా హై కోర్టు ఎట్టకేలకు సఫలం అయింది. 2010 నుండి కోర్టు జారీ చేసిన 43 సమన్లను లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చిన రామ్ పాల్ లోయర్ల జోలికి వెళ్లడంతో కటకటాల వెనక్కి చేరక తప్పలేదు. 2006లో…