చెన్నై జల విలయం -ఫోటోలు

జల విలయం అన్నది చిన్నమాట కావచ్చు. ఏకంగా ఫ్లై ఓవర్ రోడ్లే నిండా మునిగిపోయే వర్షం! ది హిందు ప్రకారం మునిగిపోయిన రోడ్ల సంఖ్య 6,857. 84 గంటల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకి తడవని వాడు వెధవ కిందే లెక్క! వంద యేళ్ళ తర్వాత ఈ స్ధాయిలో కురిసిన వర్షాన్ని కనీసం స్పర్శతోనన్నా అనుభవించనివాడు వెధవ కాక మరెవ్వరూ? నీటి కొరతతో సంవత్సరం పొడవునా అల్లాడుతూ గడిపే చెన్నై నగరాన్ని రాక రాక వచ్చి పలకరించిన…

చెన్నైపై లంగరు వేసిన అల్ప పీడనం -కార్టూన్

నవంబర్ 8 తేదీ నుండి కురుస్తున్న వర్షాలు చెన్నై నగరాన్ని ముంచివేసి నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడి చేసిన రెండు అల్ప పీడనాలు ఈ వర్షాలకు కారణం. అల్ప పీడనాలు కొత్తేమీ కాదు. అల్ప పీడనాలు ఏర్పడితేనే వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తరహాలో ఊహించని రీతిలో వర్షపాతం ఇచ్చే అల్ప పీడనాలే కొత్త. ఎల్-నినో పుణ్యమా అని ఈ యేడు నైరుతి ఋతుపవనాలు పెద్దగా వర్షాలను ఇవ్వలేదు. దేశం మొత్తం మీద…

వృత్తిలోకి ప్రవృత్తిని ఒంపితే ఈ అద్భుతాలు -ఫోటోలు

ఆయన వృత్తి రీత్యా రైల్వే టికెట్ కలెక్టర్. ఆయన ప్రవృత్తి మాత్రం పెయింటింగ్. ఆర్ట్ లేకుండా ఆయన లేరు. పెయింటింగ్ లేకపోతే తన బతుకే వృధా అనుకున్న బిజయ్ బిశ్వాల్ తల్లి దండ్రుల ఒత్తిడితో సంపాదన కోసం టికెట్ కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. అంతటితో గీతలు మానేస్తాడని తెలిసినవారు భావించగా దానికి బదులు తన వృత్తిని కూడా తన ప్రవృత్తికి అనుకూలంగా మార్చుకున్నారు. తన వృత్తిలోకి తన చిన్నతనం నుండి కాపాడుకుంటూ వచ్చిన ప్రవృత్తిని ఒంపుకుని అటు…

అనుపమ్ ఖేర్ తిక్క లాజిక్!

అనుపమ్ ఖేర్ తో సహా హిందూత్వ (హిందూ మతావలంబకులు కాదు) గణాలు చెబుతున్న మాట, అమీర్ ఖాన్ దేశాన్ని అవమానించాడని. తన (భార్య) వ్యాఖ్యల ద్వారా అమీర్ కుటుంబం దేశం పరువు తీశారని, సిగ్గుపడేలా చేశారని విమర్శించారు. విచిత్రం ఏమిటంటే ఒక పక్క అమీర్ ఖాన్ భార్య అన్న మాటల్ని తప్పు పడుతూనే మరో పక్క ఆ మాటలు ఖండించే హక్కు మాకూ ఉందని వాదనలు చేయడం. ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. అమీర్ ఖాన్ భార్య…

ప్యారిస్ దాడులు ఎవరి పని? -ఫోటోలు

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో నవంబర్ 13 సాయంత్రం మొదలుకొని నవంబర్ 14 తెల్లవారు ఝాము వరకు వరసపెట్టి ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇరాక్, సిరియాలలో కొన్ని భాగాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ కాలిఫెట్ ను ఏర్పాటు చేసిందని పశ్చిమ పత్రికలు ఘనంగా ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్ ఈ దాడికి కారకులుగా, విచారణ కనీసం మొదలు కాకుండానే, ఫ్రాన్స్…

కాస్త అసహనం ఉన్నది నిజమే -వెంకయ్య

‘ఎక్కడ అసహనం, ఆయ్?’ అని దబాయించిన వారికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడు సమాధానం ఇచ్చారు. అసహనంపై రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన “మన సమాజంలో ‘కొంత మొత్తంలో’ అసహనం ఉన్నమాట నిజమే. దానిని గుర్తించి దానితో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది” అని వెంకయ్య అంగీకరించారు. తన ఒప్పుకోలు -పాక్షికంగానే అయినా- ద్వారా  ఆయన దేశంలో అసహనమే లేదు పొమ్మని నిరాకరించిన హిందూత్వ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు.…

లౌకికవాదం మరియు రాజ్యాంగం -ది హిందు ఎడిట్..

[‘Secularism and the Constitution’ శీర్షికన నవంబర్ 30 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] ************ దేశంలో సహనం లేదా సహన రాహిత్యంపై  ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయమై ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలు (తమదంటూ) ఓ స్పష్టతను చేర్చాలని భావించబడుతోంది. కానీ ఈ అంశాన్ని చేపట్టక మునుపే బిజెపి నేతృత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం, రాజ్యాంగం ప్రబోధించిన విలువలను ఈ రోజు ఏ మేరకు అర్ధం చేసుకున్నారన్న అంశంపై చర్చ…

అసహనంపై రువ్విన అస్త్రం ‘బుక్కెడు బువ్వ’ కధ!

” సోదరులారా…మనది ఎంతో సంపన్న దేశం….” ” మూడురోజులైంది బాబూ అన్నం తిని… ఒక్క రూపాయి దరమం చేయి బాబూ……” బిచ్చగాడూ దీనంగా వేడుకుంటున్నాడు. ” సోదరులారా మనది ఎంతో విశిష్ట సంస్కృతి, ఘనమైన వారసత్వం గల దేశం మనది.” ” సచ్చి మీ కడుపున పుడతాను బాబూ…ఒక్క రూపాయి ధర్మ చేయండి బాబూ…” ” ఎంతో సహనశీలత గల దేశం మనది….” ” ఏరా దొంగ నా కొడుకా. అడుక్కోవడానికి నీకు ఈ మీటింగే కనపడిందా.…

అరుణుడి పరిణామంబెట్టిదనిన…! -కార్టూన్

అరుణుడు అంటే అంగారకుడు కాదు. మన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు! పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకూ బి.జె.పి ప్రభుత్వ నేతల ప్రకటనల పరిణామాన్ని గమనించినట్లయితే వారు ఒక్కో మెట్టూ దిగుతూ రావడం మనకు కనిపిస్తుంది. లోక్ సభ ఎన్నికలు ముగిసి ఫలితం వచ్చాక బి.జె.పి నేతల ఆర్భాటపు ప్రకటనలు, ‘ఇక చూస్కోండి’ అన్నట్లుగా వారు మైకుల ముందు ప్రదర్శించిన భంగిమలు… ఆ తీరే వేరు. అదో ఊర్ధ్వ లోకం! ఢిల్లీ అసెంబ్లీ…

ఎక్కడ అసహనం, ఆయ్?

అసహనమా? ఏదీ చూపించు… చూపించు ఎక్కడో? ************ అమీర్ ఖాన్ అలా మాట్లాడుతున్నాడంటేనే భారత దేశం ఎంత సహన దేశమో చెప్పడానికి ఒక రుజువు అని హిందూత్వ అభిమాన గణం గొప్పలు పోతోంది. కానీ అమీర్ ఖాన్ మాటల్ని ‘ఎవరో ప్రభావంలో ఉండి మాట్లాటలు’ అనీ, ‘అయితే ఏ దేశం వెళ్తావో అదీ చెప్పు!’ అనీ ‘పాకిస్తాన్ వెళ్లిపో, ఫో!’ అనీ, ‘దేశాన్ని కించపరుస్తావా?’ అనీ, ‘నీసలు దేశభక్తి ఉందా?’ అనీ, ‘ఎన్ని అవమానాలు భరించినా అంబేద్కర్…

అమీర్ ఖాన్ మాట్లాడే హక్కు -ది హిందు ఎడిటోరియల్

[“Aamir Khan’s right to speak” శీర్షికన ఈ రోజు (నవంబర్ 26) ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] **************** భారతీయ జనతా పార్టీ పరివారం సవరించుకున్న లెక్కలో ఇప్పుడు అమీర్ ఖాన్ ఇండియాకు చెడ్డపేరు తెస్తున్న విలన్. రచయితలు, నటులు, శాస్త్రవేత్తలకు మద్దతుగా వస్తూ, తన సొంత ఆందోళనకు, బహుశా మాటల ఒరవడిలో, మరోచోటికి వెళ్లవలసి వస్తుందా అంటూ తన భార్య వ్యక్తపరిచిన ఆతృత మరియు ఆలోచనలకు గొంతుక ఇవ్వడం…

నువ్వు పులివి, పులిలా పరుగెత్తు! -కార్టూన్

ప్రధాని మోడి: నూవ్వింకా వేగంగా పరుగెత్తాల్సి ఉంది. వాళ్లందరికీ నేను నువ్వు పులివి అని చెప్పి వస్తిని… ****************** సింగపూర్ లో భారత ప్రధాని చేసిన ప్రసంగం వింటే నోటిపై వేలు వేసుకోకుండా ఉండలేము. ఆయన తన మాటల మాయాజాలంతో ఆకాశంలో విహరింపజేస్తూ చెప్పింది ఏ ఇండియా గురించో అర్ధంకాక తలలు పట్టుకోకుండా ఉండలేము. తాము అధికారం చేపట్టిన 18 నెలలు గడిచాయో లేదో అప్పుడే భారత దేశం వెనకడుగు మానుకుని చుక్కల్లోకి దూసుకు పోతోందట! “ప్రపంచం…

మేము దేశం వదిలి వెళ్ళేది లేదు -అమీర్ ఖాన్

రామ్ నాధ్ గోయెంకా జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవంలో అమీర్ ఖాన్ చెప్పిన మాటలపై రేగిన రగడ కొనసాగుతోంది. కేంద్ర మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి ఖండన మండనలు జారీ చేస్తూ అమీర్ ప్రకటనకు పెడార్ధాలు తీస్తున్న నేపధ్యంలో అమీర్ ఖాన్ మరోసారి స్పందించాడు. తాను చెప్పిందేమిటో పూర్తిగా చదివి మాట్లాడాలని కోరారు. తనకు గానీ, తన భార్యకు గానీ భారత దేశం వదిలి వెళ్ళే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. తప్పుడు అర్ధాలు తీస్తున్నవారు తాను చెప్పిందేమిటో…

అమీర్ ఖాన్: ఛీత్కారాలు, అభినందనలు!

సినిమాల్లో విజయవంతమైన కెరీర్ తో సరిపెట్టుకోకుండా, ‘సత్యమేవ జయతే’ పేరుతో టి.విలో కార్యక్రమం నిర్వహించడం ద్వారా అనేకమంది భారతీయుల మన్ననలు అందుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ‘పరమత సహనం/అసహనం’ పై దేశంలో చెలరేగిన రాజకీయ మరియు అరాచకీయ దుమారం  నుండి దూరంగా నిలబడి తప్పించుకోవడానికి బదులు అటో, ఇటో ఒక మాట విసిరి తానూ ఉన్నానని నిరూపించుకునే సెలబ్రిటీలు చాలా తక్కువమందే. ఒకవేళ ఎవరన్నా ముందుకు వచ్చినా కర్ర విరగ…

పిల్లలు ‘మానవ స్వరూపులు!’ -ఫోటోలు

“పిల్లలు దైవ స్వరూపులు” అని పెద్దరికం నెత్తిన వేసుకున్న పెద్దలు అంటుంటే మనం వింటుంటాం. దైవానికి లక్షోప లక్షల రూపాలు ఇచ్చుకున్న మనుషులు అందులో ఏ రూపాన్ని తమ తమ పిల్లలకు ఇచ్చుకుంటారో ఊహించడం కష్టం. ‘అసలు దైవానికి రూపం ఏమిటి? అదొక భావన’ అనేవాళ్లూ ఉన్నారు. వారు కూడా ‘పిల్లలు-దేవుళ్ళ’ సామెతను వల్లించడం కద్దు. వారి ఉద్దేశ్యంలోనేమో పిల్లలు రూపరహితులు అన్న పెడార్ధం వచ్చే ప్రమాదం ఉన్నది. ఇలా ఏ విధంగా చూసినా ‘పిల్లలు దైవ…