బేసి-సరి: ముంబైకి కూడా కావాలి -ఎన్‌సి‌పి

కాలుష్యం తగ్గించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమ ఢిల్లీ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న బేసి-సరి పధకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకాన్ని ముంబై నగరంలో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్‌సి‌పి నేతల డిమాండ్ ను తాము పరిశీలిస్తున్నామని బి.జె.పి ప్రభుత్వ మంత్రులు కూడా చెప్పడం విశేషం. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకం విజయవంతం అయినట్లతే దానిని ముంబైలో కూడా అమలు…

ఇండియాలో అసమానతలు: సంపదలన్నీ ఆ ఒక్కరివే -వీడియో

– – ఈ వీడియోను తిరుపాలు గారు వ్యాఖ్య రూపంలో అందజేశారు. కాస్త ఓపిక చేసుకుని పూర్తి వీడియోను కనీసం ఒక్కసారన్నా చూడండి. కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలుస్తాయి. భారత దేశంలోని పాలకవర్గాల పూర్తి ఆమోదంతో, సామ్రాజ్యవాద విదేశీ యాజమానుల ఒత్తిడితో పి.వి.నరసింహారావు – డా. మన్మోహన్ సింగ్ ల ద్వయం ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాల వల్ల ఉన్నత స్ధాయి సంపన్నులు భారీ లాభం పొందగా కింద ఉన్నవారు బాగా నష్టపోయారని వీడియో ద్వారా…

పఠాన్ కోట్ దాడి: మెచ్చుకున్నోళ్లు ఒక్కరూ లేరు!

పఠాన్ కోట్ దాడి పట్ల కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత స్ధాయి శిక్షణ పొందిన ఏడుగురు  భద్రతా సిబ్బందిని పోగొట్టుకుని కూడా నాలుగు రోజుల పాటు ఆపరేషన్ కొనసాగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడి మొదలుకుని భద్రతా బలగాలను తరలించిన తీరు, ఆపరేషన్ కొనసాగుతుండగా మంత్రులు, నేతలు చేసిన ప్రకటనలు, ఏం జరుగుతున్నదో సాక్షాత్తు హోమ్ మంత్రికి కూడా తెలియని అయోమయం, మరణాల సంఖ్య, ఉగ్రవాదుల సంఖ్య…

ఫ్రీ డేటా కోసం ఫేస్ బుక్ విసిరిన గేలం ‘ఫ్రీ బేసిక్స్’ -కార్టూన్

ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకర్ బర్గ్ పేరు ఈ మధ్య ఇండియాలో తరచుగా వినిపిస్తోంది. భారత దేశంలోని పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’ ఇందుకు ప్రధాన కారణం. Free Basics పేరుతో ఫేస్ బుక్ కంపెనీ అందుబాటులో ఉంచుతున్న వేదిక ద్వారా పేద ప్రజలు సైతం ఉచితంగా ఇంటర్నెట్ సేవలను, విద్య-వైద్య-ప్రయాణ-ఉపాధి-ఆరోగ్య-వార్తా సేవలను పొందవచ్చని ఫేస్ బుక్ ఊరిస్తోంది. ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం…

చర్చల వైఫల్యానికే పఠాన్ కోట్ దాడి -చైనా

భారత్-పాక్ చర్చలకు అనుకోనివైపు నుండి మద్దతు లభించింది. బ్రిక్స్ కూటమిలో ప్రధాన దేశమైన చైనా పఠాన్ కోట్ దాడిపై స్పందించింది. పఠాన్ కోట్ లోని భారత సైనిక వైమానిక స్ధావరంపై జరిగిన ఉగ్రవాద దాడి పొరుగు దేశాల మధ్య జరగనున్న చర్చలను చెడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చైనా వ్యాఖ్యానించింది. పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాద దాడిని చైనా ప్రభుత్వ ప్రతినిధి హువా చున్ యింగ్ ఖండించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న…

అది ఓడ కాదు, ఒక నగరం! -ఫోటోలు

ప్రపంచంలో అత్యంత పెద్ద ఒడల్లో ‘ఎపిక్’ ఒకటి. 1.53 లక్షల టన్నులు తూగే ఎపిక్ ఓడ చిన్న దేశం నార్వే లోని వ్యాపారస్ధులకు చెందినది. ప్రస్తుతానికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఓడగా పరిగణించబడుతున్న ఎపిక్ ని ప్రయాణీకులను చేరవేసే నిమిత్తం 2010లో నిర్మించారు. ఎపిక్ కంటే పెద్ద ఓడలు 3 ఉన్నప్పటికీ ఇందులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ఏ ఓడ లోనూ లేవని చెబుతున్నారు. డెక్ పైన ఉన్న పెద్ద వాటర్ పార్క్ ప్రయాణీకులకు ఒక ఆకర్షణ.…

ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ లను వేధిస్తున్న సి.బి.ఐ

బి.జె.పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సి.బి.ఐ తమ ప్రభుత్వంలోని ఐ‌ఏ‌ఎస్ అధికారులను ప్రతి రోజూ వేధిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. దానితో వారంతా భయకంపితులై లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్టల్లా వింటున్నారని వెల్లడించారు. నూతన సంవత్సరం రోజున ది హిందు పత్రికకు కేజ్రీవాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడి చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంపై ఏ విధంగా కక్ష సాధిస్తున్నదీ వివరించారు. DANICS అధికారులు, ఇతర…

పఠాన్ కోట్ దాడి: పాక్ తో చర్చలు నిలిపేస్తారా?

బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా ఎల్లప్పుడూ వ్యతిరేకించిన అంశం: పాక్ తో చర్చలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ తో చర్చలు ఎలా చేస్తారని బి.జె.పి ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఆగ్రహావేశాలు ప్రకటిస్తూ ఉండేది. పాక్ వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టేది. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం అని తిట్టిపోసేది. ఇప్పుడు అదే పాకిస్తాన్ తో మిత్రత్వానికి ప్రధాని నరేంద్ర మోడి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది కూడా ‘అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసే’ ఆకస్మిక పాకిస్ధాన్ సందర్శన ద్వారా ‘పాక్…

‘బ్లాగ్ వేదిక’ ద్వారా ‘తెలుగువార్తలు’కు రండి!

ఎందుకో కారణం చెప్పలేదు గాని కూడలి అగ్రి గేటర్ ను నిర్వాహకులు ఆపేశారు. కినిగె నిర్వాహకులే కూడలిని కూడా నిర్వహిస్తున్నారని ‘బహుశా కినిగె పనిలో మునిగి ఉన్నందున సమయం చాలక పోయి ఉండవచ్చు’ అని కొందరు మిత్రులు చెప్పారు. తెలుగు బ్లాగులకు సేవ చేయడంలో కూడలి ఎంతో పేరు తెచ్చుకుంది. అత్యధిక బ్లాగు పాఠకులు, సందర్శకులు కూడలి ద్వారానే బ్లాగ్ లకు రావడానికి అలవాటు పడిపోయారు. దానితో ‘కూడలి ఇక లేదు’ అన్న ప్రకటన కూడలి వెబ్…

నిజాయితీ గల ‘మౌత్ పీస్’ -కార్టూన్

“నిజాయితీ మౌత్ పీస్ లు ఇంకా ఎవరన్నా ఉన్నారా?” — కాంగ్రెస్ పార్టీ ముంబై విభాగం ‘కాంగ్రెస్ దర్శన్’ పేరుతో ఒక పత్రిక నడుపుతుంది. ఈ పత్రిక ఇటీవల కాశ్మీర్ పట్ల నెహ్రూ విధానాన్ని విమర్శిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్ ఎవరు రాశారో పేరు వేయలేదు. అప్పటి హోమ్ మంత్రి వల్లబ్ భాయ్ పటేల్ సలహాలను పెడ చెవిన పెట్టి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీర్ సమస్యపై ఐక్య రాజ్య…

ఢిల్లీ కాలుష్యం: బేసి-సరి పధకం విజయవంతం! -ఫోటోలు

బి.జె.పి నేతల శాపనార్ధాలను వమ్ము చేస్తూ ఢిల్లీలో బేసి-సరి పధకం విజయవంతం అయింది. ఢిల్లీ ప్రజలు అద్భుతమైన రీతిలో తమ పధకానికి స్పందించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలో మిగిలిన ప్రాంతాలకు ఢిల్లీ దారి చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వం అమలు చేస్తున్నది కాదని ప్రజలే దానిని సొంతం చేసుకున్నారని ప్రభుత్వం వారికి కేవలం సహాయం మాత్రమే చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం విశేషం. ప్రపంచంలో అత్యధిక కలుషిత గాలి కలిగిన నగరంగా…

2015లో తెలుగు వార్తలు బ్లాగ్ -సమీక్ష

ఈ సమీక్ష నేను చేసింది కాదు. ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళు ఈ సమీక్షను ప్రకటిస్తూ దానిని బ్లాగ్ లో ప్రచురించే అవకాశం ఇచ్చారు. సమీక్షలోని ముఖ్య అంశాలు: 2015లో మొత్తం వీక్షణలు 250,000 చిల్లర ఎక్కువ వీక్షణలు పొందిన టపా – చెన్నై జల విలయం -ఫోటోలు ఎక్కువ టపాలు పోస్ట్ చేసిన వారం – గురువారం ఎక్కువ మంది సందర్శకులు కూడలి నుండి రాగా ఆ తర్వాత గూగ్ల్ సర్చ్ ఇంజన్ నుండీ, ఫేస్ బుక్…

అధికారుల సస్పెన్షన్: ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ ల సామూహిక సెలవు

ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ అధికారులు ఏ‌ఏ‌పి ప్రభుత్వంపై సమ్మె ప్రకటించారు. వందల మంది అధికారులు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లారు. కొందరు రోజంతా సెలవు తీసుకోగా మరికొందరు ఒక పూట సెలవులో వెళ్లారు. ఇదంతా తమలో ఇద్దరు అధికారులను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు! అధికారుల సెలవు వల్ల ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తలపెట్టిన బేసి-సరి సంఖ్యల (నంబర్ ప్లేట్లు) వాహన పధకం అమలుకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం తలెత్తింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదించే కౌన్సెళ్ళకూ పబ్లిక్…

అమెరికా వీసా ఫీజు పెంపులో హ్రస్వదృష్టి -ది హిందు

[Short-sighted hike in U.S. visa fee శీర్షికన ఈ రోజు ది హిందులో వెలువడిన సంపాదకీయానికి యధాతధ అనువాదం] ********** అమెరికాలో తాత్కాలిక పని కోసం వచ్చే వృత్తిగత నిపుణులకు వీసా ఫీజు పెంచుతూ బారాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐ.టి రంగంలోని భారతీయ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. ఈ చర్య వల్ల సంవత్సరానికి 400 మిలియన్ డాలర్ల (రమారమి రు. 2640 కోట్లు) నష్టం వస్తుందని (భారత సాఫ్ట్ వేర్) వాణిజ్య సంఘం…

కొత్త పార్లమెంటు… స్వేచ్ఛగా కొట్లాడ్డానికి! -కార్టూన్

“నిజమే సుమా. ఇప్పుడు మరీ ఇరుకై పోయింది -ముఖ్యంగా వెల్ ఆఫ్ ద హౌస్ లో…” ____________________________ పార్లమెంటు కోసం కొత్త భవనం కావాలని స్పీకర్ కోరారు. ************ పార్లమెంటు కార్యకలాపాల కోసం కొత్త భవనం కావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు ఆమె రెండు ఆప్షన్ లను ప్రభుత్వం ముందు పెడుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారికి లేఖ కూడా రాశారు. ఇపుడున్న పార్లమెంటు కాంప్లెక్స్…