ప్రశ్న: స్టార్టప్ కంపెనీ అంటే?

జి అమర్ నాధ్: ఈ మధ్య ‘స్టార్టప్ కంపెనీ’ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. కాస్త ఐడియా ఉన్నట్లు అనిపిస్తున్నా పత్రికల్లో కనిపిస్తున్న పదాలు (ఉదా: ఇంక్యుబేటర్) కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. కాస్త వివరించి చెప్పగలరా? సమాధానం: సరైన సమయంలో వేసిన ప్రశ్న. గత సంవత్సరం ఆగస్టు 15 తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ‘స్టార్టప్ ఇండియా; స్టాండప్ ఇండియా’ పేరుతో ఓ పధకాన్ని ‘మన్ కీ బాత్’ రేడియా ప్రసంగంలో ప్రకటించారు. పధకం…

సునంద: సహజ మరణం కాదు -ఎఫ్.బి.ఐ

కేరళ కాంగ్రెస్ నాయకుడు, ఐక్యరాజ్య సమితి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి శశి ధరూర్ మరోసారి తప్పుడు కారణాలతో వార్తలకు ఎక్కారు. వార్త పాతది కాకపోయినా వార్త చదివిన గొంతు కొత్తది. శశి ధరూర్ భార్య మరణం సహజమైనది కాదని అమెరికా ఫెడరల్ పోలీసు పరిశోధనా సంస్ధ ఎఫ్.బి.ఐ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. తాజా అంటే మరీ తాజా కాదు. ఢిల్లీ పోలీసులకి ఎఫ్.బి.ఐ నివేదిక అంది…

బేసి-సరి అమలు: ఒక పరిశీలన

కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకం వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గిందా లేదా అన్నది కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే. కావాలంటే దానికీ సమాధానం చెప్పుకుందాం, ఉందో లేదో అని! ఢిల్లీ ప్రభుత్వం స్వల్పంగా కాలుష్యం తగ్గింది అని చెబుతోంది. కాదు.., స్వల్పంగా కూడా తగ్గలేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం భావిస్తున్నంతగా తగ్గలేదు కావచ్చు కూడా. ఎందుకంటే… 2013లో కాన్పూర్ ఐ‌ఐ‌టి వారు ఢిల్లీలో సర్వే మరియు పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ గాలిలో…

బేసి-సరి: పిటిషనర్లకు సుప్రీం పెనాల్టీ మందలింపు

ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకానికి భారత దేశ అత్యున్నత న్యాయస్ధానం నుండి మద్దతు లభించింది. పధకానికి వ్యతిరేకంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పిటిషన్ దారులను తీవ్రంగా మందలించింది. ప్రచారం కోసం పిచ్చి వేషాలు వేస్తే భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. “కాలుష్యంతో జనం చచ్చిపోతున్నారు. మేము కూడా కార్-పూలింగ్ పాటిస్తున్నాం. మీరేమో ఆ పధకాన్ని సవాలు చేస్తారా?” అని చీఫ్ జస్టిస్ టి ఎస్ ఠాకూర్ పిటిషనర్లను సూటిగా ప్రశ్నించారు. పిటిషనర్లు అప్పటికే…

పి‌డి‌పి ఆరోపణ: కాశ్మీర్ సి.ఎంని గౌరవించని మోడి!

జమ్ము & కాశ్మీర్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ కు తగిన గౌరవాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడి ఇవ్వలేకపోయారని పి‌డి‌పి నేత, దివంగత నేత కుమార్తె మెహబూబా ముఫ్తి భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ముఫ్తి మహమ్మద్ సయీద్ విగత దేహం ఢిల్లీ ఆసుపత్రిలో ఉండగా సందర్శించడమే కాకుండా ప్రత్యేకంగా శ్రీనగర్ వెళ్ళి మరీ మెహబూబాను ఓదార్చిన నేపధ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా ఉండగా జబ్బు పడి ఎయిమ్స్…

జైట్లీపై విచారణ చట్ట విరుద్ధం -కేంద్రం

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని ఆరోపించబడుతున్న డి‌డి‌సి‌ఏ కుంభకోణంపై విచారణ చట్ట విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ‘సలహా ఇవ్వండి’ అంటూ లేఖ రాయించుకుని ఆనక ‘ఆ విచారణ చట్టబద్ధం కాదు’ అని బి.జె.పి ప్రభుత్వం ప్రకటించేసింది. ‘అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ చట్ట విరుద్ధం’ అని నిర్ధారించిన మొట్ట మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం ఘనతను మూటగట్టుకుంది. ‘అవినీతిని అంతం…

బేసి-సరి: ముంబైకి కూడా కావాలి -ఎన్‌సి‌పి

కాలుష్యం తగ్గించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమ ఢిల్లీ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న బేసి-సరి పధకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకాన్ని ముంబై నగరంలో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్‌సి‌పి నేతల డిమాండ్ ను తాము పరిశీలిస్తున్నామని బి.జె.పి ప్రభుత్వ మంత్రులు కూడా చెప్పడం విశేషం. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకం విజయవంతం అయినట్లతే దానిని ముంబైలో కూడా అమలు…

ఇండియాలో అసమానతలు: సంపదలన్నీ ఆ ఒక్కరివే -వీడియో

– – ఈ వీడియోను తిరుపాలు గారు వ్యాఖ్య రూపంలో అందజేశారు. కాస్త ఓపిక చేసుకుని పూర్తి వీడియోను కనీసం ఒక్కసారన్నా చూడండి. కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలుస్తాయి. భారత దేశంలోని పాలకవర్గాల పూర్తి ఆమోదంతో, సామ్రాజ్యవాద విదేశీ యాజమానుల ఒత్తిడితో పి.వి.నరసింహారావు – డా. మన్మోహన్ సింగ్ ల ద్వయం ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాల వల్ల ఉన్నత స్ధాయి సంపన్నులు భారీ లాభం పొందగా కింద ఉన్నవారు బాగా నష్టపోయారని వీడియో ద్వారా…

పఠాన్ కోట్ దాడి: మెచ్చుకున్నోళ్లు ఒక్కరూ లేరు!

పఠాన్ కోట్ దాడి పట్ల కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత స్ధాయి శిక్షణ పొందిన ఏడుగురు  భద్రతా సిబ్బందిని పోగొట్టుకుని కూడా నాలుగు రోజుల పాటు ఆపరేషన్ కొనసాగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడి మొదలుకుని భద్రతా బలగాలను తరలించిన తీరు, ఆపరేషన్ కొనసాగుతుండగా మంత్రులు, నేతలు చేసిన ప్రకటనలు, ఏం జరుగుతున్నదో సాక్షాత్తు హోమ్ మంత్రికి కూడా తెలియని అయోమయం, మరణాల సంఖ్య, ఉగ్రవాదుల సంఖ్య…

ఫ్రీ డేటా కోసం ఫేస్ బుక్ విసిరిన గేలం ‘ఫ్రీ బేసిక్స్’ -కార్టూన్

ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకర్ బర్గ్ పేరు ఈ మధ్య ఇండియాలో తరచుగా వినిపిస్తోంది. భారత దేశంలోని పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’ ఇందుకు ప్రధాన కారణం. Free Basics పేరుతో ఫేస్ బుక్ కంపెనీ అందుబాటులో ఉంచుతున్న వేదిక ద్వారా పేద ప్రజలు సైతం ఉచితంగా ఇంటర్నెట్ సేవలను, విద్య-వైద్య-ప్రయాణ-ఉపాధి-ఆరోగ్య-వార్తా సేవలను పొందవచ్చని ఫేస్ బుక్ ఊరిస్తోంది. ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం…

చర్చల వైఫల్యానికే పఠాన్ కోట్ దాడి -చైనా

భారత్-పాక్ చర్చలకు అనుకోనివైపు నుండి మద్దతు లభించింది. బ్రిక్స్ కూటమిలో ప్రధాన దేశమైన చైనా పఠాన్ కోట్ దాడిపై స్పందించింది. పఠాన్ కోట్ లోని భారత సైనిక వైమానిక స్ధావరంపై జరిగిన ఉగ్రవాద దాడి పొరుగు దేశాల మధ్య జరగనున్న చర్చలను చెడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చైనా వ్యాఖ్యానించింది. పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాద దాడిని చైనా ప్రభుత్వ ప్రతినిధి హువా చున్ యింగ్ ఖండించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న…

అది ఓడ కాదు, ఒక నగరం! -ఫోటోలు

ప్రపంచంలో అత్యంత పెద్ద ఒడల్లో ‘ఎపిక్’ ఒకటి. 1.53 లక్షల టన్నులు తూగే ఎపిక్ ఓడ చిన్న దేశం నార్వే లోని వ్యాపారస్ధులకు చెందినది. ప్రస్తుతానికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఓడగా పరిగణించబడుతున్న ఎపిక్ ని ప్రయాణీకులను చేరవేసే నిమిత్తం 2010లో నిర్మించారు. ఎపిక్ కంటే పెద్ద ఓడలు 3 ఉన్నప్పటికీ ఇందులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ఏ ఓడ లోనూ లేవని చెబుతున్నారు. డెక్ పైన ఉన్న పెద్ద వాటర్ పార్క్ ప్రయాణీకులకు ఒక ఆకర్షణ.…

ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ లను వేధిస్తున్న సి.బి.ఐ

బి.జె.పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సి.బి.ఐ తమ ప్రభుత్వంలోని ఐ‌ఏ‌ఎస్ అధికారులను ప్రతి రోజూ వేధిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. దానితో వారంతా భయకంపితులై లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్టల్లా వింటున్నారని వెల్లడించారు. నూతన సంవత్సరం రోజున ది హిందు పత్రికకు కేజ్రీవాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడి చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంపై ఏ విధంగా కక్ష సాధిస్తున్నదీ వివరించారు. DANICS అధికారులు, ఇతర…

పఠాన్ కోట్ దాడి: పాక్ తో చర్చలు నిలిపేస్తారా?

బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా ఎల్లప్పుడూ వ్యతిరేకించిన అంశం: పాక్ తో చర్చలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ తో చర్చలు ఎలా చేస్తారని బి.జె.పి ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఆగ్రహావేశాలు ప్రకటిస్తూ ఉండేది. పాక్ వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టేది. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం అని తిట్టిపోసేది. ఇప్పుడు అదే పాకిస్తాన్ తో మిత్రత్వానికి ప్రధాని నరేంద్ర మోడి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది కూడా ‘అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసే’ ఆకస్మిక పాకిస్ధాన్ సందర్శన ద్వారా ‘పాక్…

‘బ్లాగ్ వేదిక’ ద్వారా ‘తెలుగువార్తలు’కు రండి!

ఎందుకో కారణం చెప్పలేదు గాని కూడలి అగ్రి గేటర్ ను నిర్వాహకులు ఆపేశారు. కినిగె నిర్వాహకులే కూడలిని కూడా నిర్వహిస్తున్నారని ‘బహుశా కినిగె పనిలో మునిగి ఉన్నందున సమయం చాలక పోయి ఉండవచ్చు’ అని కొందరు మిత్రులు చెప్పారు. తెలుగు బ్లాగులకు సేవ చేయడంలో కూడలి ఎంతో పేరు తెచ్చుకుంది. అత్యధిక బ్లాగు పాఠకులు, సందర్శకులు కూడలి ద్వారానే బ్లాగ్ లకు రావడానికి అలవాటు పడిపోయారు. దానితో ‘కూడలి ఇక లేదు’ అన్న ప్రకటన కూడలి వెబ్…