వర్షాలు లేవు గానీ… -కార్టూన్

వర్షాలు లేవు గానీ ఎన్నికల పుణ్యాన వాగ్దానాలు వరదై పారుతున్నాయి. హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో బి‌జే‌పి నేత నరేంద్ర మోడి ఎన్ని వాగ్దానాలు కురిపించారో గుర్తుందా? విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు జమ చేయిస్తాం. ‘నేషనల్ రూరల్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మిషన్’ ద్వారా గ్రామాలకు టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్ కేర్ వసతి…

భూసంస్కరణలు: జపాన్, ఇండియాల మధ్య తేడాలు -16

  భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 16 – (15వ భాగం తరువాత……………..) – 1947 అనంతర కాలంలో రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్యా, ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యా వ్యత్యాసాలు ఉన్నాయి. తక్కువ వాణిజ్యీకరణ చెందిన ప్రాంతాలలో -ముందు చూసినట్లుగా- ప్రత్యక్ష ఉత్పత్తిదారుల నుండి మిగులు గుంజుకోవడంలో భూమిపై వ్యవసాయ కౌలు, వినియోగ రుణాలపై వడ్డీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మెరుగైన వాణిజ్యీకరణ జరిగిన ప్రాంతాల్లో ముడి సరుకులు, ఉత్పత్తుల వాణిజ్యం లతో సంబంధం…

అగస్టా ఛాపర్: సోనియాను ఇరికించే మాయోపాయం?

4 రాష్ట్రాల ఎన్నికలు జనానికి ముఖ్యంగా పత్రికల పాఠకులకు, చానెళ్ల వీక్షకులకు గడ్డు రోజులు తెచ్చి పెట్టాయి. ఎన్నికల ప్రచారం అంటే ప్రజలు తమ ఎంపిక కోసం తమ ముందు ఏ యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడం. ఇలాంటి అవకాశాలను ప్రజల ముందు ఉంచే పంధా నుండి రాజకీయ పార్టీలు ఎప్పుడో తప్పుకోవడం ఎన్నికల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అదనపు సమస్య. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో వారి చేతుల్లో ఉన్న ఒక ప్రధాన…

చర్చ: భారత వ్యవసాయంలో పెట్టుబడి – మౌలిక పరిశీలన 15

భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 15 – చాప్టర్ VI (14 వ భాగం తరువాత…..) చర్చ భారత వ్యవసాయంలో ఉత్పత్తి విధానాన్ని అర్ధం చేసుకోవాలంటే మనం భారత సామాజిక వ్యవస్ధలోని ఉత్పత్తి సంబంధం ప్రధాన ధోరణి ఏమిటో  లేక ఏ ఉత్పత్తి సంబంధం ఆధిపత్యం వహిస్తున్నదో గుర్తించాలి. ‘వివిధ స్వచ్చమైన ఉత్పత్తి విధానాలు నిర్దిష్ట పద్ధతిలో ఒకదానిపై మరొకటి విస్తరించి ఉన్నసామాజిక ఏర్పాటు’గా భారత దేశ ఉత్పత్తి విధానాన్ని వివరించే చర్చలోకి…

ఆదర్శ అవినీతి వటవృక్షం వేళ్ళు పెగిలేనా? -కార్టూన్

“భారత రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారుల అవినీతికీ, అత్యాశకూ నిలువెత్తు గుర్తుగా నిలిచిన ఆదర్శ హౌసింగ్ సొసైటీ టవర్ ని కూల దోయండి” అని ముంబై హై కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 29) తీర్పు ప్రకటించింది. “ఈ అవినీతిలో భాగం పంచుకున్న నేతలు, అధికారులు అందరి పైనా, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు  క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆదర్శ హౌసింగ్ సొసైటీ భవన నిర్మాణం ‘అనాధికారికం, చట్ట…

కార్పొరేట్ల లాభాలకే ఎగుమతి ఆధారిత వ్యవసాయం -14

(13వ భాగం తరువాత…..) భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్  :  పార్ట్ 14 – ఎగుమతి ఆధారిత వ్యవసాయం మరియు పెట్టుబడి సంచయం పాలకవర్గాలు భారత వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల లక్ష్యంతో ఉత్పత్తి చేసే దిశకు మళ్లించడంపై దృష్టి పెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇండియాను ‘ప్రపంచం యొక్క నూతన ధాన్యాగారం’గా అభివర్ణించాడు. సునిల్ మిట్టల్ (భారతి) లాంటి కార్పొరేట్ ధనికులకు వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. ఏ‌పి ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు కాంట్రాక్టు…

ఇసిస్ బూచిగా ఫ్రాన్స్ లో కార్మిక వ్యతిరేక సంస్కరణలు

ప్యారిస్ ఉగ్రవాద దాడుల మాటున నల్ల చట్టాలకు పదును పెట్టుకున్న అధ్యక్షుడు ఫ్రాంస్వా/ఫ్రాంషా ఒలాండ్ ఆ వెంటనే కార్మిక చట్టాలను నీరుగార్చే పనిలో పడ్డాడు. ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత అప్రతిష్ట మూట గట్టుకున్న అధ్యక్షుడిగా ఇప్పటికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఫ్రాంస్వా ఒలాండ్ తాజాగా తాలపెట్టిన కార్మిక చట్టాల సంస్కరణలపై ప్రజల నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా మార్చి రెండవ వారం నుండి ఫ్రాన్స్ నగరాలలో కార్మికులు, విద్యార్ధులు క్రమం…

వైట్ హౌస్ లాక్ డౌన్ -ఫోటోలు

శ్వేత భవనం ఎవరికీ ప్రవేశం లేకుండా దిగ్బంధనం వివిధ చేశారని వార్తా సంస్ధలు తెలిపాయి. పశ్చిమ పత్రికలు ఒక లాక్ డౌన్ పరిస్ధితి గురించే చెప్పగా, రష్యా టుడే పత్రిక 24 గంటల పరిధిలో రెండు సార్లు లాక్ డౌన్ ప్రకటించారని తెలిపింది. శ్వేత భవనం రక్షణకు ప్రమాదం ఏర్పడిందని భావించినప్పుడు లాక్ డౌన్ ప్రకటిస్తారు. పరిసరాలలో ట్రాఫిక్ ను నిషేధిస్తారు. పాదాచారుల కదలికలను సైతం అడ్డుకుంటారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తారు. ప్రమాద పరిస్ధితి…

సంతకం అయింది -ఇండియా; అబ్బే లేదు -రష్యా

అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధ S-400 అమ్మకం ఒప్పందానికి సంబంధించి బుధవారం కొద్ది నిమిషాల వ్యవధిలో పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి. అమెరికా దగ్గర కూడా ఇంతవరకు సమాధానం లేని అత్యంత ఆధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధగా పేరు పొందిన S-400 వ్యవస్ధలను తమకూ అమ్మాలని ఇండియా కోరుతోంది. ఈ ఒప్పందం అందినట్లే అంది దూరం జరుగుతోంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జరిపిన రష్యా పర్యటన ప్రధాన లక్ష్యం S-400…

ఒక నిస్సహాయ పరిస్ధితి -ది హిందు ఎడ్..

[ఏప్రిల్ 26, 2016 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ఎడిటోరియల్  “A Desperate situation” కు యధాతధ అనువాదం] ********* మితి మీరిన భారం, సిబ్బంది లేమిలతో కూడిన భారతీయ న్యాయ వ్యవస్ధలో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండడం అందరూ ఎరిగిన విషయం. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ భావావేశంతో చేసిన విజ్ఞాపన ఈ సమస్యకు తీవ్రతను, తక్షణమే దృష్టి పెట్టవలసిన ఆవశ్యకతను…

హెలిపాడ్ కు 10 వేల లీటర్ల నీళ్ళు! -కార్టూన్

“తగినంత నీటిని జల్లే వ్యూహం పని చేసింది, వి‌ఐ‌పి చాపర్ వల్ల అస్సలు దుమ్మే రేగలేదు!” – ఓ పక్క నీతులు వల్లించడం, మరో పక్క అవే నీతుల్ని అడ్డంగా, తడబాటు లేకుండా ఉల్లంఘించడం! దళితుల అభ్యున్నతే లక్ష్యం అంటారు. ఆ దళితులపైనే పార్లమెంటులో విష ప్రసంగాలు గుప్పిస్తారు. దళితుల ఆహార అలవాట్లను నేరంగా మార్చుతూ చట్టాలు చేస్తారు. రోహిత్ లను జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేస్తారు. ముస్లిం మతం అహింసకు నిలయం అని ప్రసంగం చేస్తారు.…

డాక్టర్ కన్హయ్య కుమార్, MBBS!

ఫస్ట్ పోస్ట్ పత్రిక (వెబ్ సైట్) విభిన్నంగా పరాచికాలాడింది. కన్హయ్య ముంబై రాక మునుపే ఆయన తరపున సెల్ఫ్ గోల్ కొట్టేసుకున్న హిందూత్వ సంస్ధలు ప్రస్తుతం పత్రికలకు, ఛానెళ్లకు విందు భోజనం అయ్యాయి. ఏప్రిల్ 23 తేదీన కన్హయ్య ముంబైలో ప్రసంగించనున్నాడు. ఆయనను రాకుండా అడ్డుకుంటామని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన వివిధ సంస్ధలలో వీర్ సేన ఒకటి. దాని నేత నిరంజన్ పాల్ ఏమన్నారంటే… “దేశాన్ని ముక్కలు చేస్తానని బెదిరించిన కన్హయ్యా తన Ph D…

అజ్ఞానం, మూఢత్వం వారి స్వాభావిక లక్షణం!

ఐరోపాలో పారిశ్రామిక విప్లవ క్రమాన్ని ఆటంకపరిచేందుకు చర్చి అధికార వ్యవస్ధ చేయని ప్రయత్నం లేదు. కోపర్నికస్ లాంటి వారిని జీవిత పర్యంతం వేధించారు. చర్చి ఒత్తిడికి లొంగి ఒక దశలో కోపర్నికస్ తన గ్రహ సిద్ధాంతాలను తాత్కాలికంగానే అయినా తప్పు అని చెప్పాల్సి వచ్చింది. మరో గ్రహ శాస్త్రవేత్త బ్రూనోను నగరం కూడలిలో స్తంభానికి కట్టేసి తగలబెట్టిన చరిత్ర కేధలిక్ క్రైస్తవ మత మూఢుల సొంతం! వాస్తవాలపై కాకుండా మతపరమైన ఊహలకు, ఫ్యాంటసీలపై ఆధారపడిన చర్చి నమ్మకాలు…

ఉత్తరఖండ్: మొట్టికాయలతో.., రాష్ట్రపతి పాలన రద్దు!

నైనిటాల్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. బహుశా అరాయించుకోలేనంత గడ్డి! అరగకపోయినా విసర్జించ వీలు కాని గడ్డి! ఒక్క రోజు కాదు, గత రెండు మూడు రోజులుగా గడ్డి పెడుతూనే ఉంది. హఠం వేసినట్లు కేంద్ర ప్రభుత్వ లాయర్లు వెర్రిమొర్రి వాదనలు చేసే కొద్దీ గడ్డి పరిమాణం పెరుగుతూ వచ్చింది. హై కోర్టు నిజానికి తన తుది తీర్పును రిజర్వ్ లో పెట్టుకుని తర్వాత ప్రకటిద్దాం అనుకుంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో చేసినట్లుగానే…

వడ్డీ ఋణ భారం, వాణిజ్యీకరణ -13

(12వ భాగం తరువాయి……………..) భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్  :  పార్ట్ 13 వ్యవసాయ రుణం, వడ్డీ చెల్లింపులు, వాణిజ్యీకరణ రుణాలు, వడ్డీల వాస్తవ పరిమాణం రైతుల స్ధితి గతులను ఋణ భారం, వడ్డీ చెల్లింపుల భారీతనం కూడా వెల్లడి చేస్తుంది. SASF గణాంకాల ప్రకారం రైతు కుటుంబాల్లో 49 శాతం ఋణ పీడితులు. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరీ అధికం. ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ రైతు కుటుంబాల్లో 82 శాతం ఋణ భారం మోస్తున్నారు.…