కోర్టు ఆజ్ఞలు ఉల్లంఘిస్తే ఊరుకోం -చైనాతో అమెరికా

ఏదో ఒక వంక పెట్టుకుని కాలు దువ్వక పోతే అమెరికాకు రోజు గడవదు. చైనా లక్ష్యంగా తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో భారీ మిలటరీ బలగాలను మోహరించిన అమెరికా అడపాదడపా చైనాకు వ్యతిరేకంగా యుద్ధ సవాళ్లు విసురుతోంది. త్వరలో వెలువడే అంతర్జాతీయ కోర్టు తీర్పును పాటించకుండా విస్మరిస్తే చైనా తగిన ఫలితం అనుభవించ వలసి ఉంటుందని అమెరికా తాజాగా బహిరంగ వివాదానికి అంకురార్పణ చేసింది. అంతర్జాతీయ కోర్టుగా పరిగణించబడే ‘పర్మినెంటు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ లో…

బ్రెగ్జిట్ -కార్టూన్ లలో…

ఒక అంశాన్ని కార్టూన్ ల కంటే శక్తివంతంగా వివరించేవి మరొకటి ఉండవేమో. రేపు బ్రెగ్జిట్ రిఫరెండం జరగనున్న నేపధ్యంలో ఇంటర్నెట్ నుండి సేకరించిన కొన్ని కార్టూన్ లు చూడటం వల్ల రేపు జరిగే పరిణామాన్ని ‘అటైనా/ఇటైనా’ అర్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది. కింది కార్టూన్ లలో 10వ (మూడో వరసలో రెండవది) వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉండటం గమనించవచ్చు.

రేపే బ్రెగ్జిట్ రిఫరెండం!

ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు మలుపు, కుదుపు కాగల మార్పులకు దారి తీసే అవకాశం ఉన్న ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఉరఫ్ రిఫరెండం రేపు, జూన్ 23 తేదీన, బ్రిటన్ లో జరగనున్నది. “యూ‌కే, యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా లేక బైటికి రావాలా?” అన్న ఏక వాక్య తీర్మానంపై జరిగనున్న రిఫరెండంలో విజేతగా నిలవటానికి ఇరు పక్షాలు సర్వ శక్తులూ ఒడ్డాయి. గెలుపు ఇరువురు మధ్యా దొబూచులాడుతోందని సర్వేలు చెప్పడంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. యూ‌కే రిఫరెండంలో యూ‌కే…

రేప్డ్ వుమెన్ తో సల్మాన్ పోలిక ఎందుకు తప్పు?

సల్మాన్ ఖాన్ మరో వివాదానికి తెర తీశాడు. సుల్తాన్ సినిమా చిత్రీకరణ సందర్భంగా తాను ఎదుర్కొన్న నెప్పి, బాధ, అలసట, హూనం… ఇత్యాది భౌతిక అనుభవాలను అభివర్ణించటానికి అనూహ్యమైన, ఖండనార్హమైన పోలికను తెచ్చాడు. దానితో మరో సారి దేశవ్యాపితంగా సల్మాన్ కు వ్యతిరేకంగా, అనుకూలంగా వాద ప్రతి వాదాలు చెలరేగాయి. పత్రికలకు మరో హాట్ టాపిక్ లభించింది. చానెళ్లకు మరొక ప్రైమ్ టైమ్ చర్చాంశం అంది వచ్చింది. చర్చల మెదళ్ళకు, టి.వి యాంకర్లకు మేత దొరికింది. ట్విట్టర్…

రాజన్: గిల్లి జోల పాడుతున్న పాలకులు -విశ్లేషణ

“పొమ్మనలేక పొగబెట్టారు” అని మర్యాదగా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా బి‌జే‌పి పాలకులు రఘురాం రాజన్ పట్ల వ్యవహరించారు. హద్దు పద్దు ఎరగని నోటికి ఓనర్ అయిన సుబ్రమణ్య స్వామి తనపైన అలుపు లేకుండా మొరగటానికి కారణం ఏమిటో, ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలియని అమాయకుడా రాజన్? రెండో విడత నియామకం ద్వారా ఆర్‌బి‌ఐ గవర్నర్ పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, అకడమిక్ కెరీర్ పైన దృష్టి పెట్టదలుచుకున్నానని ప్రకటించడం ద్వారా ‘అంత అమాయకుడిని…

వ్యూహాత్మక నిష్క్రమణ -ద హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 20- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “A strategic exit” కు యధాతధ అనువాదం. -విశేఖర్] ********* సెప్టెంబర్ లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రెండో సారి పదవికి రేసులో ఉండబోవటం లేదని ప్రకటించటం ద్వారా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అంతకంతకు గుణ విహీనం గా మారుతున్న పరిస్థితుల నుండి మెరుగైన రీతిలో, గౌరవప్రదంగా బైటపడే మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆయన కొనసాగింపు పట్ల మోడి ప్రభుత్వంలో కొన్ని…

రోహిత్ దళితుడే, కలెక్టర్ అధికారిక నిర్ధారణ!

భారత దేశ హిందూ కుల సమాజం, బి‌జే‌పి నేతృత్వం లోని బ్రాహ్మణీయ అధికార వ్యవస్ధ, హిందూ కులాధిపత్యం నరనరానా నింపుకుని పార్లమెంటులో జడలు విప్పి నర్తించిన హైందవ విషనాగు నీడలోని కేంద్ర మంత్రులు కట్ట గట్టుకుని ఆత్మహత్య వైపుకు నెట్టివేసిన స్పుర ద్రూపి, దళిత రీసర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మాల కులానికి చెందినవాడేనని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే అధికారికంగా నిర్ధారించారు. రోహిత్ వేముల దళితుడు కాదని, అతని కులం గూర్చి అబద్ధాలు…

గే నైట్ క్లబ్ దాడి: ది హిందు ఎడిటోరియల్ పై విమర్శ

[ఈ విమర్శ చదవటానికి ముందు గత టపా  ఎడిటోరియల్ అనువాదాన్ని చూడగలరు. -విశేఖర్] “ఒంటరి తోడేళ్ళ దాడులు” (లోన్ వోల్ఫ్ అటాక్స్) అమెరికాకు కొత్త ఉగ్ర వాస్తవికతగా మారిందని ది హిందూ ఎడిటోరియల్ చెబుతోంది. అందుకని ముందుగా లోన్ వోల్ఫ్ సంగతి చూద్దాం. తోడేళ్లు సాధారణంగా గుంపుగా నివసిస్తాయి. గుంపుగా వేటాడతాయి. పాలిచ్చే భారీ జంతువులు (గుర్రం, జిరాఫీ, దుప్పి, హిప్పోపోటమస్, అడవి దున్న మొ.వి) వాటికి ఇష్టమైన ఆహారం. ఈ జంతువులను వేటాడటం మామూలుగా ఒక…

అమెరికా కొత్త ఉగ్ర వాస్తవికత -ది హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 14- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “America’s new terror reality” కు యధాతధ అనువాదం] –o0o– గ్లోబల్ జిహాదీ ఉగ్రవాదం, విచ్చలవిడి తుపాకీ నియంత్రణ చట్టాలు, వినాశకర హోమో ఫోబియా… ఈ మూడు విష శక్తులు ఆదివారం రాత్రి మూకుమ్మడిగా ఒర్లాండో, ఫ్లోరిడా లోని నైట్ క్లబ్ పైన విరుచుకుపడ్డాయి. ఫలితంగా, అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ సామూహిక హత్యాకాండ చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ వలస దంపతులకు అమెరికాలో జన్మించిన ఒమర్…

ఉద్తా పంజాబ్: ఒక కత్తెర, A సర్టిఫికేట్ తో హై కోర్టు ఓకే

సెన్సార్ బోర్డు గా పిలవబడుతున్న సి‌బి‌ఎఫ్‌సి కి సినిమా లను సెన్సార్ చేసే అధికారం గానీ, కత్తెర వేసే అధికారం గానీ లేదని, రాజ్యాంగంలో అలాంటి ఏర్పాటు ఏమీ లేదని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టంలో సెన్సార్ అన్న పదమే లేదని కనుక రాజ్యాంగం రీత్యా ఫలానా మాత్రమే ఉండాలని, ఫలానా ఉండకూడదు అని నిర్దేశించే అధికారం సి‌బి‌ఎఫ్‌సి కి లేదని హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఉద్తా పంజాబ్ సినిమాకు మోడీ గారి చెంచా…

సెన్సార్ బోర్డుకు కత్తెర బరువైన వేళ -కార్టూన్

ప్రథాన మంత్రి మోడి గారి చెంచా గారు పహ్లాజ్ నిహలానీ పుణ్యమా అని ఉద్తా పంజాబ్ సినిమాకు ఖర్చు లేకుండా బోలెడు ప్రచారం దక్కింది. ఇప్పుడు విడుదల అయి ఘన విజయం సాధించటమే తరువాయి అన్నంతగా ప్రచారం పొందిన ఉద్తా పంజాబ్ కి ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నిన్న సి‌బి‌ఎఫ్‌సి అధిపతి నిహలానీ ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మా పని మేము చేశాం. ఇక దానిపై కోర్టుకు వెళతారా లేక అలాగే విడుదల చేస్తారా…

ఫ్రాన్స్ లో పెరుగుతూన్న అలజడి -ది హిందు ఎడిట్ (విమర్శ)

[శనివారం, జూన్ 11 తేదీన “Growing unrest in France” శీర్షికన ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. అనువాదం అనంతరం సంపాదకీయంపై విమర్శను చూడవచ్చు. -విశేఖర్] ——— సమ్మెలకు ఫ్రాన్స్ కొత్త కాదు. కానీ సోషలిస్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షంవైపు మొగ్గు చూపే కార్మిక యూనియన్లు వారాల తరబడి సాగిస్తున్న అలజడి మున్నెన్నడూ ఎరగనిది. మే 17 తేదీన సమ్మె ప్రారంభించిన యూనియన్లు ఫ్రాన్స్ లోని కఠిన కార్మిక చట్టాలను…

క్లుప్తంగా… -10/06/2016

ఏప్రిల్ లో క్షీణించిన ఫ్యాక్టరీ ఉత్పత్తి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెలలో ఫ్యాక్టరీ/పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోయింది. 2015 ఏప్రిల్ తో పోల్చితే 2016 ఏప్రిల్ నెలలో ఫ్యాక్టరీల ఉత్పత్తి 0.8 శాతం తగ్గిపోయిందని కేంద్ర గణాంక కార్యాలయం (CSO – Central Statistics Office) ప్రకటించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి సాధించిందని అట్టహాసంగా ప్రకటించి రోజులు గడవక ముందే ఈ ప్రతికూల వార్త వెలువడటం…

వడ్డీ రేట్లు: పరిశ్రమ వర్గాల ఏడుపు – కార్టూన్

రెండు రోజుల క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ ఆశించారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీ రేట్లు కదల్చకుండా యధాతధంగా ఉంచారు. వడ్డీ రేట్ల వ్యవహారం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంల మధ్య ఎప్పుడూ ఘర్షణకు దారి తీసే అవకాశం గల సమస్యగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్ల చుట్టూ ఏర్పడి ఉన్న వాతావరణం. వడ్డీ రేటు…

క్లుప్తంగా… 09/06/2016

చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! మహిళలపై అమానుషాన్ని ఆపండి -ఐర్లండ్ తో ఐరాస ఉద్తా పంజాబ్ లో తప్పేముంది? -బొంబే హై కోర్ట్ రేపిస్టుని క్షమించి వదిలేయి, ప్లీజ్ చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బ్రిటన్ సెంట్రల్/రిజర్వ్ బ్యాంక్) మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్ చేసిన హెచ్చరిక! “భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ తమ విదేశీ ఆస్తులు అన్నీ అమెరికాపైనే ఆధారపడి ఉండటం చైనా తదితర…