స్వాతిని నేను చంపలేదు -మలుపు?

స్వాతి హత్య కేసు విషయంలో పోలీసుల కథనం ఆరంభం లోనే సంధి కొట్టింది. వారం రోజుల వేట అనంతరం పట్టేశామని ప్రకటించిన నిందితుడు, తాను అసలు నిందితుడునే కాననీ, తనకు సంబంధం లేని కేసులో తనను పోలీసులు ఇరికించారనీ పోలీసులు అరెస్టు చేసిన రాం కుమార్ చెబుతున్నాడు. అయితే గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ వలసిన అగత్యం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు అతని వద్ద సమాధానం సిద్ధంగా ఉంది. “నేనసలు ఆత్మహత్యకు పాల్పపడ లేదు” అని…

వెంటాడేదెవరో గమనించండి! -ది హిందు ఎడిట్..

యువ ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఎస్ స్వాతిని చెన్నై లోని నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో పట్ట పగలు క్రూరంగా నరికి చంపిన ఘటన నగరంలో ప్రజా భద్రతపై కఠినమైన వెలుగును ప్రసరింపజేసింది. అనుకున్నట్లుగానే ఈ హత్య అబధ్రతా భావాన్ని రేకెత్తించింది. ఆమెను చంపాడని భావిస్తున్న అనుమానితుదిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభావంతంగా కృషి చేసిన చెన్నై పోలీసులు, పాలనా యంత్రాంగం, పౌర సమాజంతో చర్చించి, ఉనికిలో ఉన్న తనిఖీలను సమీక్షించి మెరుగు పరచడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.…

దచైస: సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలి -చైనా పత్రిక లు

అవసరం ఐతే దక్షిణ చైనా సముద్రం విషయంలో సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్ పిలుపు ఇచ్చింది. చైనా జాతీయ ప్రయోజనాలను నిక్కచ్చిగా ప్రతిబింబిస్తుందని, కఠినంగా వెల్లడిస్తుందని పేరున్న గ్లోబల్ టైమ్స్ తాజాగా ఇచ్చిన పిలుపుతో పశ్చిమ పత్రికలు, పరిశీలకులు అప్రమత్తం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో -బహుశా జులై 12 తేదీన- హేగ్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో ఫిలిప్పీన్స్ ఇచ్చిన…

క్రికెట్ లో కోహ్లీ, బాలీవుడ్ లో అమీర్ ఖాన్… భళా!

బాలీవుడ్ హీరోలు కూడా నేల మీద నిలబడవచ్చనీ/గలరనీ, ప్రజల సమస్యల పైన స్పందించవచ్చని/గలరనీ నిరూపించిన, నిరూపిస్తున్న హీరోల్లో ఒకరు అమీర్ ఖాన్! అమీర్ ఖాన్ కాకుండా జనానికి సంబంధించిన రోజువారీ సమస్యలపైన సానుకూలంగా, ప్రగతిశీలకరంగా స్పందించగల ఖరీదైన సెలబ్రిటీలు ఇండియాలో దాదాపు ఇంకెవరూ లేరని ఘంటాపధంగా చెప్పవచ్చు. క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోలలో అమీర్ ఖాన్ కాస్త వినమ్రంగా ఉంటారు. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తారు. పెద్దగా బడాయిలకు పోకుండా దేశం కోసం ఆడుతున్నట్లు, ప్రేక్షకులు లేకపోతే…

మధ్య ప్రాచ్యంలో పదివేల చైనా సైన్యం!

భౌగోళిక రాజకీయాలలో ఆర్ధిక చర్యల వరకే పరిమితం అయిందని భావిస్తున్న చైనా సైనిక చర్యలకు సైతం సిద్ధపడుతోంది. ఇసిస్ బలగాల వల్ల దక్షిణ ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, చైనా పొరుగు ప్రాంతం అభధ్రతకు గురవుతున్నాయని భావిస్తున్న చైనా పెద్ద సంఖ్యలో ఆఫ్రికా, ఆసియాలకు సైనికులను తరలిస్తోంది. సైనిక బలగాల నియోగానికి కారణంగాపైకి చెప్పటానికి ఇసిస్ టెర్రరిస్టు చర్యలు కారణంగా చైనా చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది భౌగోళిక రాజకీయాలలో చైనా సైనిక ప్రవేశంగా భావించవలసి ఉంటుంది. ఇసిస్…

చెన్నై: స్వాతి హంతకుడు దొరికాడు

వారం రోజులుగా చెన్నై పోలీసులకు ‘కొరకరాని కొయ్య’గా మారిన చెన్నై టెకీ స్వాతి హత్య మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తాను పని చేసే ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్ళేందుకు నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్న స్వాతిని కొడవలితో నరికి చంపిన హంతకుడి ఆచూకీని ప్రజల సాయంతో పోలీసులు పట్టుకోగలిగారు. తమిళనాడులో వరుసగా జరుగుతున్న హత్యల నేపధ్యంలో పోలీసుల పైనా, ప్రభుత్వం పైనా తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో చెన్నై పోలీసులు భారీ ఎత్తున బలగాలను…

వృద్ధికి, బహుశా ద్రవ్యోల్బణానికీ ప్రేరణ -ద హిందూ ఎడిట్..

[“A fillip to growth, and maybe inflation” శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ********* 7వ వేతన కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా కోటికి పైగా ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాలు మరియు పింఛన్లు పెంచాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినియోగ డిమాండ్, ఆర్థిక వృద్ధి లకు ఆదరువు కాగలదు. బలిష్టమైన ప్రైవేటు వినియోగమే ప్రస్తుత ఆర్థిక కదలికకు కీలకమైన శక్తిగా పని చేస్తున్నదని ఇటీవల కేంద్ర…

ఓర్లాండో షూటింగ్: నిమిషంలో 49 మందిని చంపేశాడా?

ఒర్లాండో షూటింగ్ గుర్తుందాండి? జూన్ 12 తేదీ ఆదివారం రాత్రి (తెల్లవారు ఝామున) 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పల్స్ నైట్ క్లబ్ లో తుపాకులతో కాల్చి 49 మందిని చంపేశాడని, మరో 53 మందిని గాయపరిచాడని పత్రికలు మనకు చెప్పిన సంఘటన! ఇలాంటి షూటింగ్ లను, తద్వారా జరుగుతున్న రక్తపాతాన్ని ‘లోన్ వోల్ఫ్ ఆటాక్స్’ గా అమెరికా భద్రతా సంస్ధలు చెబుతున్నాయని, వారి కధలను, కధనాలను భారత పత్రికలు అంది పుచ్చుకుని…

నల్ల మేకా, తెల్ల మేకా?

[ఫేస్ బుక్ లో క్షత్రియ వర్మ ఖాతా లో దీన్ని చూశాను. న్యూస్ ఛానెళ్లను సున్నితంగా, సునిశితంగా విమర్శిస్తున్న ఈ తమాషా సంభాషణను చదవండి, బాగుంది. -విశేఖర్] ********* ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు. — విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..? రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..? వి : నల్లమేకకు.. రై : గడ్డి.. వి : మరి తెల్లమేకకు..? రై : గడ్డి.. వి :…

స్వామి జీనీని వదిలారు, అనుభవిస్తున్నారు! -కార్టూన్

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ నేతలపై, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్న సుబ్రమణ్య స్వామి ఇటీవల చూపు తిప్పారు. పైకి ఆర్ధిక శాఖ నియమిత అధికారులను లక్ష్యం చేస్తూ లోపల ఆర్ధిక మంత్రి జైట్లీని సాధిస్తున్నారు. సుబ్రమణ్య స్వామి ఓ శుభ దినాన ఆర్‌బి‌ఐ గవర్నర్ రఘురాం రాజన్ ను లక్ష్యంగా చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా దూషణలు రువ్వటం ప్రారంభించినపుడు ఆయన లక్ష్యం ఎవరో త్వరగా అర్ధం కాలేదు. తన దూషణల్లో…

ఫిర్యాదు: అమెరికా యుద్ధ నౌక చర్య ప్రమాదకరం! -వీడియో

అమెరికా యుద్ధ నౌక ఒకటి తమ పెట్రోలింగ్ నౌకను ప్రమాదకరంగా ఆటంకపరిచిందని రష్యా ఆరోపించింది. మధ్యదరా సముద్రంలో ప్రయాణిస్తున్న తమ నౌకను అమెరికన్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక దాటి వెళుతూ అంతర్జాతీయ నావికా చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించిందని, ఇతర దేశాలకు నీతులు చెప్పేందుకు ముందుండే అమెరికా తన ప్రవర్తనను చక్క దిద్దు కోవాలని రష్యా కోరింది. అమెరికా నౌకా బలగం లోని డిస్ట్రాయర్ నౌక గైడెడ్ మిసైళ్లను ప్రయోగించగల శక్తి కలిగినది. ‘యూ‌ఎస్‌ఎస్ గ్రేవ్ లీ’ అనే…

త్వరగా దయచేయండి! -ఈయు

‘బైటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు గదా, ఇంకా ఎన్నాళ్ళు చూరు పట్టుకుని వెళ్ళాడుతారు?’ అని బ్రిటన్ / యూకె ను నిలదీసి ప్రశ్నిస్తోంది యూరోపియన్ యూనియన్. కొందరు ఈయు నేతల ప్రకటనలు చూస్తే బ్రిటన్ నేతల నాన్చుడు ధోరణి వారికి ఎంత మాత్రం ఇష్టంగా లేదని స్పష్టం అవుతోంది. “యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని బ్రిటన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి” అని ఈయు కమిషనర్ ఒకరు హెచ్చరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.…

బ్రెగ్జిట్ తర్వాత… -కార్టూన్ లలో

అందరిలాగే కార్టూనిస్టులూ బ్రెగ్జిట్ కు స్పందించారు. వారి వారి ప్రయోజనాలకు తగినట్లుగానే ఆయా పత్రికలు, కార్టూనిస్టులు స్పందించారు. బహుళజాతి కంపెనీల పోషణలోని పశ్చిమ పత్రికలు బ్రెగ్జిట్ ఓటును దూషిస్తూనో, ఎకసక్కెం చేస్తూనో కార్టూన్ లు ప్రచురించగా బ్రెగ్జిట్ సానుకూలుర స్పందన కాస్త వాస్తవాలకు దగ్గరగా తమ గీతల్లో స్పందించారు. ఈ రెండో రకం కార్టూన్ లు వ్యక్తిగతంగా ట్విట్టర్ ద్వారా మాత్రమే పబ్లిష్ చేసుకునే అవకాశం లభించింది. మొదటి రకం కార్టూన్ లకు ప్రధాన స్రవంతి పత్రికలలో…

పుట్టిన ఊర్ల యూరప్ కోసం…!

[బల్గేరియా పత్రిక “A-specto” లో బల్గేరియా రచయిత ఏంజెల్ జంబాజ్కి చేసిన రచన ఇది. బల్గేరియన్ భాషలో చేసిన రచనను వలెంతినా జోనేవా ఆంగ్లంలోకి అనువదించగా సౌత్ ఫ్రంట్ ప్రచురించింది. దానిని తెలుగులోకి మార్చి ఇక్కడ ప్రచురిస్తున్నాను. యూరోపియన్ యూనియన్ ను సభ్య దేశాలపై ముఖ్యంగా సభ్య దేశాల శ్రామిక ప్రజలపై, వారి సంస్కృతిపై, వారి జీవనంపై, వారి కుటుంబాలపై ఏ విధంగా రుద్దారో ఈ రచన తెలియజేస్తుంది. -విశేఖర్] ********* సందేహం లేదు, ఇది చరిత్రాత్మకమే.…

బ్రెగ్జిట్ అద్భుతం: ఈ‌యూతో విడాకులకే బ్రిటిష్ ఓటు (విశ్లేషణ)

బ్రిటన్ ప్రజలు అనూహ్య ఫలితాన్ని ప్రపంచం ముందు ఉంచారు. యూరోపియన్ యూనియన్ తో విడిపోవటానికే మా ఓటు అని చాటి చెప్పారు. జూన్ 23 తేదీన గురువారం జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్ కే ఓటు వేశారు. 51.9 శాతం మంది బ్రెగ్జిట్ (లీవ్ ఈ‌యూ) కు ఓటు వేయగా 48.1 శాతం మంది ఈ‌యూలో కొనసాగాలని (రిమైన్) ఓటు వేశారు. 3.8 శాతం మెజారిటీతో బ్రెగ్జిట్ పక్షాన నిలిచారు. తద్వారా దశాబ్దాలుగా అమెరికా తమపై…