ఒడ్డుకు కొట్టుకొచ్చిన రక్షణ రహస్యాలు -కార్టూన్

ఈ కార్టూన్ కి ఇక వ్యాఖ్యానం అవసరమా? ఈ కార్టూన్ గీసిన కేశవ్ “కార్టూన్ ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ప్రభావవంతంగా ఉంటుంది” అని చెబుతారు. అందుకే ఆయన తన కార్టూన్ లకి, ఎప్పుడో తప్పదు అనుకుంటే తప్ప వ్యాఖ్యానం ఇవ్వరు. జలాంతర్గామి అంటేనే రహస్య ఆయుధం అని లెక్క! సముద్రం అడుగున రహస్యంగా దాగి ఉండాల్సిన స్కార్పీన్ ఒడ్డుకు కొట్టుకొని రావడం బట్టి దానికి బాధ్యత వహించవలసిన వాళ్ళు ఎంత బాధాతాయుతంగా ఉన్నారో తెలిసిపోతున్నది. స్కార్పీన్…

స్కార్పిన్: లీక్ అయింది ఫ్రాన్స్ లోనే -నిర్ధారణ

ఇప్పుడిక ఫ్రాన్స్ సాకులు చెప్పి తప్పించుకునేందుకు వీలు లేదు. “లీకేజి మా పాపం కాదు. మా చేతులు దాటినాకే సమాచారం లీక్ అయింది” అని ప్రకటించి తప్పించుకోజూచిన DCNS కంపెనీ వాదన నిజం కాదని తేలింది. లీకేజికి కారణం అయిన పత్రిక విలేఖరి “ఫ్రాన్స్ లోనే లీక్ అయింది” అని స్పష్టం చేసాడు. తనకు అందిన రహస్య పత్రాలను ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అందజేయడానికి ఆ విలేఖరి సంసిద్ధత తెలిపాడు.  DCNS కంపెనీతో ఆస్ట్రేలియా కూడా 38 బిలియన్…

స్కార్పిన్ లీక్ పరిశోధన -ద హిందూ ఎడిట్…

మజగావ్ డాక్ లిమిటెడ్ లో ఉత్పత్తిలో ఉన్న స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన వేల పేజీల రహస్య పత్రాలు లీక్ అవడం వల్ల ఎంత మేరకు భధ్రత ప్రమాదంలో పడింది అన్న అంశాన్ని తీవ్ర దృష్టితో పరిశోధించాలి. బ్యూరోక్రాటిక్ రాజి పద్ధతుల నుండి, తమ సొంత వ్యవహారాలను సంరక్షించుకునే ధోరణుల నుండి స్వతంత్రంగా ఉండే విధంగా ఈ పరిశోధన జరగాలి. 1,500 టన్నుల సాంప్రదాయక డీజిల్-విద్యుత్ జలాంతర్గామికి చెందిన సాంకేతిక ప్రత్యేకతలు వివరాలను తెలియజెప్పే 22,400 పేజీల పత్రాలు…

నెం. 1 టెస్ట్ క్రికెట్ టీం: పాకిస్తాన్ -కార్టూన్

    “అబ్బే, పాకిస్తాన్ టాప్ టీం అని అన్నది నేను కాదు. నా పైన దేశ ద్రోహం పెట్టకండి దయ చేసి…”   *********   హిందుత్వ కాపలాదారుల మానక స్ధితిని ఈ కార్టూన్ సరిగ్గా వెల్లడి చేస్తున్నది.    హిందుత్వ మూకలు పాల్పడుతున్న విజిలెంటిజం ఆ మూకలతో మొదలై వారితోనే ముగిసేది కాదు. అది నేరుగా సంఘ్ పరివార్  అత్యున్నత నాయకత్వం నుండి కింది స్ధాయి కార్యకర్త వరకు ప్రవహిస్తూ వస్తోంది. అందుకే ప్రధాన…

భారత జలాంతర్గాముల రహస్యాలు లీక్

  రహస్యాల లీకేజి వ్యవహారం ఇండియాకూ చేరింది. భారత దేశానికి సరఫరా చేయడానికి ఫ్రాన్స్ కంపెనీ నిర్మిస్తున్న జలాంతర్గాముల రహస్యాలు పత్రికలకు లీక్ అయ్యాయి. దాదాపు 22,000 పేజీలకు పైగా పత్రాలు -జలాంతర్గాములు సంబంధించినవి- లీక్ అయ్యాయని పలు పత్రికలు తెలియజేశాయి. జలాంతర్గామి రహస్యాలు 22,000 పేజీల వరకు ఉండడం ఏమిటో అర్ధం కాని విషయం. ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అయినప్పటికీ వేల పేజీల తరబడి నిండి ఉంటాయా అన్నది అనుమానాస్పదం. బహుశా జలాంతర్గాములు సంబంధించిన…

‘పాకిస్ధాన్ నరకం కాదు’ అన్నా దేశద్రోహమేనా?

  “అసహనం ఎక్కడుంది?” అని ప్రశ్నిస్తూ  ఢిల్లీలో ఊరేగింపు నిర్వహించిన హాలీ వుడ్ నటుడు ‘అనుపమ్ ఖేర్’ ఓ సారి కర్ణాటక వఛ్చి చూడాలి. హిందుత్వ మూకలు ఏమి చేసినా అది దేశ భక్తే అనో లేదా సహన సహితమే అనో ఆయన తేల్చిపారేస్తే తప్ప, ‘అసహనం’ రుచి ఏమిటో ఆయనకు తెలుస్తుంది.  “పాకిస్తాన్ నరకం ఏమి కాదు. అది ప్రజలు నివసించే దేశం” అని రాజకీయవేత్తగా మారిన ఒక సినిమా నటి ప్రకటించారు. “పాకిస్ధాన్ అంటే…

మెడల్స్ క్రెడిట్ ఆటగాళ్లదేనా? -కార్టూన్

యూ‌పి‌ఏ ఏలుబడిలో ఎలాంటి సానుకూల పరిణామం జరిగినా అది రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో క్రెడిట్ అయ్యేది. ఏమన్నా (ఒప్పుకోవలసిన) తప్పులు జరిగితే మాత్రం అవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఖాతా లోకి వెళ్లిపోయేవి. ఎన్‌డి‌ఏ-2 ఏలుబడిలోనూ అంతే. పాత్రధారులు మారారు గానీ సీన్ మారలేదు. జి‌డి‌పి వృద్ధి రేటు పెరిగినా, చమురు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గినా, ఉప ఎన్నికల్లో గెలిచినా… అవన్నీ మోడి గాలి + అమిత్ షా చాణక్య ఎత్తుల ఫలితంగానే…

గులెన్ ని త్వరగా పంపండి! -అమెరికాతో టర్కీ

టర్కీలో సైనికుల తిరుగుబాటుకు కుట్ర చేసిన ఫెతుల్లా గులెన్ ను టర్కీకి ‘అప్పగించే’ పనిని త్వరితం చేయాలని టర్కీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అమెరికాలో శరణు పొందుతున్న గులెన్ అప్పగింతకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేయాలని, టర్కీ-అమెరికాలు చేసుకున్న ‘నేరస్ధుల అప్పగింత’ ఒప్పందాన్ని అమెరికా గౌరవించాలని టర్కీ ప్రధాని బినాలి యెల్దిరిమ్ ఈ రోజు (శనివారం, ఆగస్టు 20) డిమాండ్ చేశాడు. టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో విదేశీ మీడియా విలేఖరులతో మాట్లాడుతూ టర్కీ ప్రధాని…

ఎల్ నినో: ఈ జులై, చరిత్రలో అత్యధిక వేడిమి నెల

ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలు పెట్టిన దగ్గరి నుండి 2016 సంవత్సరం లోని జులై నెల అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించిందని అమెరికా ప్రభుత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు నమోదు చేయడం 137 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని, ఇన్నేళ్లలో ఈ యేటి జులైలో ప్రపంచ వ్యాపితంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వారు తెలిపారు. యే సంవత్సరం తీసుకున్నా, జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు కావడం రివాజు అని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పడం…

ఆదివాసీల ఆత్మబంధువు మహాశ్వేతాదేవి -నివాళి

[ఈ ఆర్టికల్ మహాశ్వేతాదేవి చనిపోయిన రోజే రాయబడింది. దరిమిలా మహిళల మాస పత్రిక ‘మాతృక’ లో ప్రచురించబడింది. ఒకసారి -ఎక్కడయినా సరే- ముద్రితం అయినవి మాతృక పత్రిక ప్రచురణకు స్వీకరించని కారణం చేత వారి ప్రచురణ అయే వరకు ఆగవలసి వచ్చింది. బ్లాగ్ పాఠకుల కోసం ఈ రోజు… ] ********* “నేను చేయవలసింది, రాయవలసింది ఇంకా చాలా ఉండిపోయింది. నేనింకా బతకాలి. ఎల్లకాలం బతికే ఉండాలి” అని కోరుకున్న మహాశ్వేతాదేవికి శరీర అవయవాలు సహకరించకపోవడంతో మరణించక…

క్రిమియాపై సంక్షోభం -ద హిందు ఎడిట్..

[ద హిందూ ఎడిటోరియల్ -13/08/2016- “The crisis over Crimea” కు యధాతధ అనువాదం] ********* ఉక్రెయిన్ మద్దతుతో క్రిమియాలో ఉగ్రవాద దాడులు చేయడానికి సిద్ధబడిన విధ్వంసకారుల ప్రయత్నాలను వమ్ము చేశామంటూ రష్యా చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్యా ప్రధాన చర్చాంశంగా తెర మీదికి వచ్చింది. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యాలో కలిపినప్పటినుండీ క్రిమియా ద్వీపకల్పంలో మాస్కో భారీ మొత్తంలో సైన్యాన్ని మోహరించింది. “ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడానికి” వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ గట్టి…

ఐఎస్ స్ధాపకుడు ఒబామా -ఫ్రమ్ ద హార్స్ మౌత్!

ఇస్లామిక్ స్టేట్ వ్యవస్ధాపకుడు ఎవరు? అమెరికా ఇన్నాళ్లూ చెప్పింది ఇరాకీ సున్నీ నేత అబూ ముసబ్ ఆల్-జర్కావి అని. ఐఎస్ నెలకొల్పిన ఇస్లామిక్ కాలిఫేట్ కు అబూ బకర్ ఆల్-బాగ్దాది అని ఒబామా ప్రభుత్వం, అమెరికన్ మీడియా చెవినిల్లు కట్టుకుని మరీ చెప్పాయి. ఐఎస్ వ్యవస్ధాపకత్వం లోకి వెళ్ళే ముందు 9/11 దాడుల గురించి కొన్ని అంశాలు చెప్పుకోవాలి. 9/11 దాడులు జరిగినప్పుడు కొన్ని గంటల లోపే ఆ దాడులు చేసింది ఆల్-ఖైదా అనీ, చేయించింది ఒసామా…

అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం

– అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మహామోసం //.….. మరో మోసానికి తెరతీసిన చంద్రబాబు ప్రభుత్వం..! “తాత్కాలిక కేటాయింపు” అంటూ మరో లిటిగేషన్. ! >> ప్రస్తుతం కేటాయించిన ప్లాట్లపై భూయజమానులకు ఎటువంటి యాజమాన్య హక్కూ ఉండదు..>> రాజధానికోసం “ల్యాండ్ పూలింగ్” పేరిట సేకరించిన భూముల్లో, భూయజమానులకు ప్లాట్లు కేటాయింపులో బయటపడ్డ మరోమోసం.. ఇది ముమ్మాటికీ నయవంచనే..!!  మిగిలిన భాగం కోసం “తిరుమల ప్రసాదీయం” బ్లాగుకు కింది లంకె ద్వారా వెళ్ళండి. అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు…

గో రక్షణ క్రిమినల్ ముఠాలను శిక్షించరా?!

“అహో! మొదట ఈ గందరగోళమునందేల ప్రవేశించవలే?! ప్రవేశించితిపో…!” ********* ఇంతకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నోరు తెరవడం కూడా మహా భాగ్యమే అన్నమాట! దేశంలో చెలరేగుతున్న ఆందోళనలకు, మండుతున్న మంటలకు ప్రధాన మంత్రి స్పందన ‘ప్రధాని కూడా స్పందించారు’ అని చెప్పుకోవడానికా లేక ఆ స్పందన కార్యరూపం లోకి దాల్చుతుంది అని జనం నమ్మడానికా? “ప్రధాని స్పందించారు. ఇంకేం కావాలి? స్పందనపై గొడవ చేయడం ఎందుకు?” అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రశ్నిస్తుంటే…

టర్కీ సైనిక కుట్ర: ఇండియా, మోడి కనెక్షన్!

[Disclaimer: టర్కీ సైనిక కుట్రకు, ఇండియా & మోడిలకూ మధ్య కనెక్షన్ ఉన్నదని చెప్పడం ఈ ఆర్టికల్ ఉద్దేశం కాదు.] జులై 15, 16 తేదీల్లో టర్కీలో సైనిక కుట్ర చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జరిగింది కుట్ర కాదనీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, అధికారాలను తన చేతుల్లో కేంద్రీకరింపజేసుకోవడానికి తనపై తానే కుట్ర చేయించుకుని ఆ నెపాన్ని విరోధులపై నెడుతున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి కుట్ర అనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలు రెండో అంశానికే…