గ్రీసు బెయిలౌట్‌తో పట్టపగ్గాలు లేని ఇండియా షేర్‌మార్కెట్లు

అప్పు సంక్షోభంతో సతమతమవుతున్న గ్రీసు దేశానికి రెండో బెయిలౌట్ ఇవ్వనున్నట్లు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ప్రకటించడంతో భారత షేర్ మార్కెట్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్, ఎన్.ఎస్.ఇ నిఫ్టీలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా మూడు శాతం వరకూ లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, యూరప్ అప్పు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుండడంతో ప్రపంచ వ్యాపితంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఏప్రిల్ నెలలో మందగించినట్లు…

అణ్వాయుధ సామర్ధ్యంపై పరస్పర విశ్వాసం పెంపొందించుకుంటాం -పాక్, ఇండియా

అణ్వాయుధాలు, ఇతర సాంప్రదాయక ఆయుధాల సామర్ధ్యాలపై పరస్పరం విశ్వాసం పెంపొందించుకుంటామని పాకిస్ధాన్, ఇండియా దేశాలు ప్రకటించాయి. ఇతర అంశాల్లో కూడా నమ్మకం, విశ్వాసాలు పెంపొందించుకోవడానికి వీలుగా అదనపు చర్యలను తీసుకునే విషయం కూడా పరిశీలిస్తామనీ, అందుకోసం నిపుణుల సమావేశం జరిపి శాంతి, భద్రతల మెరుగుదలకు కృషి చేస్తామనీ ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ విదేశీ కార్యదర్శితో చర్చల నిమిత్తం రెండు రోజుల క్రితం…

లిబియాపై దాడుల కొనసాగింపుకు అమెరికా ప్రతినిధుల సభ నిరాకరణ

శనివారం అమెరికా కాంగ్రెస్ లిబియాకి సంబంధించి రెండు బిల్లులపై ఓటింగ్ నిర్వహించింది. రెండు బిల్లులపై ప్రతినిధుల సభ ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కనిపించడం ఆశ్చర్యకరం. నాటో నాయకత్వంలో లిబియాపై కొనసాగుతున్న మిలట్రీ ఆపరేషన్‌ను కొనసాగించడానికి అధ్యక్షుడు ఒబామాకు అధికారం ఇవ్వడానికి ప్రవేశపెట్టిన బిల్లును మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. గత కొద్దివారాలుగా లిబియాలో అమెరికా నిర్వహిస్తున్న పాత్ర వివాదాస్పదం అయ్యింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అధ్యక్షుడు లిబియా యుద్ధంలో కొనసాగుతుండడాన్ని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు.…

గ్రీసు రెండో బెయిలౌట్‌కి ఇ.యు+ఐ.ఎం.ఎఫ్ అంగీకారం, గ్రీకులపై నడ్డి విరిగే భారం

“ఎద్దు పుండు కాకికి ముద్దు” అని సామెత. గ్రీసు అప్పు సంక్షోభం యూరప్‌లోని ధనిక దేశాల ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు సిరులు కురిపించబోతోంది. అదే సమయంలో గ్రీసు ప్రజలకు “పెనం మీదినుండి పొయ్యిలోకి జారిన” పరిస్ధితి దాపురిస్తోంది. గ్రీసు మరిన్ని పొదుపు చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే రెండో బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చేది లేదని నెలరోజుల నుండి బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తాము కోరింది సాధించుకుని రెండో బెయిలౌట్‌ ఇవ్వడానికి…

గూగుల్‌పై యాంటీ-ట్రస్ట్ కేసు నమోదు చేస్తాం -అమెరికా ఎఫ్.టి.సి

యాంటీట్రస్ట్ చట్టం కింద గూగుల్ నేరానికి పాల్పడినట్లుగా అమెరికా “ఫెడరల్ ట్రేడ్ కమిషన్” భావిస్తోంది. ఈ చట్టం కింద గూగుల్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడానికి నిర్ణయించినట్లు ఎఫ్.టి.సి తెలిపింది. మరికొద్ది రోజుల్లో గూగుల్‌కి కోర్టు ఆర్డర్లు అందనున్నాయి. తన సెర్చి ఇంజన్ వ్యాపారం ద్వారా తన వెబ్‌సైట్లకు, తాను అందిస్తున్న ఇంటర్నెట్ సేవలకు వినియోగదారులను ఆకర్షిస్తున్నదని గూగుల్ పై అనేక ఇంటర్నెట్ సంస్ధలు చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నేపధ్యంలో…

సంక్షుభిత యూరోజోన్ దేశాల జాబితాలో నెదర్లాండ్స్ -ఐ.ఎం.ఎఫ్

యూరోజోన్ లోని బలహీన దేశాలు తీవ్ర అప్పు సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. గ్రీసు, ఐర్లండులు గత సంవత్సరమే సంక్షోభంలో ఉన్నట్లు తేలిపోగా, ఈ సంవత్సరం పోర్చుగల్ కూడా సంక్షోభ దేశంగా బైటపడి, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ ప్యాకేజి పొందింది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్, ఇటలీ దేశాలు తదుపరి సంక్షోభ దేశాలుగా మార్కెట్ పండితులు అంచనా వేస్తుండగా, ఈ జాబితాకి తాజాగా నెదర్లాండ్స్‌ను కూడా ఐ.ఎం.ఎఫ్ జత చేసింది. స్పెయిన్, ఇటలీలు గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్‌లతో పోలిస్తే…

గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే…

ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యం ఉపసంహరణలో అమెరికాతో పాటే ఫ్రాన్సు కూడా

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి సైన్యాన్ని మొదటి దశలో మూడువిడతలుగా 33,000 మంది సైనికులను ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కూడా అమెరికాను అనుసరించనున్నట్లు ప్రకటించాడు. తమ సైనికుల్ని కూడా ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఐతే, అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సైనికులను ఆఫ్ఘనిస్ధాన్‌ దురాక్రమణకు పంపిన ఇంగ్లండు ఇంతవరకూ ఈ విషయమై ఏ ప్రకటనా చేయకపోవడం విశేషం. అమెరికా ఉపసంహరించునే సైనికుల సంఖ్యకు దామాషాలో తాము తమ…

“న్యాయం కోసం నేలపై పడుకున్నాం,” పిల్లలు చూపుతున్న పోరు దారి -ఫోటోలు

పోస్కో: దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి సంస్ధ. ఐదేళ్ళనుండి ఒడిషాలోని ఐదు గ్రామాల ప్రజల బతుకులపై కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముడుపులు మెక్కి కొందరు, ప్రపంచ పెట్టుబడికి సలాం కొట్టి మరికొందరు, భారత పాలకులే ఈ ప్రజల పాలిట యమదూత లయ్యారు. తమలపాకు తోటలపై ఆధారపడి కుంటుతూనే గడుపుతున్న వీరి జీవితాల్లోకి విషం పోశారు. రు.50,000 కోట్ల విదేశీ పెట్టుబడికి సలాం కొట్టిన మన్మోహన్, నవీన్‌లు  తమకు ఓట్లేసిన గ్రామీణుల నోట్లో మట్టి కొట్టారు. తమలపాకు తోటల్ని…

మిలట్రీకి ఎక్కువ, కాంగ్రెస్‌కి తక్కువ; సేనల ఉపసంహరణతో ఒబామా రాజకీయ క్రీడ

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తున్న ఒక లక్షా ఒక వెయ్యి మంది అమెరికా సైనికుల్లో 33,000 మందిని 2012 సెప్టెంబరు మాసాంతంలోపు వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు, అమెరికా త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్ధుడు అయిన బారక్ ఒబామా బుధవారం ప్రకటించాడు. ఒబామా ప్రకటించిన ఉపసంహరణ సంఖ్య అమెరికాలోని వివిధ అధికార కేంద్రాలు ఒకే దృష్టితో చూడలేకపోవడం, భిన్న ధృవాలుగా చీలి ఉండడం గమనార్హమైన విషయం. 2012 చివర్లో మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న ఒబామా…

చైనా ఫ్యాక్టరీ సెక్టార్‌లో అభివృద్ధి ముందుకు సాగడం లేదు

చైనా ఫ్యాక్టరీ రంగ అభివృద్ధి కుంటుబడిందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. పర్ఛేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ను (Purchasing Managers’ Index) కుదించి పి.ఎం.ఐ గా పిలుస్తారు. ఈ ఇండెక్స్‌లో 50 ఉన్నట్లయితే అటు అభివృద్ధి గానీ ఇటు తిరోభివృద్ధి (contraction) గానీ ఏమీ లేదని భావిస్తారు. 50 కంటె ఎక్కువగా ఉన్నట్లయితే అది విస్తరణ లేదా అభివృద్ధిగా భావిస్తారు. అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ రంగం కుచించుకు పోతున్నట్లుగా లేదా తిరోభివృద్ధిని నమోదు చేస్తున్నట్లుగా భావిస్తారు. గురువారం…

మౌలిక కారణాల వల్లనే ఆహార ధరలు పెరుగుతున్నాయ్! -ఆర్.బి.ఐ

గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆహార ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. తాజాగా జూన్ 11 తేదీతో ముగిసే సంవత్సరంలో ఆహార ధరల సూచిక 9.13 శాతానికీ, ఇంధన ధరలు 12.84 శాతానికీ పెరిగాయి. దానికి కారణాలు చెప్పమంటే వర్షాలు కురవక అని ఒక సారీ, సరఫరా ఆటంకాల వలన అని ఇంకొకసారీ, డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అని మరొక సారీ అని చెబుతూ వచ్చారు. ముఖ్యంగా భారత దేశ ఆర్ధిక పండితులు, మంత్రులు ఈవిధంగా…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యం ఉపసంహరణ ప్రకటించిన ఒబామా, పొరాటం కొనసాగుతుందన్న తాలిబాన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులను పాక్షికంగా ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ నామమాత్రంగా ఉంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ, వారి అంచనాల కంటే ఎక్కువగానే సైనిక ఉపసంహరణను ఒబామా ప్రకటించాడు. ఆయాన ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 10,000 మంది సైనికుల్ని ఉపసంహరిస్తారు. మరో 23,000 మందిని 2012 సెప్టెంబరు లోపు ఉపసంహరిస్తారు. మిగిలిన 68,000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతారు. వారి ఉపసంహరణగురించి ఒబామా ఏమీ చెప్పలేదు. ఆఫ్ఘనిస్ధాన్ జాతీయ…

పాకిస్ధాన్‌పై దాడి చేశారా, జాగ్రత్త! -ఇండియాకు ‘జమాత్ ఉద్-దవా’ హెచ్చరిక

ఇండియా, పాకిస్ధాన్ దేశాల విదేశీ కార్యదర్శులు ఈ వారంలోనే పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరపనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లలో ఇరు దేశాలు మునిగి ఉండగా, తలవని తలంపుగా ఊడిపడిందో ప్రకటన. అది “జమాత్ ఉద్-దవా” (జెయుడి) అనే సంస్ధ, తన సంస్ధాగత సమావేశాలను జరుపుకుంటున్న సందర్భంగా ఇండియాకు చేసిన హెచ్చరిక. కరాచిలో కాన్ఫరెన్సు జరుపుకున్న ఈ సంస్ధ ముగింపులో ఓ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. కాన్ఫరెన్సులో పాల్గొన్న నాయకులంతా ఒకే కల కన్నారేమో తెలియదు గానీ…

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అమెరికాల మధ్య పెరుగుతున్న దూరం!?

గత శనివారం ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ అకస్మాత్తుగా అమెరికాపైన విరుచుకు పడ్డాడు. అమెరికాకి చెప్పకుండానే అమెరికా తాలిబాన్‌తో చర్చలు ప్రారంభించిందనీ, చర్చలు కొనసాగుతున్నాయని కూడా పత్రికలకు చెప్పేశాడు. ఆ తర్వాత అనివార్యంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ కూడా తాము తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నామని అంగీకరించవలసి వచ్చింది. పనిలో పనిగా ఐక్యరాజ్యసమితిలో తాలిబాన్, ఆల్-ఖైదాలపై గల ఆంక్షలు, నిషేధాల జాబితాను విడదీస్తూ తీర్మానం కూడా ఆమోదించారు. ఆ తీర్మానానికి ఇండియా కూడా…