అరబ్ వసంతం వర్సెస్ యూరోపియన్ శిశిరం -కార్టూన్
– -ఫస్ట్ పోస్ట్ నుండి
– -ఫస్ట్ పోస్ట్ నుండి
గ్రీసు ప్రభుత్వం అంతిమ క్షణాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇ.యు దేశాలు, ఐ.ఎం.ఎఫ్ సంస్ధ ఇవ్వ జూపిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్, దానితో పాటే వచ్చే కఠినమైన షరతులను గ్రీసు ప్రజల ఆమోదానికి పెట్టడానికై రిఫరెండం నిర్వహిస్తామని గ్రీసు ప్రధాని గత సోమవారం ప్రకటించినప్పటినుండీ అక్కడి పరిణామాలు వేగవంతం అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే యూరప్ పెద్ద తలకాయలైన జర్మనీ, ఫ్రాన్సు దేశాల ప్రభుత్వాధిపతులు ఇద్దరూ రిఫరెండం ఆలోచనను సమర్ధించారు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ పైనే కాకుండా…
అత్యంత ఆధునికమైన జెట్ ఫైటర్ విమానాలను ఇండియాకు అమ్మడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో అమెరికా-ఇండియాల రక్షణ రంగ సహకారం గురించి వివరిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇండియా ఆసక్తి కనపరిచినట్లయితే లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసే ‘ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్’ ను అమ్మడానికి అమెరికా సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది. ఆరు నెలల క్రితమే అమెరికా అమ్మ జూపిన ఎఫ్-16, ఎఫ్-18 ఫైటర్…
12 సంవత్సరాల వయసులోనే యూరోజోన్ విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఎంతో అట్టహాసంతో, మరెన్నో ఆశలతో ప్రారంభమైన యూరోజోన్ మానిటరీ యూనియన్ ఆర్ధిక సంక్షోభాల ధాటికి పన్నెండో సంవత్సరంలోనే విచ్ఛిన్నానికి దగ్గరయ్యింది. ప్రపంచ దేశాలకు ఉమ్మడి కరెన్సీగా, అందరూ కోరుకునే అంతర్జాతీయ మారక కరెన్సీగా డాలర్ చెలాయిస్తున్న ఆధిపత్యానికి గండికొట్టి పోటీగా ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న యూరో కరెన్సీ తన లక్ష్యాన్ని సాధించకపోగా అప్పుడే ఒక సభ్య దేశాన్ని సాగనంపడానికి సిద్ధపడుతోంది. యూరో గ్రూపు రాజకీయ నాయకుడుగా ఉన్న…
తనను స్వీడన్ కు అప్పగించడానికి వ్యతిరేకంగా అప్పీలు కోర్టుకు నివేదించుకున్న జులియన్ అస్సాంజ్, అక్కడ అప్పీలును కోల్పోయాడు. స్వీడన్ పోలీసులకు జులియన్ ను అప్పగించడానికి అనుకూలంగా అప్పీలు కోర్టు తీర్పునివ్వడంతో జులియన్ అస్సాంజ్ అప్పగింత అనివార్యం అయ్యింది. అయితే హైకోర్టుకు వెళ్ళడానికి జులియన్ కు ఇంకా అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదీ లేనిదీ హై కోర్టులోనే తేలనున్నది. వికీలీక్స్ అధినేత జులియన్ అస్సాంజ్ గత సంవత్సరం డిసెంబరు నెలలో బ్రిటన్ లో అరెస్టు…
అక్టోబరు 31 సాయంత్రంతో 700 కోట్లవ బిడ్డ జన్మించాడని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ క్రెడిట్ ని భారత్, ఫిలిప్పైన్స్ లకు చెందిన ఇద్దరు పసికందులు సంపాదించుకున్నారు. అయితే, సురక్షితమైన తల్లి గర్భం నుండి భూమ్మీదికి అడుగుపెడుతున్న పసికందులను ఆహ్వానిస్తున్నదెవరు? ఈ ప్రశ్నకు ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం సమాధానం చెబుతోంది. మానవ ప్రపంచం సాధించిన అభివృద్ధికంటే ముందే ఆకలి, కరువు, దారిద్ర్యం, అందని చదువులు, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం మున్నగు సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గర్భస్త…
యూరప్‌లో అతి పెద్ద ద్రవ్య మార్కెట్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బ్రిటన్ ఆర్ధిక మాంద్యం కు చేరువలో ఉందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. మూడో క్వార్టర్ (జులై, ఆగస్ఠు, సెప్టెంబరు)లో ఆర్ధిక వృద్ధి అనుకున్నదాని కంటె మెరుగ్గానే ఉన్నప్పటికీ నాలుగో క్వార్టర్ లో అది బాగా క్షీణించవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ మంగళవారం విశ్లేషించింది. యూరోజోన్ రుణ సంక్షోభం ఇంకా శాంతించకపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ పై చూపుతున్నదని ఆ సంస్ధ విశ్లేషించింది. మూడో క్వార్టర్ లో బ్రిటన్…
అక్టోబరు 31 తో లిబియాపై నాటో యుద్ధం ముగిసినట్లుగా నాటో కూటమి ప్రకటించింది. యుద్ధం ముగిసింది కాబట్టి నాటో సైన్యాలు, గూఢచారులు లిబియా వదిలి పోతున్నాయనుకుంటే పొరబాటే. లిబియా జలాల్లో మొహరించిన నాటో దేశాల యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు తమ పూర్వ ప్రాంతానికి వెళతాయని భావించినా పొరబాటే. ఎందుకంటె అవి అక్కడే, లిబియాపై దాడులు జరిగనంతకాలం ఎక్కడ ఉన్నాయో అక్కడే కొనసాగబోతున్నాయి. పైగా గూఢచారులు, సైనికులు మరింత స్వేచ్ఛగా బహిరంగంగా లిబియా నేలపైన సుదీర్ఘ…
ఆఫ్ఘనిస్ధాన్ లో పాశ్చ్యాత్య దురాక్రమణ సైన్యం చావు దెబ్బలు తినడం కొనసాగుతోంది. గత శనివారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ వద్ద జరిగిన భూతల దాడిలో 17 మంది సైనికులు చనిపోగా, దక్షిణ ఆఫ్ఘనిస్ధన్ లో ఆఫ్ఘనిస్ధాన్ సైనికాధికారి ఒకరు తిరగబడి ఆస్ట్రేలియా సైనికులను ముగ్గురిని కాల్చి చంపాడు. ఈ రోజు సోమవారం 4గురు విదేశీ సైనికులను కాందహార్ వద్ద తాలిబాన్ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ నలుగురితో కలుపుకుని గత మూడు రోజుల్లోనే 24 మంది దురాక్రమణ…
“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం ప్రపంచవ్యాపితంగా 85 దేశాలలోని 2,500 నగరాలకు వ్యాపించినట్లుగా ఉద్యమ సంస్ధల వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాల్లో కంటె అమెరికా, యూరప్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కొన్ని ప్రధాన పట్టణాలలో పదుల సంఖ్యలో మాత్రమే నిరసనకారులను ఆకర్షిస్తున్న ఈ ఉద్యమం ఉత్తర అమెరికా, యూరప్ దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ఎక్కువగా దెబ్బ తిన్నది అమెరికా,…
పిల్లలపై అత్యాచారాలు జరపడంలో భారత దేశం పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2010 సంవత్సరంలోనే భారత దేశంలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1408 మంది పిల్లలను చంపేశారని కూడా ఆ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటా కలుపుకుని మొత్తం 10,670 మంది పిల్లలను కిడ్నాప్ చేయడమో, ఎత్తుకెళ్లడమో చేశారని ఎన్.సి.ఆర్.బి తెలిపింది.…
భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల…
ఢిల్లీకి సమీపంలో భారత దేశ సంపన్నులకు సంతోషం చేకూర్చే ఫార్ములా 1 రేసు మొట్ట మొదటి గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి. భారత దేశ ధనికుల విలాసాలను పట్టి చూపే ఫార్ములా 1 రేసు ఓవైపు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆ రేసు కోసం రోడ్డును అందంగా పటిష్టంగా నిర్మించి పెట్టిన కూలీలకు ఇంతవరకూ కూలి డబ్బులు దక్కని దయనీయ పరిష్దితి నెలకొని ఉంది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ తాను సాధించిన అభివృద్ధికి మురిపెంగా చూపుకునే సాక్ష్యాలలో…
26/11 దాడులు గా పేరు పొందిన ముంబై టెర్రరిస్టు దాడుల అనంతరం అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కటువుగా చేసిన వ్యాఖ్యలతో పాకిస్దాన్ బెంబేలు చెందినట్లుగా అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కొండొలిజా రైస్ తన ఆత్మకధలొ పేర్కొంది. “మేము యుద్ధానికి దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు” అని ప్రణబ్ ముఖర్జీ ఫోన్ లో మాట్లాడుతూ అనడంతో పాకిస్ధాన్ తీవ్ర స్ధాయిలో అప్రమత్తమయ్యిందని ఆమె పేర్కొన్నది. చైనా నుండి అమెరికా…
– హుర్రే…, హుర్రే… …, హుర్రే… … …! గడ్డాఫీ చచ్చాడోచ్! అయితే, ఇప్పుడేం చేద్ధాం?!? “??? !!! ???” —