‘అమ్మ’ కుర్చీలో పన్నీర్ సెల్వం! -కార్టూన్
హస్తిమశకాంతరం అంటే ఇదే కావచ్చు. ముఖ్యమంత్రిగా జయలలిత కూర్చున్న కుర్చీని ఇప్పుడు పన్నీర్ సెల్వం (OPS) అధిరోహించారు. ఆమె సింహాసనంపైన ఈయన ఎలకలా కనిపిస్తున్నారు. ఈ అంతరం శరీర పరిమాణంలో నిజమే, స్టేచర్ లోనూ నిజమే!
హస్తిమశకాంతరం అంటే ఇదే కావచ్చు. ముఖ్యమంత్రిగా జయలలిత కూర్చున్న కుర్చీని ఇప్పుడు పన్నీర్ సెల్వం (OPS) అధిరోహించారు. ఆమె సింహాసనంపైన ఈయన ఎలకలా కనిపిస్తున్నారు. ఈ అంతరం శరీర పరిమాణంలో నిజమే, స్టేచర్ లోనూ నిజమే!
ప్రధాని మోడీ గారి డీమానిటైజేషన్ కధ దాదాపు కంచికి చేరినట్లే. పాత పెద్ద నోట్ల రద్దు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం, RBI లు దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉన్నదో చెప్పారు. వారి ప్రకారం రద్దు చేసిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లలో చలామణిలో ఉన్న మొత్తం 14.95 లక్షల కోట్లు. కొన్ని పత్రికలు 14.18 లక్షల కోట్లు అని చెబుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద అంకెనే తీసుకుందాం. ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
Originally posted on ద్రవ్య రాజకీయాలు:
RBI జెల్ల కొట్టింది. వడ్డీ రేటు తగ్గింపు కోసం బడా కంపెనీలు, బడా బాబులు ఆశగా ఎదురు చూస్తుంటే వారి ఆశల్ని వమ్ము చేసింది. వడ్డీ రేట్లలో మార్పులు లేవు పొమ్మంది. పైగా 2016-17 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు విషయమై గతంలో వేసిన అంచనాను తగ్గించేసుకుంది. వృద్ధి రేటు 7.1 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం రేపో రేటు (స్వల్ప కాలిక వడ్డీ రేటు –…
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతుండగా భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది. ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబరు నెలలో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నదని హఫింగ్టన్ పోస్ట్ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత జీడీపీలో అత్యధిక వాటా -60 శాతం వరకు- సేవల రంగానిదే. కనుక మొత్తం జీడీపీ…
ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటించిన ‘పాత అధిక విలువ నోట్ల రద్దు’ వల్ల ఆశించిన ఫలితం అలా ఉంచి కనీస ఫలితం కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. “నల్ల డబ్బుని నిర్మూలించి డబ్బు నిల్వలను శుభ్రం చేసి, టెర్రరిజం ధన వనరులపై దెబ్బ కొట్టి, దొంగ నోట్లకు చోటు లేకుండా చేయడమే నోట్ల రద్దు లక్ష్యం” అని మొదట ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత ఈ లక్ష్యం పైన నిలబడకుండా మాటలు మార్చుతూ పోయినప్పటికీ జనం…
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయారన్న వార్తలు చెన్నైలో ఉద్రిక్త పరిస్ధితులను సృష్టించాయి. మరణించిన ముఖ్యమంత్రి పట్ల గౌరవ సూచకంగా ఏఐఏడిఎంకే కేంద్ర కార్యాలయంలో జెండాను అర్ధ అవనతం (half mast) కూడా చేసేశారు. దానితో ఆమె చనిపోయారనే చాలా మంది నిర్ధారించుకున్నారు. కానీ ఇంతలోనే అపోలో ఆసుపత్రి మరణ వార్తను నిరాకరిస్తూ ప్రకటన జారీ చేసింది. “ముఖ్యమంత్రి లైఫ్ సపోర్ట్ లో కొనసాగుతున్నారు” అని అపోలో డాక్టర్లు ట్వీట్ చేశారు. “అపోలో మరియు ఏమ్స్ లకు చెందిన…
వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ అసాంజే విడుదలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. అసాంజేను వెంటనే విడుదల చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఐరాస తీర్పుకు వ్యతిరేకంగా బ్రిటన్ చేసిన అప్పీలును ఐరాస రెండోసారి కూడా తిరస్కరించడంతో అయన విడుదల దాదాపు అనివార్యం అయింది. అయితే అసాంజేను విడుదల చేస్తారా లేదా మరో సాకు వెతికి పట్టుకుని నిర్బంధం కొనసాగిస్తారా అన్నది తెలియరాలేదు. నాలుగు సంవత్సరాలుగా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో అసాంజే బందీగా ఉన్న…
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన అంశంపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు లేఖ రాసిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ ‘డీమానిటైజేషన్’ ప్రకటించిన సంగతి ఎంతమందికి తెలుసు? ప్రశాంత్ భూషణ్ ఎవరో తెలియనివారు / గుర్తులేనివారు ఓసారి 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కుంభకోణాలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడానికి ప్రధాన కారకుడే ప్రశాంత…
ఇది ‘జైట్లీ నిజం కక్కేశారు’ ఆర్టికల్ కింద వెన్నెల గారు చేసిన వ్యాఖ్య! ********* —వెన్నెల బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్…
“నోట్లు తగినంతగా నిల్వ ఉన్నాయి. జనం ఆందోళన చెందవద్దు. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం” అని ఓ పక్క ప్రధాని, ఆర్ధిక మంత్రి, బ్యూరోక్రాట్ అధికారులు హామీలు గుప్పిస్తున్నారు. “క్యూలు తగ్గిపోయాయి, ఇక పరిస్ధితి మెరుగుపడినట్లే” అని ఆర్ధిక మంత్రి సంతోషం కూడా ప్రకటించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నదని పత్రికల సర్వేలు తెలియజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాంకులు కూడా అదే చెబుతున్నాయి. అనేక చోట్ల బ్యాంకులు, ఎటిఎం లలో కొత్త కరెన్సీ నోట్ల రాబడి…
పాత నోట్లను రద్దు చేయటానికి కారణంగా ప్రధాన మంత్రి ఏం చెప్పారు? మూడు ముక్కల్లో చెప్పాలంటే: నల్ల డబ్బు, టెర్రరిజం, దొంగ నోట్లు… వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయటమే డీమానిటైజేషన్ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. “జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీరు ఈ చర్యకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే త్యాగాన్ని చేయాలి. ఎందుకంటే ఈ చర్య ద్వారా అవినీతి, నల్ల డబ్బు, దొంగ నోట్లు మరియు టెర్రరిజం.. ఈ చెడుగులపై పోరాటం ఎక్కు పెట్టాము” అని ప్రధాన…
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గొంతు చాన్నాళ్ళకు వినబడింది. ‘మౌని బాబా’ గా ఇప్పటి ప్రధాన మంత్రి చేత పదే పదే ఎద్దేవా చేయబడిన మన్మోహన్ సింగ్ నోరు తెరవడమే కాదు, గాండ్రించారు కూడా. వయసు మీద పడిన మన్మోహన్ నిజానికి మోడి లాగా పెద్ద పెద్ద చప్పుళ్ళు చేయలేరు. ఆయన ఎంత చిన్నగా, మెల్లగా మాట్లాడినా ఆ మాటల్లో పదును ఉంటే దానిని గాండ్రింపుగా లెక్కించవచ్చు. తాటాకు చప్పుళ్ళ కంటే లక్ష్యానికి గురి చూసే…
(గత టపా కింద తెలుగు టెకీ గారు రాసిన వ్యాఖ్య ఇది. చెతుర్లతో, విరుపులతో, క్లుప్తంగానే అయినా వివరంగా రాసిన తీరు ప్రత్యేకంగా ఉన్నందున టపాగా మార్చి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) ********* రచన: తెలుగు టెకీ / శివ రామ పెద్ద నోట్ల చలామణి ప్రతిష్టంభన ప్రభుత్వం తమ పాలనను ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో పదిలపరచుకునే నేపధ్యంలో వ్యాపార దిగ్గజాలతో అంతర్గత ఒడంబడికల మేలు కలయిక, సామాన్యుల పరిధిలో కీడు ప్రక్రియ. ఈ చర్య అమలుకు…
ప్రజల అభిప్రాయానికి విలువ లేదు. సామాన్య ప్రజల కష్టాల పట్ల సానుభూతి లేదు. వ్యతిరేక అభిప్రాయం పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్యంలో విరుద్ధ అభిప్రాయాలకు స్ధానం ఇవ్వాలన్న జ్ఞానమే లేదు. నోట్ల రద్దు వల్ల కలిగే ప్రభావంపై ముందస్తు అంచనా లేదు, అధ్యయనం అసలే లేదు. కనీసం ఏర్పాట్లు లేవు. కోట్లాది మంది శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి పారేసి నల్ల “ధనంపై పోరాటం” అని ప్రకటిస్తే జనం ఏమై పోతారన్న…
నోట్ల రద్దు వల్ల టాటా, బిర్లా, మహేంద్ర.. ఈ మూడు బడా పారిశ్రామిక గ్రూపులకు 9 బిలియన్ డాలర్లు క్షవరం అయిపొయింది. ఈ క్షవరం నల్ల ధనం రద్దు కావడం వల్ల జరిగిన నష్టం కాదు. నోట్ల రద్దు దరిమిలా జీడీపీ పడిపోతుందనీ, అమ్మకాలు తగ్గిపోతాయనీ… ఇత్యాది భయాలతో షేర్ హోల్డర్లు ఆ కంపెనీల లోని షేర్లను అమ్మేయటం వలన సంభవించిన నష్టం. ప్రధాన మంత్రి మోడీ డీమానిటైజేషన్ ప్రకటించిన దగ్గరినుండి షేర్ల సూచి సెన్సెక్స్…