భారత్ రాయబార విజయం, తిరిగి రానున్న ఇటలీ మెరైన్లు
ఇండియా మరోసారి ఇటలీపై రాయబార విజయాన్ని నమోదు చేసుకుంది. కేరళ జాలర్ల హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాకు వస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిన అనంతరం మెరైన్లను తిరిగి పంపడానికి ఇటలీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు విధించిన గడువు చివరి తేదీ మార్చి 22 నే ఇటలీ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ మేరకు గురువారం బాగా పొద్దుపోయాక ఇటలీ ప్రభుత్వ ప్రకటన…