ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?

  భారత్-చైనా సంబంధాలు మరొకసారి ఘర్షణాత్మక వైఖరిలోకి ప్రవేశించాయి. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇరు దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఒక్కసారిగా రద్దు కానున్నాయా అన్న అనుమానం కలిగే వైపుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దు లో తిరిగి యధాతధ స్ధితిని తీసుకురావాలని భారత ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘దౌలత్ బేగ్ ఓల్డి’ సెక్టార్ లో చైనా బలగాలు 10 కి.మీ దూరం…

దాహం వేసినప్పుడు బావి తవ్వుకుందాం! -కార్టూన్

“ఏయ్! ఆ పోలీసు సంస్కరణల పుస్తకాలు పట్రండి… ఇప్పుడే!” – ప్రభుత్వము, పోలీసులు అనేక అంశాల్లో దాహం వేసినప్పుడు బావి తవ్వుకునే ధోరణి అనుసరించడం అందరూ ఎరిగినదే. మహిళలపై అత్యాచారాలు జరిగిన సందర్భం వచ్చినప్పుడల్లా పోలీసు సంస్కరణల గురించి మంత్రులు, రాజకీయ నాయకులు, చివరికి పోలీసు అధికారులు సైతం అనేక మాటలు, వాగ్దానాలు కురిపించడం సర్వసాధారణంగా మారింది. దుర్ఘటన జరిగినపుడు పోలీసులు తగిన రీతిలో స్పందించకపోవడం పోలీసుల తీరుతో ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడం ప్రభుత్వము,…

జస్టిస్ వర్మ ఇక లేరు

జ్యోతి సింగ్ పాండే అలియాస్ నిర్భయ పై జరిగిన పాశవిక సామూహిక అత్యాచార, హత్యోదంతం అనంతరం భారత దేశ న్యాయ వ్యవస్ధకు బాధ్యతాయుతమైన రీతిలో ప్రాతినిధ్యం వహించిన జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ సోమవారం మరణించారు. నిర్భయ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్ జె.ఎస్.వర్మ రికార్డు సమయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రజల సమస్యల పట్ల అధికార వ్యవస్ధ స్పందించవలసిన తీరుకు ఒక ఉదాహరణగా నిలిచారు. ‘నిర్భయం చట్టం’ –…

లడఖ్ లో చొరబాటు వార్తలను తిరస్కరించిన చైనా

తూర్పు లడఖ్ ప్రాంతంలో పది కిలో మీటర్ల మేర చైనా సాయుధ బలగాలు ఇండియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయన్న వార్తలని చైనా ఖండించింది. వాస్తవాధీన రేఖ (Line of Actual Control – LAC) కు సంబంధించి ఇండియాతో కుదిరిన ఒప్పందాలను తాము అతిక్రమించబోమని, తమ సైనికులు రేఖను దాడి వెళ్లలేదని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా సరిహద్దులో భారత ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రక్షణ మంత్రి ఆంటోని ప్రకటించాడు.…

ఢిల్లీ పాప అత్యాచారం: రెండో నిందితుడి అరెస్టు

తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ లో ఐదేళ్ల పాపపై అత్యాచారం జరిగిన కేసులో రెండో వ్యక్తి పాత్రను నిరాకరిస్తూ వచ్చిన పోలీసులు సోమవారం అందుకు విరుద్ధమైన పరిణామాన్ని దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు. రెండో నిందితుడుగా భావిస్తున్న ప్రదీప్ ను బీహార్ లోని లఖిసారాయ్ జిల్లా నుండి అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. తాను పాపపై ఏ అఘాయిత్యానికి తలపెట్టలేదని, అత్యాచారం చేసింది ప్రదీప్ అని మనోజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పాపపై అత్యాచారం…

గుర్తుపెట్టుకోవడం సులువే -ఈనాడు వ్యాసం 10వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపరలో 10వ భాగం ఈ రోజు ఈనాడు పత్రిక ‘చదువు’ పేజీలో ప్రచురితం అయింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలను, వాటి ప్రాముఖ్యతల ప్రకారం గుర్తు పెట్టుకోవడం ఎలా అన్నది ఈ భాగంలో కొంతవరకు చర్చించాను. ఈనాడు పత్రిక వెబ్ సైట్ లో నేరుగా చూడదలిచిన వారు ఇక్కడ క్లిక్ చేయగలరు. (ఈ లంకె కేవలం ఈ వారం వరకు మాత్రమే పని చేస్తుంది.) ప్రత్యామ్నాయంగా కింద బొమ్మపై క్లిక్…

మధ్యప్రదేశ్ లో మరో పాప!

ఢిల్లీలో ఐదేళ్ల పాపపై జరిగిన అత్యాచారం విషయంలో దేశం నిశ్చేష్టురాలై ఉండగానే మధ్య ప్రదేశ్ లో మరో ఐదేళ్ల పాపపై దాదాపు అలాంటి ఘోరమే చోటు చేసుకుంది. ఐదేళ్ల పాప పైన 35 సంవత్సరాల త్రాష్టుడొకరు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పాప కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని పత్రికలు చెబుతున్నాయి. పరిస్ధితి క్షీణించడంతో పాపను హుటాహుటిన నాగపూర్ కి ఎయిర్ అంబులెన్సు లో మహారాష్ట్ర లోని నాగపూర్ కి తరలించారు. మధ్య ప్రదేశ్ లోని…

గంజాయివనంలో తులసి: పుట్టే ప్రతి ఆడపిల్లకి 111 చెట్లు నాటే గ్రామం

భారత దేశంలో చెడబుట్టిందీ గ్రామం. మందీ మార్బలం అంతా చేతుల్లో ఉంచుకుని కూడా ‘మహిళా సాధికారత’ విషయంలో మాటలు తప్ప చేతల్లోకి వెళ్లని ప్రభుత్వాల నిష్క్రియా సంస్కృతి ఎల్లెడలా వ్యాపించి ఉన్న రోజుల్లో ఈ గ్రామం తనదైన పర్యావరణ-స్త్రీవాదాన్ని (Eco-feminism) పాటిస్తోంది. ఆడోళ్లపై ఫ్యూడల్ అహంభావం, అణచివేత, చిన్న చూపు విస్తృతంగా వ్యాపించి ఉండే రాజస్ధాన్ రాష్ట్రంలోనే ఈ వింత చోటు చేసుకోవడం విశేషం. గత అనేక సంవత్సరాలుగా పిప్లాంత్రి గ్రామ ప్రజలు ఆడపిల్లలను జాగ్రత్తగా సాకడమే…

ఢిల్లీ పాప అత్యాచారం: పాలకులారా, ఛావెజ్ ను చదవండి!

అత్యంత విలువైన సమయాన్ని పోలీసులు వృధా చేయడంతో పాపను త్వరగా కనుక్కోలేకపోయారని ఢిల్లీ పాప బంధువులు ఆరోపించారు. సోమవారం సాయంత్రం పాప కనిపించకుండా పోయాక కొద్ది సేపు వెతికి గాంధీ నగర్ పోలీసులను ఆశ్రయించామని కానీ వారు రాత్రంగా స్టేషన్ లోనే తమను కూర్చోబెట్టారని వారు తెలిపారు. ఆ తర్వాత రోజు కూడా అదీ, ఇదీ కావాలని తిప్పించారని అసలు వెతికే ప్రయత్నం చేయలేదని తెలిపారు. పాప దొరికిన తర్వాత తండ్రిని పక్కకు పిలిచి గొడవ చేయొద్దని…

బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే

బోస్టన్ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా అమెరికా ప్రకటించిన చెచెన్యా జాతీయులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబులు అభివృద్ధి చేసి సి.సి కెమెరాలు చూస్తుండగా వాటిని సంచుల్లో పెట్టుకుని బోస్టన్ మారధాన్ స్ధలానికి తెచ్చి ఎలా పేల్చగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలిద్దరిని కుట్ర చేసి ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు రష్యా టుడే తెలియజేసింది. ఎఫ్.బి.ఐ గూఢచారులు ఎప్పుడూ తమ ఇంటికి వచ్చేవారని, తమ పిల్లల గురించి…

పార్లమెంటుకి భారీ ముప్పు -కార్టూన్

రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని,…

ఐదేళ్ల పాప అనుభవించిన అమానుషం చెప్పనలవి కాదు…

అదే రాజధాని నగరం. అదే తరహా అత్యాచారం, అదే పోలీసులు, అదే నిష్క్రియాపరత్వం, అదే అవహేళన, అదే వర్గ స్పృహ…! వయసొక్కటే తేడా. ఈసారి అత్యాచారం బాధితురాలి వయసు కేవలం 5 సంవత్సరాలు. శారీరక బాధ తప్ప తనను ఏం చేస్తున్నాడో తెలియని పసి వయసు. జరిగిన అమానుషం ఏమిటో ఊహించుకోలేని మనసు. అభం శుభం తెలియని ఆ పాప ఎప్పటిలాగా ఆడుకోడానికి బైటికి వచ్చింది. ఎప్పటి నుండి కన్నేసాడో గాని మానసిక వైపరీత్యంతో, శారీరక మద…

బోస్టన్ పేలుళ్ళ అనుమానితుల చిత్రం విడుదల, ఒకరి కాల్చివేత

బోస్టన్ మారధాన్ బాంబు పేలుళ్ళ కేసులో ఇద్దరు అనుమానితుల చిత్రాలు, వీడియోలను అమెరికా ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (ఎఫ్.బి.ఐ) విడుదల చేసింది. సి.సి కెమెరాలు రికార్డు చేసిన వీడియో నుండి ఇద్దరు అనుమానితులను ఎఫ్.బి.ఐ గుర్తించింది. వీడియో, చిత్రాలను విడుదల చేస్తూ వారి గురించి తెలిసినవారు సమాచారం ఇవ్వాలని ఎఫ్.బి.ఐ కోరింది. బాంబులు పెట్టిన వ్యక్తి నల్ల వ్యక్తి అని ‘న్యూయార్క్ పోస్ట్’, ‘బోస్టన్ టైమ్స్’ లాంటి పత్రికలు చేసిన ప్రచారం నిజం కాదని ఎఫ్.బి.ఐ…

పర్వేజ్ ముషర్రాఫ్: నేరుగా మొసలి బోనులోకే లాండింగ్ -కార్టూన్

తన దేశ ప్రజలకోసం సరికొత్త ఐడియాలతో తిరిగొచ్చానని నమ్మబలికిన పాకిస్ధాన్ మాజీ నియంత పర్వేజ్ ముషర్రాఫ్ నేరుగా మొసలి బోనులోకి ల్యాండ్ అయ్యాడు. సాధారణంగా పాకిస్ధాన్ లో మిలట్రీ పాలకులు, కోర్టులు ఒకే పక్షం వహిస్తాయి. ఎక్కడ బెసికిందో గాని ముషర్రాఫ్ ని వెంటనే అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అరెస్టు చేసేలోపు మిలట్రీ అందజేసిన అంగరక్షకుల సహాయంతో పోలీసుల కళ్ళు గప్పి ఆయన పారిపోగలిగాడు. ఆయన పారిపోలేదని…

టెక్సాస్: భూకంపం తలపిస్తూ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు, మరణాలు 70? -ఫోటోలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వాకో నగరం వద్ద ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ భారీ స్ధాయిలో పేలిపోయింది. 5 నుండి 15 మంది వరకు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా పత్రికలు డజన్ల మంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నాయి. 70 మందికి పైనే మరణించారని స్ధానిక పత్రికలు చెప్పినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారని బి.బి.సి తెలిపింది. ఎరువుల ఫ్యాక్టరీ కావడంతో మంటల వలన వ్యాపిస్తున్న దట్టమైన పొగ విషపూరితంగా ఉన్నదని, దానితో వివిధ విభాగాల భద్రతా…