భిక్షా పాత్రకు కూడా మతం ఉంది!

కాలం అనుకూలంగా లేకపోతే (టైం బాగోకపోతే) తాడే పామై కరుస్తుందంటారు. (ఇక్కడ నెపాన్ని కాలం మీదికి నెట్టేసినా దానర్ధం ‘స్ధల, కాల పరిస్ధితులు’ అయి ఉండాలి.) మియాన్మార్ (బర్మా) లో ముస్లింల పరిస్ధితి అలానే తగలడింది. ఒక బౌద్ధ భిక్షువుకు చెందిన భిక్షా పాత్రను ఒక ముస్లిం మహిళ పగలగొట్టిందన్న అనుమానంతో ముస్లింల పైనా, ఒక మసీదు పైనా దాడి జరిపారు అహింసావాదులైన భౌద్ధ మత ప్రజలు. ఇటీవలే మత ఘర్షణలతో అట్టుడికిన మియాన్మార్ లో మరో…

సి.బి.ఐని కడిగేసిన సుప్రీం కోర్టు

– బొగ్గు కుంభకోణం విచారణలో సి.బి.ఐ నిర్వహిస్తున్న పాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. సి.బి.ఐ ని ప్రభావితం చేయడానికి న్యాయ శాఖ మంత్రి స్వయంగా పూనుకోవడం, ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఇందులో పాత్ర వహించడాన్ని బట్టి పాలకులు అవసరం అయితే ఎంతకు తెగిస్తారో తెలిసి వస్తోంది. విచారణ పురోగతి నివేదికలను ప్రభుత్వానికి చూపడం లేదని మార్చి 8 తేదీన చెప్పిన సి.బి.ఐ ఏప్రిల్ 26 తేదీన సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వానికి చూపిన తర్వాతే కోర్టుకు…

బొగ్గు: రాజకీయుల ఆదేశాలు తీసుకోవద్దు, సి.బి.ఐతో సుప్రీం

బొగ్గు కుంభకోణం విచారణకు సంబంధించి ఇక నుండి రాజకీయ కార్యనిర్వాహకుల (political executive) నుండి ఆదేశాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు సి.బి.ఐ ని ఆదేశించింది. ఏప్రిల్ 26 తేదీన సి.బి.ఐ సమర్పించిన అఫిడవిట్ లో అత్యంత కలతపరిచే అంశాలు ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. బొగ్గు కుంభకోణం విచారణలో సుప్రీం కోర్టుకు సి.బి.ఐ సమర్పిస్తున్న (దర్యాప్తు) పురోగతి నివేదికలను కోర్టుకు సమర్పించే ముందు ప్రభుత్వ మంత్రులకు బ్యూరోక్రాట్ అధికారులకు చూపిస్తున్నామని సి.బి.ఐ అఫిడవిట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.…

అణు విద్యుత్తుతో ఆటలా? -కత్తిరింపు

ఏప్రిల్ 30 తేదీన (ఈ రోజు) ఈనాడు ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం ఇది. అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు రాశారు. తమిళనాడులో నిర్మించబడుతున్న కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి రష్యా నుండి నాసిరకం పరికరాలు సరఫరా అయ్యాయని ఆరోపణలు గుప్పుమన్న నేపధ్యంలో ఈ వ్యాసం వెలువడింది. నాసిరకం ఉక్కుతో తయారు చేసిన విడి పరికరాల వలన అణు విద్యుత్ కర్మాగారానికి ముప్పు పొంచి ఉన్నదని రచయిత చర్చించారు. కూడంకుళం అణు కర్మాగారాన్ని భారత ప్రభుత్వం…

సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నా, ఆఫ్ఘన్ అధ్యక్షుడి ఒప్పుకోలు

ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వంలో అవినీతి గురించి తెగ బాధపడిపోయే అమెరికా అవినీతి భాగోతాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్వయంగా బైటపెట్టాడు. తాను సి.ఐ.ఎ వద్ద డబ్బు తీసుకున్నమాట నిజమేనని కానీ ఆ డబ్బు గాయపడినవారికి, జబ్బు పడినవారికి, కొన్ని ఇళ్లకు అద్దె చెల్లించడానికి వినియోగించానని హమీద్ కర్జాయ్ నమ్మబలికాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో సి.ఐ.ఎ లంచాలు మేపడం కొత్తేమీ కాదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సి.ఐ.ఎ చర్యలను సమర్ధించుకురాగా, సి.ఐ.ఎ సొమ్ము చివరికి తాలిబాన్ వద్దకే చేరుతోందని అనేకమంది…

జ్యోతి సింగ్ సింగపూర్ కి, సరబ్ జిత్ సింగ్ ఇండియాకి!?

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక విచిత్రమైన ప్రకటన జారీ చేసింది. సరబ్ జిత్ సింగ్ ని విడుదల చేసి ఇండియాకి పంపిస్తే ఇక్కడ ఉన్న అత్యున్నత వైద్య చికిత్సను అందజేసి ఆయన్ను బతికించుకుంటామన్నది ఆ ప్రకటన సారాంశం. ‘బతకడం కష్టమే’ అని పాకిస్ధాన్ డాక్టర్లు పెదవి విరుస్తున్న సరబ్ జిత్ సింగ్ కి అత్యున్నత స్ధాయి వైద్య చికిత్స అందజేసి గుర్రాన్ని ఎగిరించగల భారతీయ వైద్యం జ్యోతి సింగ్ పాండేకు ఎందుకు పనికిరాకుండా పోయింది?…

తమిళనాట కులాల కాలకూట విషం విరజిమ్ముతున్న పి.ఎం.కె

కుల దురభిమానమే పెట్టుబడిగా స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సిద్ధపడిన డాక్టర్ ఎస్.రాందాస్ తమిళనాడులో కులాల కాలకూట విషాన్ని విరజిమ్ముతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా, అది రాకపోతే సృష్టించుకుని మరీ అమాయక పేద ప్రజల మధ్య చిచ్చు రగుల్చుతున్నాడు. ‘చిత్ర పౌర్ణమి’ యూత్ ఫెస్టివల్ పేరుతో ఏప్రిల్ 25 తేదీన రాందాస్ నేతృత్వంలోని ‘పట్టలి మక్కల్ కచ్చి’ (పి.ఎం.కె) పార్టీ నిర్వహించిన వన్నియార్ ‘కుల పండగ’ దళితుల రక్తాన్ని మరోసారి చిందించింది. గంధపు చెక్కల స్మగ్లర్ గా రెండు రాష్ట్రాల…

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన -11 భాగాలు

ఈనాడు దిన పత్రికలో ప్రతి సోమవారం ప్రచురించే చదువు పేజీలో ‘జాతీయ అంటార్జాతీయ పరిస్ధుతులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపర వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాసాలను కొత్తగా చూసినవారు పాత భాగాల కోసం అడుగుతున్నారు. కొంతమంది ‘కటింగ్ తీసి పెట్టారా’ అని అడుగుతుంటే, ఇంకొందరు ‘అన్నీ కలిపి బుక్ వేస్తారా’ అని అడుగుతున్నారు. నేను కటింగ్స్ తీసి పెట్టలేదు. బ్లాగ్ లో ఉన్నాయి గనుక ఆ జాగ్రత్త తీసుకోలేదు. బుక్ వేయదలిస్తే ఈనాడు వాళ్ళు వేయాలనుకుంటా.…

మన్మోహన్ ఫైలుకి పరిష్కారం లేదు -కార్టూన్

ది హిందు పత్రికలో కేశవ్ కార్టూన్లు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఒక్కోసారి కేశవ్ కవి కాబోయి కార్టూనిస్టు అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కార్టూన్లకు కవిత్వానికి ఉన్నంత లోతు ఉంటుంది. ఆ లోతు ఒక్కోసారి చాలామందికి అందదు. (నాక్కూడా.) ఈ కార్టూన్ అందులో ఒకటిగా కనిపిస్తోంది. ‘మిస్టర్ క్లీన్’గా ఒకప్పుడు మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ ఇప్పుడు అవినీతి రాజుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మన్మోహన్ కి ఆపాదిస్తున్న అవినీతి ద్వారా ఆయన స్వయంగా లబ్ది పొందకపోవడమే…

ఏ దేశానిది ఏ నేపధ్యం -ఈనాడు ఆర్టికల్ 11వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా’ వ్యాస పరంపరలో 11 వ భాగం ఈ రోజు ప్రచురించబడింది. వివిధ దేశాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్న అంశానికి కొనసాగింపు ఈ వ్యాసం. 10వ ఆర్టికల్ లో అమెరికా యూరప్ ల గురించి చర్చించుకున్నాం. ఈసారి మిగిలిన ప్రాంతంలో మరి కొన్నింటిని ఎలా గుర్తుంచుకోవచ్చో చర్చిస్తాము. ఈనాడు చదువు పేజీలో ఈ వ్యాసం చూడవచ్చు. వ్యాసాన్ని ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్ పైన…

బోడిగుండుకు మోకాలుకు ముడి పెట్టడం అంటే ఇదే

రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తిమ్మిని బమ్మిని చేయగలరు, బోడిగుండుకు మోకాలుకు పీట ముడి వేయగలరు. బి.జె.పి అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ ఈ విద్యలో అనూహ్య స్ధాయిలో ఆరితేరినట్లు కనిపిస్తోంది. ఆయన చెప్పిందాని ప్రకారం: భారత భూభాగం లోకి చైనా జరిపిన చొరబాటు నుండి దృష్టి మరల్చడానికే పాకిస్ధాన్ జైలులో భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ పైన హంతక దాడి జరిగింది. ఈ మేరకు పాకిస్ధాన్ ప్రభుత్వం పూనుకుని మోసపూరితంగా సరబ్…

ఇరాక్: ఆల్-జజీరా చానెల్ అనుమతి రద్దు

కతార్ రాజ్యాధినేత నడుపుతున్న ఆల్-జజీరా ఛానెల్ ఇరాక్ లో ప్రసారాలు చేయకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధ, ధన, మానవ వనరుల సహాయం అందజేస్తున్న కతార్ చానెల్ ఇరాక్ లో కూడా సెక్టేరియన్ విభజనలను రెచ్చగొడుతోందని ఇరాక్ ప్రభుత్వం ఆరోపించింది. ఆల్-జజీరాతో పాటు మరో 9 టి.వి చానెళ్లకు కూడా ఇరాక్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. ఈ మేరకు ఇరాక్ అధికారులు ఆదివారం ప్రకటించారు. మెజారిటీ మతస్ధుల షియా…

ఇటలీలో వర్గ సంకర ప్రభుత్వం!

ఇటలీలో ఎట్టకేలకు ఒక ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎన్నికలు ముగిసి రెండు నెలలు దాటినా అక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఏ పార్టీకి గానీ, ఏ కూటమికి గానీ ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లూ పాత ప్రధాని నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం నడిచిందక్కడ. అయితే శనివారంతో ప్రతిష్టంభనకు తెరపడింది. తెరపడడం కాదు గానీ విచిత్ర పద్ధతిలో తెరపడడమే అసలు వార్త. రాజకీయ సమతలం పైన దాదాపు వైరి శిబిరాలుగా వ్యవహరించే మిత వాద కూటమి, వామపక్ష పార్టీల…

తాటిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకు అన్నాట్ట! -కార్టూన్

“అబ్బే ఏ దారిలో వెళ్లాలో తెలుసుకోడానికి ఇక్కడకు వచ్చారంతే!” – బొగ్గు కుంభకోణం నుండి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను, ఆయనతో పాటు కాంగ్రెస్ (యు.పి.ఏ) ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలు పిల్లి మొగ్గలు అన్నీ ఇన్నీ కాదు. బొగ్గు కుంభకోణం పైన విచారణ జరుపుతున్న సి.బి.ఐ సుప్రీం కోర్టుకు దశలవారీగా స్ధాయి నివేదికలను (status reports) సమర్పిస్తోంది. మార్చి నెలలో నివేదికను కోర్టుకు సమర్పించడానికి ముందు న్యాయ శాఖ మంత్రి అశ్వని కుమార్…

బతుకులు చిదిమిన ఈ సౌధం, మానవ నిర్మిత విషాదం -ఫోటోలు

బంగ్లాదేశ్ లో అత్యంత శక్తివంతమైన బట్టల తయారీదారులు తమ లాభ దాహంతో 324 మందికి మరణ శాసనం లిఖించారు. గంటల తరబడి నీరు, ఆహారం అందక వేడి వాతావరణంలో డీ హైడ్రేషన్ వల్ల చనిపోయినవారు కొందరైతే, భవనాల గోడల మధ్య, కాంక్రీటు నేలల మధ్య చిక్కుకుని చితికిపోయినవారు మరికొందరు. శిధిలాల చుట్టూ వేలాది జనం తమవారి కోసం విలపిస్తూ అధికారులు గోడలపైన అంటిస్తున్న జాబితాల్లో తమవారి పేర్లు వెతుక్కుంటూ విషాదం అంతా కళ్ళల్లో నింపుకుని కనిపిస్తున్నారు. ఢాకా…