రాజ్ నాధ్ సింగ్ బహుళ దిశల సవారి -కార్టూన్

బి.జె.పి అధ్యక్షుడి కర్తవ్య నిర్వహణ ఇప్పుడు కత్తి మీది సాము అయింది. కాదు, కాదు… కత్తి మీద సవారీ అయింది. ఆయన అటు ఎన్.డి.ఏ పక్షాలను దారికి తెచ్చుకోవాలి. ఇటు బి.జె.పి లోని నాయకులను ఒక దారిలో నడిచేట్లు చేయగలగాలి. అద్వానీ తిరుగుబాటుతో బి.జె.పి లోని చీలికలు స్పష్టంగా లోకానికి తెలిసి వచ్చాయి. ఇన్నాళ్లూ ఊహాగానాలతో సాగుతూ, బి.జె.పి నాయకుల తిరస్కరణలతో కప్పి ఉంచబడిన బి.జె.పి లుకలుకలకు అద్వానీ తిరుగుబాటు అచ్చమైన జీవం పోసింది. ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో…

అద్వానీ కష్టే మోడి ఫలి! -కార్టూన్

‘కష్టే ఫలి’ అంటారు అద్వానీ లాంటి పెద్దలు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని కూడా చెబుతారు. భాజపా సీనియర్ నాయకుడు, భీష్మ పితామహుడుగా కొనియాడబడే లాల్ కృష్ణ అద్వానీ ‘ప్రధాని పదవి’ అనే ఫలితం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూశారు. దానికోసం తీవ్రంగా శ్రమించారు. శిలాన్యాస్ కోసం ప్రతి ఊరి నుండి ఇటుక తెచ్చినట్లుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. రధ యాత్రలు చేశారు, మత కల్లోలలాను సృష్టించారు. 2 నుంది 80…

స్నోడెన్ ఒక హీరో -జులియన్ అసాంజే

– ప్రపంచ ప్రజల అంతర్జాల కార్యకలాపాల పైనా, టెలిఫోన్ సంభాషణల పైనా అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిన సంగతిని లోకానికి వెల్లడి చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను ‘హీరో’ గా వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే అభివర్ణించారు. ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధంలో వేలాది అమాయక పౌరులను అమెరికన్ బలగాలు చిత్రహింసలు పెట్టి చంపిన వైనాన్ని, వివిధ దేశాలలో నియమితులైన తమ రాయబారుల ద్వారా ఆ దేశాల్లో అమెరికా గూఢచర్యానికి పాల్పడుతున్న మోసాన్ని ‘డిప్లోమేటిక్ కేబుల్స్’ ద్వారా ప్రపంచానికి…

జియాఖాన్ ప్రేమ దుఃఖం, ఆమె చివరి క్షణాల అక్షరాల్లో…

జియా ఖాన్! తన మొదటి సినిమాతోనే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం దొరకబుచ్చుకున్న నటి. బ్రిటన్ లో పుట్టి, అక్కడే పెరిగి రామ్ గోపాల్ వర్మ సినిమా ‘నిశ్శబ్ద్’ లో నటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువతి. తన హృదయాన్ని మనస్ఫూర్తిగా, అమాయకంగా ఒక తిరుగుబోతుకి కానుకగా సమర్పించుకుని, మోసపోయి, విరక్తి చెంది, జూన్ 3 తేదీన, ముంబై జూహు లోని తమ నివాసంలో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. సినిమాలు…

అస్త్ర సన్యాసియే అలిగిన నాడు… -కార్టూన్

తనచేత అస్త్ర సన్యాసం ఎలా చేయించాలో నేరుగా పాండవుల చెంతనే గుట్టు విప్పిన కురు పితామమహుడు భీష్ముడు. ఆ విధంగా ఆయన తన పాండవ పక్షపాతాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా చాటుకున్నాడు. అయితే అది వ్యక్తిగతమే. ఆయన యుద్ధం చేసినంతవరకు కౌరవుల తరపున చేలెరేగి పోరాడాడు. ఆయన యుద్ధ కౌశల విశ్వరూపానికి తట్టుకోలేకనే పాండవులు ఆయన్ని ఎలా కూల్చివేయాలో భీష్ముడినే సలహా కోరినట్లు మహా భారతం చెబుతోంది. కౌరవులకు భీష్ముడు ఎలాగో, బి.జె.పికి అద్వానీకి అలాంటివారు. ఆర్.ఎస్.ఎస్…

ఎడ్వర్డ్ స్నోడెన్: ప్రిజం లీక్ చేసింది సి.ఐ.ఎ కాంట్రాక్టరే

అమెరికన్ మిలటరీ గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ, ప్రపంచ ప్రజల రోజువారీ ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లపై నిఘా పెట్టడానికి అభివృద్ధి చేసిన ‘ప్రిజం’ కార్యకలాపాల గురించి ‘ది గార్డియన్’, ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలకు వెల్లడి చేసింది సి.ఐ.ఎ మాజీ కాంట్రాక్టరేనని గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది. సి.ఐ.ఎ కాంట్రాక్టర్ గా పని చేసి, అనంతరం ఎన్.ఎస్.ఎ మిలట్రీ కాంట్రాక్టర్ బూజ్ అలెన్ వద్ద ఉద్యోగిగా పని చేస్తున్న ఎడ్వర్డ్ స్నోడెన్ తమకు ‘ప్రిజం’ గురించి సమాచారం ఇచ్చాడని…

బి.జె.పి పదవులకు అద్వానీ రాజీనామా, ముదిరిన సంక్షోభం

ఈనాడు పత్రిక అంచనా తల్లకిందులయింది. ఆ పత్రిక విలేఖరి ఊహించినట్లు అద్వానీ కోసం ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. తన అభ్యంతరాలను పక్కకు నెట్టి, మోడీకి ఎన్నికల ప్రచార సారధ్య బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ పార్టీ అగ్రనేత అద్వానీ తీవ్ర చర్యకు దిగారు. పార్టీలోని అన్నీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. తన లేఖనే రాజీనామా పత్రంగా భావించాలని ఆయన కోరారు. అద్వానీ…

ప్లాన్-బి కోసం అద్వానీని పక్కన పెట్టారా? -కత్తిరింపు

ఈ రోజు (సోమవారం, 10.06.2013) ఈనాడు దినపత్రిక ఆరో పేజీలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ప్రచురించారు. “ఏమో గుర్రం ఎగరా వచ్చు” శీర్షికన వచ్చిన ఈ విశ్లేషణ ప్రకారం అద్వానిని పక్కన పెట్టడం కూడా బి.జె.పి పధకరచనలో ఒక భాగమే. ప్లాన్-ఎ లో మోడి సారధ్యం వహించి పార్టీకి అత్యధిక సీట్లు రాబట్టాలి. ప్లాన్-ఎ విఫలం అయితే ప్లాన్-బి అమలులోకి వస్తుంది. ప్లాన్-బి ప్రకారం మోడి తగినన్ని సీట్లు కూడగట్టలేకపోతే గనక, మోడరేటర్ ముసుగు ధరించిన అద్వానీ…

అందినట్టే అంది ఎగిరిపోయిందా!… -కార్టూన్

పాపం అద్వానీ! ఎన్ని ఎత్తులు, ఎన్ని పై ఎత్తులు! ఎన్ని ఎదురు చూపులు, ఆ ప్రధాని కుర్చీకోసం? తనను మించిన సీనియర్ పార్టీలో లేకపోయినా, జనంలో బహుశా తనకు మించిన ఆమోదనీయత కూడా పార్టీలో ఎవరికీ లేకపోయినా ఆ ప్రధాని కుర్చీ మాత్రం అద్వానీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రానున్న పార్లమెంటరీ ఎన్నికలకు గాను ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలను నరేంద్ర మోడీకి అపజెప్పడం ద్వారా బి.జె.పి జాతీయ కార్యవర్గం తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పినట్లేనని…

గాలి బుడగ జీవితం, ఓటి పడవ జాతకం

“జీవితం బుద్భుద ప్రాయం” అని చెప్పనివారిదే పాపం అన్నట్లుగా ఎందరో చెప్పి పోయారు. కానీ అవేవీ పొట్ట తిప్పలని అరికట్టలేక పోయాయి. పైగా యుద్ధ బీభత్సాలు, సంక్షుభిత ఆర్ధిక వ్యవస్ధల పుణ్యాన ‘కూటి కోసం కోటి కోట్ల… తిప్పలు’ అన్నట్లుగా మారింది పరిస్ధితి. మనిషి కష్టాలు మరింత పెరుగుతున్నాయే గాని తరుగుతున్న పరిస్ధితి లేదు. డెయిలీ లైఫ్ శీర్షికన వివిధ దేశాల నుండి సేకరించి ‘బోస్టన్ గ్లోబ్’ అందించిన ఫొటోలివి. అలవి మాలిన మనిషి కష్టాలతో పాటు…

అమెరికా గూఢచర్యం: ప్రిజమ్ గుప్పిట ప్రపంచ ప్రజల తలరాతలు

ప్రైవసీ పాలసీల పేరుతో గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రోసాఫ్ట్, యాపిల్ తదితర భారీ ఇంటర్నెట్ కంపెనీలు మనకు చూపిస్తున్నదంతా వాస్తవం కాదని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా అంగీకరించాడు. అమెరికా ప్రజల భద్రత కోసం తమ గూఢచార సంస్ధలకు ప్రపపంచ ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి ఇంటర్నెట్ కార్యకలాపాలు, వారు షేర్ చేసుకొనే ఫోటోలు, వారు పంపుకునే ఈ మెయిళ్ళు అన్నీ తమకు కావలసిందేనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశాడు. అంతర్జాల కంపెనీలు ‘అబ్బే,…

ఆర్టీఐ చట్టం? ఏం జోకా? -కార్టూన్

“ఏయ్! ఆర్టీఐ చట్టమా? ఏం జోకా – మీరు తెలుసుకోవాలని మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ సమాచారం అంతా ఇస్తూనే ఉన్నాం కదా…” ప్రజల్ని రాజకీయ పార్టీలు ఎలా పరిగణిస్తాయో ఈ కార్టూన్ చక్కగా చెబుతోంది. వారి దృష్టిలో ప్రజలు ఏమీ తెలియని దద్దమ్మలు. గొర్రెల కాపరి కాపలా కర్రని అనుసరించే గొర్రెల మంద. ఎక్కువ తెలుసుకుంటే గొంతెమ్మ కోర్కెలు కోరే వాజమ్మలు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలియని నిరక్షర కుక్షులు. తమ ఓటు శక్తి…

బి.జె.పి కార్యవర్గం: కృత్రిమ ఎత్తులో మోడి? -కార్టూన్

రాజకీయ పార్టీల్లో నాయకులకు పదవి, హోదా, గౌరవం ఎలా రావాలి? మొదట వారికి ప్రజాదరణ ఉండాలి. అనంతరం ప్రజాదరణ ఉన్న నాయకుల ఆమోదం ఉండాలి. ఈ రెండు పక్షాలు కాస్త అటూ ఇటూ అయినా నష్టం లేదు. కనీసం ఒక పక్షం ఆదరణ పొందినా రెండో పక్షం ఆదరణ ఎదోలా పొందారనిపించుకోవచ్చు. కానీ రెండూ లేకపోతే కష్టమే. బి.జె.పి నాయకుడు నరేంద్ర మోడీకి ఈ రెండూ ఉన్నాయా? లేక రెండూ లేవా? లేక ఒకటి ఉండి మరొకటి…

సబిత, ధర్మానలను జైలుకి పంపండి -సి.బి.ఐ

రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుల పట్ల ఇన్నాళ్లూ అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సి.బి.ఐ, శుక్రవారం అసాధారణ రీతిలో మెమోలు జారీ చేసింది. తాము నిర్దోషులుగా బైటికి వస్తామంటూ ఇద్దరు మాజీ మంత్రులు ప్రకటించిన దానిని గుర్తు చేస్తూ, వారిద్దరూ విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని కోర్టును కోరింది. నిర్దోషులుగా బైటికి వస్తామని ప్రకటించడం అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం…

ధర్మపురి జంటను విడదీశారు

తమిళనాడులో కులాంతర వివాహాలపై విషం కక్కుతున్న స్వార్ధ శక్తులు ఒక ఆదర్శ వివాహ జంటను విడదీయడంలో ఎట్టకేలకు సఫలం అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితులపై విష ప్రచారానికి వెనుకాడని పట్టళి ముక్కల్ కచ్చి (పి.ఎం.కె) పార్టీ నాయకులు ఆ పాపం మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. వన్నియార్ కుల ప్రజలను దళితులపై విద్వేషపూరితంగా రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించడానికి అలవాటు పడిన పి.ఎం.కె నాయకుడు రాందాస్ అనేక సంవత్సరాలుగా కులాంతర వివాహాలను పచ్చిగా వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. మరీ…