సొంత కరెన్సీల్లో ఇండియా-ఇరాక్ వ్యాపారం

ఇండియా, ఇరాక్ దేశాలు తమ సొంత కరెన్సీల్లో ద్వైపాక్షిక వ్యాపారం సాగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ చెబుతున్నారు. ఇరాక్ ప్రధాని నౌరి కమిల్ ఆల్-మాలికి ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న నేపధ్యంలో ఆనంద్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ కరెన్సీకి బదులుగా సొంత కరెన్సీలలో వ్యాపారం చేసినట్లయితే ఆ మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునే భారం ఇరు దేశాలకు తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతూ, కరెంటు…

అదే ఘోరం, అదే క్రూరత్వం, ఈసారి ముంబై

డిసెంబరు 16 నాటి ఢిల్లీ అత్యాచారం విషయంలో నిందితులపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా పని చేస్తున్నాయో లేదో గానీ అత్యాచారాల వేగం మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఢిల్లీ బస్సు అత్యాచారం తరహాలోనే ఒక ఫోటో జర్నలిస్టు యువతి పైన ఐదుగురు మృగాళ్ళు పైశాచిక రీతిలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటనలో కూడా యువతి బాయ్ ఫ్రెండ్ ని దుండగులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలి శరీరంలో అంతర్గతంగా తీవ్ర గాయాలు…

ఫైళ్ళు ఇక్కడితో మాయం అవుతాయి -కార్టూన్

కేశవ్ కుంచె నుండి రూపు దిద్దుకున్న మరో ఆణిముత్యం ఈ కార్టూన్. తొమ్మిదేళ్ల ప్రధాన మంత్రి ఈ కార్టూన్ చూస్తే సిగ్గుతో చితికిపోవాలి! “The buck stops here” అనేది ఆంగ్లంలో ఓ సామెత లాంటిది. బాధ్యత మోయాల్సి వచ్చినప్పుడు పక్కవాడి మీదికి నెట్టివేయడం మామూలుగా జరుగుతుంటుంది. ‘అలా పక్కవాడి మీదకు నేను తోసివేయను. నేనే స్వీకరిస్తాను’ అని ఈ వాక్యం చెబుతున్నవారు చెబుతున్నట్లు దీని అర్ధం. అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూమన్ బల్ల మీద ఈ…

చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన

చైనా సైనికులు మరొకసారి దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ (డి.బి.ఓ సెక్టార్) లో చొచ్చుకు వచ్చారన్న వార్తల నేపధ్యంలో భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ యుద్ధంలో వాడి వదిలేసిన విమాన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవడమే కాకుండా మంగళవారం సైనికులను పెద్ద మొత్తంలో చేరవేసే సైనిక వాహక విమానాన్ని అక్కడ దించింది (touch down). వాస్తవాధీన రేఖ (Line of Actual Control)కు సమీపంలో చైనా సైనికులు చొరబడ్డారని చెబుతున్న…

పాత పేపర్ కాదయ్యా బాబూ! -కార్టూన్

“నేను మీకు పాత పేపర్ ఏమీ అమ్మలేదు. కావాలంటే తేదీ చెక్ చేసుకోండి!” – సాధారణంగా వార్తా పత్రికలు ఒక వార్తను తామే ముందు ఇవ్వడానికి పోటీ పడుతుంటాయి. ఫలానా వార్త మేమే ముందు ఇచ్చాం అని కొన్నిసార్లు చెప్పుకుంటుంటాయి. తద్వారా వేగంగా వార్తలు అందించే యంత్రాంగం తమ వద్ద ఉన్నదని చెప్పుకుని సర్క్యులేషన్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో పత్రికలకు అలాంటి అవకాశం లేకుండా పోతోంది. ఫ్రంట్ పేజీ వార్తలన్నీ చద్ది వార్తలుగానే…

అసరం బాపు అసలు రూపు ఇదీ!

అసరం బాపు గుర్తున్నాడా? గత డిసెంబర్ నెలలో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య నోరు పారేసుకున్న బాబా!. అత్యాచారంలో నిర్భయ తప్పు కూడా ఉన్నదనీ, తనపై లైంగిక దాడి చేసినవారిని ఆమె ‘అన్నా, తమ్ముడూ’ అని వేడుకుని ఉంటే వారాపనికి దిగి ఉండేవారు కాదనీ, ఆ విధంగా ఆమె గౌరవం (ఆయన ఉద్దేశ్యం శీలం అని) కాపాడబడి ఉండేదనీ కూసిన మహా ‘పురుషుడు’! అంతటితో ఆగాడా? “రెండు చేతులు కలవకుండా శబ్దం రాదు…

‘తీవ్ర’ ప్రమాద స్ధాయిలో ఫుకుషిమా రేడియేషన్ లీకేజి

జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ కలుషిత నీటి లీకేజి ‘తీవ్ర’ (serious) స్ధాయికి చేరిందని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక లీటర్ నీటిలో రేడియేషన్ కు సాధారణ అనుమతి స్ధాయి 150 బెక్యూరల్స్ కాగా ఫుకుషిమా వద్ద లీటర్ నీటిలో 30 మిలియన్ బెక్యూరల్స్ రేడియేషన్ తో కలుషితం అయిన నీరు నిరంతరం లీక్ అవుతూ సముద్రంలో కలుస్తోంది. అంతర్జాతీయ రేడియేషన్ ప్రమాద స్కేలు పైన దీని తీవ్రతను 3 కు జపాన్ ప్రభుత్వం…

వెళ్ళి ఫైళ్ళు తవ్వుకు రండి, ఫోండి! -కార్టూన్

దాదాపు 80,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వికారమైన మలుపు తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కుంభకోణాన్ని విచారిస్తున్న సి.బి.ఐకి అవసరమైన ఫైళ్ళు బొగ్గు శాఖ ఇవ్వనే లేదు. ఈ విషయాన్ని సి.బి.ఐ కోర్టుకి ఫిర్యాదు చేస్తే కోర్టు తీసిన ఆరాలో ప్రభుత్వంగా చల్లగా చెప్పిన సంగతి ఏమిటంటే సంబంధిత ఫైళ్ళు కనపడడం లేదట. ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఈ విషయంపైన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఈ అఫిడవిట్ సమర్పించగా అందులో…

పతనం: రూపాయి vis-à-vis ఉపగ్రహం -కార్టూన్

– ఈ లోపు, మరో శాటిలైట్ లంచ్ వెహికల్: – ఒక వార్త: సోమవారం ఏకంగా 148 పైసలు పతనమై డాలర్ తో మారకపు విలువ 63 రూపాయల మార్కు దాటిన రూపాయి విలువ మంగళవారం మరో కొత్త పతన స్ధాయిని నమోదు చేసింది. నిన్న 63.13 రు.ల వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ రోజు ట్రేడింగ్ ఎత్తుకోవడంతోనే 63.75 రు.ల వద్ద ఎత్తుకుంది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ అదింకా పతనమై డాలర్ ఒక్కింటికి రు.…

చైనా అద్భుతం: పాడే ఇసుక తిన్నెల్లో విరిసిన ఎడారి కమలం -ఫోటోలు

అది చైనాలోని గ్జియాంగ్ షావాన్ ఎడారి. చైనా రాజధానికి పశ్చిమంగా 350 కి.మీ దూరంలో ఉండే ఈ ఎడారి ప్రాంతం మంగోలియా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఉండే ఎత్తైన ఇసుక తిన్నెలకు ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న లక్షణమే దానిని ప్రఖ్యాత టూరిస్టు ఆకర్షణ కేంద్రంగా మార్చివేసింది. ఆ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇక్కడ ఇసుక తిన్నెలు పాడతాయి. అవును పాడతాయి. ఎలా పాడతాయో, ఎందుకు పాడతాయో ఇంకా తెలియదు గానీ పాడడం మాత్రం నిజం.…

దశాబ్దంలోనే అత్యధికంగా పడిపోయిన రూపాయి

రూపాయి పతనం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు ప్రకటించినా తన దొర్లుడుకు అడ్డే లేదు పొమ్మంటోంది. ‘కొండలు, గుట్టలు, నదీనదాలు, ఎడారులా నా కడ్డంకి?’ అని శ్రీ శ్రీ ని అరువు తెచ్చుకుని మరీ ప్రశ్నిస్తోంది. అధో పాతాళాన్ని దాటలేనా అని సవాలు చేస్తూ దొర్లి పడుతోంది. తమిళ తంబిలు (అదేనండీ చిదంబరం) ఎందరొచ్చినా, హార్వర్డ్ ఉత్పత్తులు (హార్వర్డ్ ప్రోడక్ట్ అని మన మన్మోహనుడికి పశ్చిమ పత్రికలు ఇచ్చి మురిసిపోయే సర్టిఫికేట్ ఇది) ప్రధానులే…

ఉల్లి భద్రతా బిల్లు కావాలి! -కార్టూన్

– “దానికంటే ముందు ఉల్లి భద్రతా బిల్లు తెస్తే ఎలా ఉంటుందంటారు?” – ఆహార భద్రతా బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పత్రికలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు గాను ఈ బిల్లును ‘ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్’గా కాంగ్రెస్ పరిగణిస్తోందనీ అందుకే ఈ బిల్లుపై అత్యంత పట్టుదలతో ఆ పార్టీ ఉన్నదనీ పత్రికల కధనం. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పట్టుబట్టి ఈ బిల్లుకు రూపకల్పన చేశారని కాబట్టి…

వేగంగా పెరుగుతున్న నగరం షాంఘై నాడు, నేడు -యానిమేషన్

ఇండియాకు ముంబై ఎలాగో చైనాకు షాంఘై నగరం అలాగ! ఇండియాకి ముంబై వాణిజ్య నగరంగా పేరొందితే, షాంఘై చైనాకి వాణిజ్య నగరంగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం ఇదేనట! అలాగని ది అట్లాంటిక్ పత్రిక చెబుతోంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదేనని సదరు పత్రిక తెలిపింది. రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కార్లోస్ బర్రియా ఇటీవల షాంఘై నగరాన్ని సందర్శించి కొన్ని ఫోటోలు తీశాడు. 1987 నాటి ఫోటో ఒకటి…

భారత ‘అవతార్’ నివాసులకు మోడి మద్దతు ఇవ్వగలరా?

హాలీవుడ్ సినిమా ‘అవతార్’ గుర్తుందా? అందులో అవతార్ అనే ఒక గ్రహం ఉంటుంది. విస్తారమైన సహజ వనరులతో ఆ గ్రహం అలరారుతుంటుంది. దానిపైన భూగ్రహం పైన ఉండే కంపెనీల కన్ను పడుతుంది. అక్కడి వనరులను కొల్లగొట్టడానికి వీలుగా దానిని ఆక్రమించుకోడానికి సైన్యాన్ని పంపుతుంది. అలా వెళ్ళిన సైన్యంలోని కొంతమంది ‘అవతార్’ గ్రహవాసులతో కలిసిపోయి సైన్యాన్ని ఓడించి తరిమివేయడంతో సినిమా ముగుస్తుంది. ఒరిస్సాలోని నియమగిరి కొండ, దాని చుట్టూ ఉన్న అడవుల్ని భారత దేశ ‘అవతార్’ గా ఆ…

ఈజిప్టు: మరో రక్తం ఓడుతున్న గాయమా? -ఫోటోలు

ఆఫ్ఘనిస్ధాన్ ని ‘రక్తం ఓడుతున్న గాయం’ గా అభివర్ణించాడు చివరి సోవియట్ రష్యా నేత మిఖాయిల్ గోర్బచెవ్. ఈ భూమండలం పైన రక్తం ఓడుతున్న గాయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కాశ్మీరు, పాలస్తీనా, సిరియా, సోమాలియా…. ఇప్పుడు ఈజిప్టు. రెండేళ్ల క్రితం ముబారక్ ను పదవీచ్యుతుడ్ని చేసినప్పటి నుండి ఈజిప్టు వీధులు రక్తంతో తడవని రోజంటూ లేదు. ముబారక్ ఏలిన 30 సంవత్సరాలు ఈజిప్టులో నిరవధిక ఎమర్జెన్సీ అమలు చేశారు. కమ్యూనిస్టులను, ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలను……