మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…

జవహర్ లాల్ నెహ్రూ పండిట్ కాదా?

ప్రశ్న:  పండిట్ నెహ్రూ వంశ చరిత్ర ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఆయన అసలు పండిటే కాదని కొందరు అంటున్నారు? జవాబు: భారత దేశపు ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పండిట్ వంశస్ధుడే. మోతీలాల్ నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణులకు చెందినది. అనగా జవహర్ లాల్ నెహ్రూ  కాశ్మీరీ పండిట్ ల వంశంలో జనించారు. వారి కుటుంబం 18వ శతాబ్దం ప్రారంభంలోనే ఇండియాకు వలస వచ్చింది. నెహ్రూ అసలు పండిట్ కాదని ప్రచారం చెయ్యడం వెనుక ఉద్దేశ్యం…

అందరూ దొంగలే, ఎవరికీ ఓటు వేయం -కార్టూన్

ఎన్నికల్లో ఓటు హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఒక తీర్పు ప్రకటించింది. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్ధులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉండాలనేది ఆ తీర్పు తాత్పర్యం. అభ్యర్ధులందరిని తిరస్కరించే హక్కు ఓటర్ కి ఉండాలనీ, అది కూడా భావ ప్రకటనా స్వేచ్చలో భాగమేననీ సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఇ.వి.ఎం మిషన్లలో ‘ఎవరూ కాదు’ అనే బటన్ చేర్చాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశిస్తున్నట్లు పేర్కొంది.…

మినీ (చెల్లింపుల) సంక్షోభం వాకిట అమెరికా?

గవర్నమెంట్ షట్ డౌన్! (ప్రభుత్వం మూసివేత) పశ్చిమ పత్రికల్లో ఏది చూసినా ఇదే గోల. ఉదాహరణకి ఈ వార్తల హెడ్డింగులు చూడండి.   House conservatives hold firm as government shutdown looms -Reuters: Sat Sep 28, 2013 6:37am EDT US braces for possible government shutdown -BBC News: 27 September 2013 Last updated at 22:09 GMT Stocks End Week Lower As Govt. Shutdown…

హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు…

ఆహా రాహుల్! ఏమి మీదు నాటకంబు?

“కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు” ఇది మన రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనిక రాజకీయవేత్తలకు వర్తించేది మాత్రమే’ అన్న నిర్వచనం ఏమన్నా ఉన్నట్లయితే ఆయన చెప్పిందాంట్లో సందేహం అనేదే లేదు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమే హడావుడిగా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, మరోపక్క ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే, తమ పార్టీలోని మరోనేత ఆ…

స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2

మొదటి భాగం తరువాత……… కొమింట్ పత్రంలోని వివరాలు భయంకరమైన నిజాలని మనముందు ఉంచాయని ది హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. మన్ హట్టన్ (న్యూయార్క్) లోని ఐరాస భారత శాశ్వత కార్యాలయం ఎన్.ఎస్.ఏ టాప్ టార్గెట్లలో ఒకటి. ఇక్కడ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ఉప శాశ్వత ప్రతినిధి, ఒక మంత్రి, ఒక రాజకీయ సమన్వయకర్త, ఆరుగురు కౌన్సిలర్లు, ఒక కల్నల్ ర్యాంకులోని మిలట్రీ సలహాదారు, ఇంకా ప్రపంచ దేశాలతో ఇండియాకు ఉండే వివిధ సంబంధాలకు సంబంధించిన అనేకమంది…

హార్డ్ డిస్క్ సహా ఇండియా జాతకం అమెరికా గుప్పిట్లో -స్నోడేన్ పత్రాలు -1

అమెరికా నీతిమాలిన గూఢచర్యం గురించి కళ్ళు తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా తనకు ఎంతో కావలసిన మిత్రుడు అని ప్రపంచానికి చాటే అమెరికా, తన గడ్డపై (వాస్తవానికి అది రెడ్ ఇండియన్ల గడ్డ)  ఇండియాకు సంబంధించి ఏ కార్యాలయాన్నీ గూఢచర్యం నుంచి మినహాయించలేదు. చివరికి, భారత దేశం యొక్క ప్రపంచ స్ధాయి దౌత్య కార్యకలాపాలకు గుండెకాయ లాంటివి అయిన న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డి.సి లోని భారత ఎంబసీ…

జనరల్ వి.కె.సింగ్ విశ్రాంత కాలం తీరే వేరు -కార్టూన్

పదవీ విరమణ చేశాక ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విశ్రాంత కాలాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ జనరల్ వి.కె.సింగ్ పదవీ విరమణ చేశాక తన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరు మాత్రం ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఒకసారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే పక్కన కనిపిస్తారు. మరోసారి ఆర్మీ కుంభకోణాలపై గొంతెత్తుతారు. మరోసారేమో ఏకంగా బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తోనే వేదిక పంచుకుంటారు. జనరల్ వి.కె.సింగ్ ఎంజాయ్ మెంటు ఎలా ఉన్న దానివల్ల…

అక్కడ ప్రతీకారం అంటే ఆమెను వివస్త్రను చేయడం!

ఇది మరో భారత స్త్రీ కధ! కాదు, కాదు, మరో దళిత స్త్రీ కధ!! చాతుర్వర్ణాలలో ఆమె పుట్టిన కులం/వర్ణం లేదు గనక ఆమెను భారత స్త్రీ అనడానికి మనువాదులు ఒప్పుకుంటారో లేదో? అందుకే ఆమె భారత స్త్రీ కాదు, దళిత స్త్రీ. ఉత్తర ప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులంగా గుర్తించబడిన దోబి కులానికి చెందిన ఆమె కొడుకు చేసిన (నిజానికి చెయ్యని) పాపానికి ఆమెను అగ్ర కులస్ధులు ఇంటినుండి వీధిలోకి ఈడ్చుకొచ్చి చీర, రవికె ఊడబెరికారు.…

సి.బి.ఐ సుత్తితో బాది సానపెడితే, ఆ కత్తే వైకాపా -కార్టూన్

ఈ కార్టూన్ చూసి నవ్వని, కనీసం నవ్వుకోని వారు ఎవరన్నా ఉంటే వారికి ఏదో సమస్య ఉన్నట్లే అనుకోవాలి. ‘మాట తప్పని, మడమ తిప్పని’ వంశం అని చెప్పుకున్నవారు సోనియాగాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ ఇప్పించుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పక్క ఆరోపిస్తున్నారు. టి.డి.పి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి వై.ఎస్.ఆర్ భార్య వై.ఎస్.విజయ నిన్న సోనియాగాంధీకి ఫోన్ చేసి ‘బెయిల్’ ఇప్పించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారని ఆరోపించారు. అదే నిజమైతే…

ఆ చల్లని సముద్ర గర్భం -శ్రామికుడి నోటి పాట

ఈ పాటను నేను చాలాసార్లు విన్నాను. పాడటంలో అనుభవం ఉన్నవారి నోట విని తన్మయం చెందాను. వారిలో చాలా మంది చూసి పాడేవాళ్లు. చూడకుండా పాడితే తప్పులు పాడేవాళ్లు. కొంతమంది పాడుతూ ఉండగానే శృతి తప్పేవాళ్లు. మళ్ళీ అందుకోడానికి యాతన పడేవాళ్లు. కానీ మొదటి సారి ఈ పాటని ఒక శ్రమ జీవి నోటి నుండి వింటున్నాను. పాటలోని పదజాలం పుస్తకాల్లో మాత్రమే దొరికేది. జానపదం లాగా పల్లె పదాలు కావవి. సంస్కృత పదాలు కలిసి ఉన్న…

పోల్: జగన్ బెయిలు దేనికి సూచన?

టి.వి ఛానెళ్ళు ప్రసారం చేస్తున్న వార్తల ప్రకారం కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన రెడ్డి జైలు నుండి విడుదల అయ్యారు. ఆయనకు స్వాగత సత్కారాలు అందించడం కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్ గూడ జైలుకు చేరుకున్నారట. వారికి పోలీసులకు మధ్య వాదులాట, తోపులాట, ఘర్షణ గట్రా జరుగుతున్నాయట కూడా. “నీకిది, నాకది” (క్విడ్ ప్రో కో) పద్ధతిలో జగన్ కి చెందిన అనేక కంపెనీల్లో వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, దానికి బదులుగా వై.ఎస్.రాజశేఖర రెడ్డి…

ధరలు తగ్గాయ్, షేర్లు కొందాం! -కార్టూన్

పత్రిక చదువరి: “ద్రవ్యోల్బణ వ్యతిరేక చర్యలు పని చేసి ధరలు కుప్ప కూలినై” గృహిణి: “భలే – ఇంకేం, ఇక షేర్లు కొనేద్దాం” మరుగుజ్జు వంత: “ఇంకేం, కేకు తినేద్దాం” రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్ద మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఈ కార్టూన్ తెలియజేస్తోంది. అంతేకాదు, వారి మాటలకు ఉండే ద్వంద్వార్ధాలు, ఒక్కోసారి బహుళార్ధాలు కూడా వస్తాయన్న సంగతినీ సూచిస్తోంది. ద్రవ్యోల్బణం ఆగస్టు చివరి నాటికి 6.1 శాతానికి పెరిగిందని కాబట్టి ధరల్ని కట్టడి చేయడానికి…

జగన్ కి బెయిలు వచ్చేసింది!

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. దర్యాప్తు పూర్తయిందని సి.బి.ఐ చెప్పడంతో కడప ఎం.పికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పెషల్ సి.బి.ఐ కోర్టు తెలిపింది. దాదాపు సంవత్సరంన్నర పైగా జైలులో గడుపుతున్న జగన్, బెయిల్ పై విడుదల కానున్న వార్త ఆయన అభిమానుల్లో సంతోషాతిరేకాలు నింపాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్న ఫలితంగా జగన్ త్వరలో విడుదల కానున్నాడని ఆరోపించిన టి.డి.పి జోస్యం నిజం అయినట్లా? జగన్ ను విషపురుగుగా అభివర్ణించిన…