అమెరికా రుణం: తగిన చర్యలు తీసుకోవాలి -జి20

ఇన్నాళ్లూ ప్రపంచ దేశాలకు ఆర్ధిక వ్యవస్ధలను సవరించుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. వాషింగ్టన్ లో సమావేశమైన జి20 దేశాల ప్రతినిధులు ఋణ పరిమితి పెంపుదలపై తగిన చర్యలు తీసుకోక తప్పదని దాదాపు హుకుం జారీ చేసినంత పని చేశాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్ధితిలో తన స్వల్పకాలిక కోశాగార అవసరాలు తీర్చుకోడానికి వెంటనే  తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే గడ్డు పరిస్ధితి రానున్నదని జి20…

కాణీ విలువ లేని చంద్రబాబు దీక్ష? -కార్టూన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ దీక్ష ఎందుకు చేస్తున్నట్లు? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు ఆయన ఒకసారి చెప్పుకున్నారు. కానీ ఆ దీక్షకు నిర్దిష్ట డిమాండ్ అంటూ ఏమీ లేదు. దీక్ష చేస్తున్నాను అనిపించుకుని సీమాంధ్ర ప్రజల్లో ఓటు విలువ పొందడానికే ఆయన దీక్ష తలపెట్టారన్నది అర్ధం అయ్యే విషయమే. కానీ ఉద్దేశ్యం ఏదయినా దీక్షకు ఒక డిమాండ్…

దివాలా అంచున అగ్రరాజ్యం -ఈనాడు ఆర్టికల్

‘దివాలా అంచున అగ్రరాజ్యం’ శీర్షికన ఈ రోజు ఈనాడులో నా ఆర్టికల్ ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. కింద బొమ్మ రూపంలో ఆర్టికల్ ఉంది. దానిపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలంటే ఈ లింకు పైన క్లిక్ చేసి చూడవచ్చు. ఈ లింకు ఈ రోజు వరకు మాత్రమే పని చేస్తుందని గమనించగలరు. – ఈ గ్రాఫ్ పాఠకులకు ఉపయోగంగా ఉండొచ్చు.

రాష్ట్రపతి పాలన ఎత్తుగడ? -కత్తిరింపు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక అయోమయ సృష్టి ఇత్యాది అంశాలపై కాస్త వాస్తవానికి దగ్గరగా విశ్లేషణలు, విమర్శలు, సూచనలు ప్రచురిస్తున్నది ఆంధ్ర జ్యోతి దిన పత్రికే అనుకుంటాను. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇతర పత్రికలు, ఛానెళ్ల కంటే ఒక అడుగు ముందే ఉన్నది ఆ పత్రిక. ‘రాష్ట్రపతి పాలన ఎత్తుగడ?’ శీర్షికతో వచ్చిన ఈ విశ్లేషణ ఈ రోజు (అక్టోబర్ 11, 2013) జ్యోతిలో…

మై గుడ్ నెస్! ఇవి శిల్పాలంటే నమ్మక తప్పదు -ఫోటోలు

మానవుడి సృజన శక్తికి అంతెక్కడ అంటే చెప్పడం కష్టం అనుకుంటాను. ఎక్కడ హోమో సెపియన్, ఎక్కడ సెల్యులార్ ఫోన్?! మనిషి సాధించిన సాంకేతిక పరిజ్ఞానం ఒక ఎత్తైతే సంస్కృతీ, సృజనల పరంగా అతను అధిరోహించిన అత్యున్నత శిఖరాలు మరో ఎత్తు. ఈ శిల్పాలే చూడండి. ఇవి శిల్పాలంటే నమ్మగలమా? వాస్తవత్వానికి ఏమాత్రం తేడా చూపకుండా చిత్రాలు గీయడమే అద్భుతం అనుకుంటే ఏకంగా శిల్పాలకూ మనిషికీ తేడా లేకుండా సృజించడం పరమాద్భుతం కాదా? దీనిని ‘హైపర్ రియలిస్టిక్ స్కల్ప్ఛర్’…

కరెంటు ఖాతా లోటు, రెవిన్యూ లోటు అంటే?

ప్రశ్న (చందు అరవింద్): … … మీ బ్లాగ్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీ విశ్లేషణలు చాలా అర్ధవంతంగా ఉంటాయి. మీరు ఇటీవల రేపో రేటు, సి.ఆర్.ఆర్ ని తెలుగులో సాధారణ వ్యక్తికి కూడా అర్ధం అయ్యే విధంగా వివరించారు. అలాగే CURRENT ACCOUNT DEFICIT, REVENUE DEFICIT, LIQUIDITY ADJUSTMENT FACILITY ల గురించి కూడా వివరించగలరని నా మనవి. నేను… … సమాధానం: అరవింద్ గారు మీ ప్రశ్నలో అవసరం…

లక్షల దళిత నాయకుల్ని సృష్టించే మంత్రదండం! -కార్టూన్

రాహుల్: ఒకరో ఇద్దరో కాదు, దళితుల కోసం లక్షల నాయకులు ఉద్భవించాలి… రాహుల్ నీడలోని కాంగ్రెస్ నేత: ఆ సూత్రం మనక్కూడా వర్తించడం ఎలాగో… – ఒకరూ, ఇద్దరూ కాదు; పదులూ, వందలూ కూడా కాదు; వేలు అసలే కాదు; ఏకంగా లక్షలాది దళిత నాయకుల్ని తయారు చేసే మంత్రదండం ఉన్న సంగతి ఎవరికైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ మంత్రదండం మన యువ రాజా రాహుల్ గాంధీ వద్ద భద్రంగా ఉంది. ఆయన దాన్ని త్వరలో…

లిబియాలో అమెరికాకు మరో ఎదురు దెబ్బ?

లిబియాలో సెక్యులర్ నేత గడ్డాఫీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ దేశాన్ని ఆల్-ఖైదా టెర్రరిస్టులకు ఆవాసంగా మార్చినందుకు అమెరికా తగిన ప్రతిఫలం అనుభవిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 11 తేదీన తాము మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన ముస్లిం ఉగ్రవాద తిరుగుబాటు సంస్ధల చేతుల్లోనే తమ రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్ దారుణ హత్యకు గురి కావడాన్ని చూడవలసి వచ్చిన అమెరికా తాజాగా తమ నమ్మిన బంటు అయిన లిబియా ప్రధాన మంత్రి ఆలీ జీదన్ అరెస్టు కావడంతో…

రాష్ట్ర విభజన: గతితర్క వివరణ –కార్టూన్

రాహుల్ గాంధీకి ప్రధాని పదవిని పళ్లెంలో పెట్టి అప్పగించడానికే సోనియా గాంధీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు తలపెట్టిందని కానీ సీమాంధ్ర ఉద్యమం వలన అది ఆమెకు కష్టంగా మారిందని ఈ కార్టూన్ సూచిస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత టి.ఆర్.ఎస్ తో పొత్తు లేదా విలీనం ద్వారా తెలంగాణలో, వైకాపాతో పొత్తు లేదా విలీనం లేదా ఎన్నికల అనంతర కూటమి ద్వారా సీమాంధ్రలోనూ మెజారిటీ లోక్ సభ స్ధానాలను గెలుచుకోవచ్చని, తద్వారా రాహుల్ గాంధీ ని ప్రధానిగా…

సి.ఎం పై మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు

తన పదవీ కాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేసి విఫలమయిన మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సంచలన రీతిలో ఆరోపణలు చేశారు. పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అక్కసుతోనే అబద్ధపు ఆరోపణలకు దిగారని మంత్రులు దినేష్ ఆరోపణలను తిప్పి కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ వారి సమాధానాల్లో పెద్దగా విషయం లేదు. దానితో కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై పలు అనుమానాలు ముసురుకున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి దినేష్ కృషి చేశారని తెలంగాణ వాదులు…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…

ఓ సమైక్య మిత్రుడి ఆక్రోశం!

ప్రొద్దుటూరి అప్పారావు గారి వ్యాఖ్య ఇది. ‘పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి’ అన్న టపా కింద రాశారు. ఆంగ్లంలో రాసిన వ్యాఖ్యను తెనుగీకరించి ప్రచురిస్తున్నాను. మనం సమైక్యాంధ్ర కోసం పోరాడొచ్చు. కానీ మార్గం సరైనది కాదు. రాజకీయ నాయకులు (ఎం.ఎల్.ఏలు, ఎం.పిలు) అందరూ తమ జీత భత్యాలను వినియోగించుకుంటున్నారు. ఒక ఎం.పి గారు (ఉద్యమంలో) పాల్గొంటూనే తిరుమల ఛైర్మన్ గా పదవిని అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ ఆటంకం లేకుండా చక్కగా నడుస్తూనే ఉన్నాయి.…

ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు

ఢిల్లీ పోష్ లోకాలిటీ ‘వసంత్ కుంజ్’ లో ఒక మైనర్ బాలిక ను పనిలో పెట్టుకుని హింసించిన కేసులో నిందితురాలికి కోర్టు బెయిలు నిరాకరించింది. నోయిడాలో ఒక పేరు పొందిన బహుళజాతి సంస్ధలో కమ్యూనికేషన్ విభాగాని అధిపతిగా పని చేస్తున్న వందన ధీర్ కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల జార్ఖండ్ బాలిక ఆర్తనాదాలు విని పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ, పోలీసుల సాయంతో బాలిక…

తెలంగాణ షో -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఎలాగో ధైర్యం చేసి తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆ పార్టీని ఎక్కడ ముంచి ఎక్కడ తేల్చనున్నదో తెలియని పరిస్ధితి. అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన పెద్ద మనుషులంతా ఆ మాట తీసి గట్టున పెట్టి తలో దారి పడుతున్నారు. సీమాంధ్ర జనం కోసం రాజీనామాలు నటించలేక అలాగని పార్టీలో కొనసాగుతూ ప్రజల ఆగ్రహానికి నిలవలేక ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ మ్యాజిక్ ద్వారా ‘anti-incumbency’ ఫ్యాక్టర్ ని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ భావించిన…

పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి

విజయనగరంలో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయ్యాయని ది హిందు పత్రిక ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త కింద సయ్యద్ మునిరుద్దీన్ అనే ఒక పాఠకుడు వ్యాఖ్యానంగా ఈ కింది పిట్టకధ రాశారు. ఈ పిట్టకధని ఆయన చిన్నప్పుడు విన్నారట. తెలంగాణ-సమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి తనకా కధ గుర్తుకొస్తోంది అని చెబుతూ రాశారు. చాలా తమాషాగా ఉంది చదవండి! అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఒక రోజు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు.…