రాజకీయ నాయకులు ఇడియట్స్ -కత్తిరింపు

భారత రత్న అవార్డు పొందిన రసాయన శాస్త్రవేత్త ‘చింతామణి నాగేశ రామచంద్ర రావు (సి.ఎన్.ఆర్.రావు) తనకు అవార్డు ఇచ్చారన్న మొహమాటం కూడా లేకుండా రాజకీయనాయకుల గుణగణాలను ఒక్క మాటతో కడిగిపారేశారు. దేశంలో సైన్స్ అభివృద్ధికి ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న చేదు నిజాన్ని సి.ఎన్.ఆర్ రావు విప్పి చెప్పారు. అసలు విద్యారంగం అంటేనే రాజకీయ నాయకులకు శ్రద్ధ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాన్ని కూడా సి.ఎన్.ఆర్ రావు వదల్లేదు. కాస్త డబ్బులు ఎక్కువ…

మీడియాపై యుద్ధం ప్రకటించిన పశ్చిమ ప్రజలు

పశ్చిమ దేశాల ప్రజలు ఏకంగా మీడియాపైనే యుద్ధం ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా తమకు వాస్తవ వార్తలు అందించడం లేదని ఆరోపిస్తూ వందలాది మంది ఆయా మీడియా సంస్ధల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనలను ఎదుర్కొన్న మీడియా సంస్ధల్లో ‘నిస్పాక్షిక వార్తా ప్రసారానికి చిరునామాగా’ తమ భుజాలు తామే చరుచుకునే ప్రఖ్యాత మీడియా సంస్ధలు ఉండడం విశేషం. బి.బి.సి, ఎన్.బి.సి, ఫాక్స్ న్యూస్, ఎబిసి, సి.బి.ఎస్, సి.ఎన్.ఎన్ తదితర కార్యాలయాల ఎదుట అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల…

శవాల దిబ్బ టాక్లోబన్, హైయన్ ముందూ తర్వాతా

ఇటీవల ఫిలిప్పైన్స్ లో సభవించిన సూపర్ టైఫూన్ హైయన్ ధాటికి అతలాకుతులం అయిన సమర్, లేటే రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య పూర్తిగా అంచనా వేయడం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. బడా మాల్స్ నుండి జనం లూటీలకు పాల్పడకుండా భారీ భద్రత అయితే ఇచ్చారు గానీ జనం ఆకలి, అవసరాలు తీర్చడంలో మాత్రం ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఇంకా వెనుకబడే ఉంది. హైయాన్ ధాటికి బాగా దెబ్బ తిన్న నగరం టాక్లోబన్. 220,000 మంది నివసించే…

అందరికీ సచిన్ జ్వరం, భారత రత్నకు కూడా

సచిన్ క్రికెట్ క్రీడా జీవితం నేటితో ముగిసింది. 40 యేళ్ళ సచిన్ టెండూల్కర్ నెలరోజులు ముందుగానే తన రిటైర్మెంట్ ప్రకటించడంతో అప్పటినుండీ దేశంలో క్రికెట్ జ్వరం అవధులు దాటి పెరిగిపోయింది. సచిన్ రిటైర్కెంట్ కోసమే అన్నట్లుగా వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ను బి.సి.సి.ఐ ఏర్పాటు చేయడంతో అనేకమంది కలలు గనే ఒక అందమైన క్రీడా జీవితానికి అందమైన ముగింపు పలికినట్లయింది. రెండు మ్యాచ్ లు ఇన్నింగ్స్ తేడాతో గెలవడం ద్వారా జట్టు సహచరులు సచిన్…

చైనా కరెన్సీ యుద్ధం – డాలర్ కు తూట్లు –ఈనాడు ఆర్టికల్

ఈ రోజు (నవంబర్ 16, 2013) ఈనాడు పత్రికలో వచ్చిన ఆర్టికల్ ఇది. ప్రపంచ దేశాల అనధికార రిజర్వ్ కరెన్సీగా ఆధిపత్యంలో ఉన్న డాలర్ కు చైనా క్రమంగా, స్ధిరంగా ఎలా తూట్లు పొడుస్తున్నదీ వివరించే వ్యాసం. ఏక ధృవ ప్రపంచంలో ఏకైక ధృవంగా అమెరికా ఇన్నాళ్లూ పెత్తనం చెలాయించింది. గత నాలుగేళ్లుగా అమెరికా ఆర్ధిక శక్తి బాగా క్షీణించడంతో ఆర్ధికంగా బహుళ ధృవ ప్రపంచం ఆవిర్భవించింది. రాజకీయంగా కూడా అమెరికా ప్రభావం క్షీణిస్తోంది. డాలర్ పతనం…

తెలంగాణ: సోనియా పంటి కింద కిరణ్ రాయి? -కార్టూన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమిటో ఒక పట్టాన కోరుకుడు పడడం లేదు. ఆయన ఆధిష్టానం ఆదేశాల్నే పాటిస్తున్నారా లేక ఎదురు తిరుగుతున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారయింది. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ప్రయోజనాలని కాపాడడానికే ఆయన పార్టీ అధిస్టానం పన్నిన వ్యూహంలో భాగంగానే ఎదురు తిరుగుతున్నారా లేక నిజంగానే సీమాంధ్ర ధనికవర్గాల కోసం తిరుగుబాటు బావుటా ఎగురవేశారా అన్నది తేలడం లేదు. నిజంగానే ఎదురు తిరిగే పనైతే కిరణ్ కుమార్…

సి.బి.ఐ రక్షతి రక్షితః -కార్టూన్

‘సి.బి.ఐ ని మనం కాపాడితే మనల్ని సి.బి.ఐ కాపాడుతుంది’ అన్నది రాజకీయ నాయకుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ఈ సూత్రం తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎన్.డి.ఏ హయాంలో కూడా సి.బి.ఐని స్వప్రయోజనాలకు, ప్రత్యర్ధులను దారిలో తెచ్చుకోడానికి వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. కానీ యు.పి.ఏ హయాంలో అది వికృతరూపం దాల్చింది. వరుస కుంభకోణాల్లో యు.పి.ఏ మునిగిపోవడం, కూటమి రాజకీయాల్లో చట్టసభల సీట్లు మునుపు ఎన్నడూ లేనంతగా లెక్కలోకి రావడంతో సి.బి.ఐ రాజకీయ పాత్ర నూతన స్ధాయికి…

బ్యాంకుల నికర నిరర్ధక ఆస్తులు 1.3 లక్షల కోట్లు!

ప్రభుత్వ పధకాల కింద కూడా సామాన్యులకు అప్పులు నిరాకరించే బ్యాంకులు కోటీశ్వరులకు మాత్రం పిలిచి అప్పులిస్తాయి. ఆ అప్పులు వసూలు కాక తామే ఋణ గ్రహీతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. చివరికి ప్రభుత్వాలు ప్రకటించే స్కీముల క్రింద తీరని అప్పులను నిరర్ధక ఆస్తుల (Non-Performing Assets -NPAs) కింద నెట్టేస్తాయి. ఇలా వసూలు కానీ బాకీల విలువ 2013-14 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి అర్ధ భాగంలో 38 శాతం పెరిగి 1,28,533 కోట్లకు చేరిందని ఎన్.పి.ఏ సోర్స్…

శనిగ్రహ ఫోటోలు: 2.2 మి కి.మీ దూరం నుండి…

ఒక అద్భుతమైన అంతరిక్ష దృశ్యాన్ని నాసా (National Aeronautic Space Agency) మన ముందు ఉంచింది. అంతరిక్షంలో శనిగ్రహానికి దాదాపు 2.2 మిలియన్ల కి.మీ దూరం నుండి తీసిన శనిగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, ఇటాలియన్ స్పేస్ ఏజన్సీలు సంయుక్తంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన కాసిని ఉపగ్రహంలో అమర్చిన శక్తివంతమైన కెమెరా ఈ దృశ్యాలను బంధించింది. కాసిని-హుజీన్స్ అంతరిక్ష ఓడ 1997 నుండి అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. 2004 నుండి శనిగ్రహం చుట్టూ…

చైనా: మార్కెట్ శక్తులకు పూర్తి పగ్గాలు!

మార్కెట్ శక్తులకు ఇక పూర్తిస్ధాయిలో పగ్గాలు అప్పజెప్పడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్ధిక వృద్ధికి వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వరంగ సంస్ధలను ఇక క్రమంగా మార్కెట్ శక్తులకు అప్పగించేందుకు తగిన రోడ్ మ్యాప్ ను నాలుగు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశం రూపొందించినట్లు ప్రకటించింది. మావో మరణానంతరం సోషలిస్టు పంధాను విడనాడి పెట్టుబడిదారీ పంధాను చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ పేరులో మాత్రమే కమ్యూనిస్టు పార్టీగా మిగిలింది. చైనా…

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన -ఈనాడు వ్యాసాలు

గత ఫిబ్రవరి నుండి మే నెల వరకు 12 వారాల పాటు ఈనాడు పత్రికలో నేను వ్యాసాలు రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాసాల్లో కవర్ చేసిన అంశాలపైనే మిత్రులు కొందరు మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. బహుశా వారు ఈ వ్యాసాలు చూడలేదనుకుంటాను. అలాంటివారి ఉపయోగం కోసం సదరు వ్యాసాలకు లంకెలను కింద ఇస్తున్నాను. “జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే శీర్షికన చదువు పేజీలో ప్రచురితమైన వ్యాసావళితో పాటు ఎడిటోరియల్ పేజీలో వచ్చిన మరో…

అత్యాచారాలు: సి.బి.ఐ బాస్ కువ్యాఖ్యలు, ఆనక సారీ

శుభం పలకరా పెళ్లికొడుకా అంటే ఇంకేదో అన్నాట్ట వెనకటికొకరు. క్రికెట్ బెట్టింగ్ అరికట్టడం గురించి చర్చలో పాల్గొనమని పిలిస్తే మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల గురించి అసంబద్ధంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు సి.బి.ఐ బాస్ రంజిత్ సిన్హా! లైంగిక అత్యాచారాలను ఆయన జూదంతో పోల్చారు. జూదం అరికట్టలేని పరిస్ధితుల్లో బెట్టింగ్ లాంటి జూదాలను చట్టబద్ధం చేయడమే మంచిదని సలహా ఇచ్చేశారు. ‘అరికట్టలేని బెట్టింగ్ లను చట్టబద్ధం చేయాలన్న సలహాలాగే అత్యాచారాన్ని నివారించలేకపోతే ఎంజాయ్ చేయడమే బెటర్ అని…

సోనీ సోరి: సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు

ఈ దేశంలో చట్టం ధనికులకు ఒక విధంగా పేదలకు మరో విధంగా పని చేస్తాయని చెప్పేందుకు ప్రబల ఉదాహరణ సోనీ సోరి. పోలీసులు అన్యాయంగా, అక్రమంగా బనాయించిన కేసులో రెండున్నరేళ్ల చిత్రహింసలు, జైలు జీవితం, ఎదురుచూపుల తర్వాత సుప్రీం కోర్టు మంగళవారం (నవంబర్ 12, 2013) బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్టయిన ఎస్సార్ స్టీల్ కంపెనీ జనరల్ మేనేజర్ రెండున్నర నెలల్లోనే బెయిల్ పై విడుదల కాగా సోనీ సోరి, లింగారాం కొడోపి లకు…

ఈ ‘క్రికెట్ పిచ్చోడి’కి రిటైర్మెంట్ లేదు

ఇతని పేరు చాలామందికి తెలియదు గానీ, ఇతన్ని చూసినవారు మాత్రం బహుశా కోట్లమందే ఉండవచ్చు. బీహార్ నివాసి అయిన ఇతని పేరు సుధీర్ కుమార్ గౌతం. ఇతని జీవితం అంతా క్రికెటర్లు, క్రికెట్ స్టేడియంల చుట్టూ గడిచిపోతోంది. భారత క్రికెట్ దేవుడిగా కొలుపులు అందుకుంటున్న సచిన్ టెండూల్కర్ మరి కొద్ది రోజుల్లో రిటైర్ అవబోతున్నా, తన క్రికెట్ పిచ్చికి మాత్రం రిటైర్మెంట్ లేదని గౌతం స్పష్టం చేస్తున్నాడు. వంటినిండా జాతీయ పతాకాన్ని, సచిన్ పేరును పెయింటింగ్ వేసుకుని…

ఇక ప్రతి టపా కిందా ‘సంబంధిత టపాలు’ చూడొచ్చు!

వర్డ్ ప్రెస్ వాళ్ళు ఒక ముఖ్యమైన ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చారు. వర్డ్ ప్రెస్ లో నిర్వహించే బ్లాగుల్లో ప్రతి టపా కిందా ఆ టపాలోని విషయంతో సంబంధం ఉండే మూడు టపాలకు లంకెలు ఇచ్చే ఉపకరణం ఇది. ఈ ఉపకరణం కోసం వర్డ్ ప్రెస్ బ్లాగర్లు చాలా కాలంగా అడుగుతున్నారట. నా బ్లాగ్ పాఠకులు కూడా గతంలో కొంతమంది అడిగారు. ఒకరిద్దరు వ్యాఖ్యలు కూడా రాశారు, ‘ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చెయ్యగలరా?’ అని. కానీ అలాంటి విడ్గెట్…