కేజ్రివాల్, ఒక బహుమతి -కార్టూన్

“నేను ఒక విజయాన్నిగాని లేదా ఒక కేజ్రివాల్ ని గాని బహుమతిగా ఇమ్మని శాంతాను అడిగాను” – ఎ.ఎ.పి/కేజ్రివాల్ తో పొత్తు కాంగ్రెస్ కు లాభమా, నష్టమా? ఎ.ఎ.పి తో పొత్తు వద్దని కాంగ్రెస్ లో కొందరు నాయకులు మొదటి నుండి మొత్తుకుంటున్నారు. దానిక్కారణం ఆయన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై దాడి చేయడం ఒకటయితే, ముఖ్య కారణం కాంగ్రెస్ పాలనలో అవినీతిపై విచారణ జరిపిస్తానని వాగ్దానం చేయడం. కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి కేజ్రివాల్ విధించిన 18 షరతుల్లో…

రెండు వాగ్దానాలు నెరవేర్చిన అరవింద్?

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే తాను ఇచ్చిన వాగ్దానాల్లో రెండింటిని అరవింద్ కేజ్రివాల్ నెరవేర్చినట్లు కనిపిస్తోంది. కోట్లాది కళ్ల పహారా మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అరవింద్ తనకు వ్యక్తిగత సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపేశారు. తద్వారా వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలిస్తామన్న వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నాంది పలికారు. అలాగే ప్రభుత్వ భవనంలోకి తన నివాసం మార్చుకోవడానికి కూడా ఆయన తిరస్కరించారని పత్రికలు తెలిపాయి. తాను గానీ, తన ఎమ్మేల్యేలు…

అమెరికా కాన్సలార్ సిబ్బంది ఐ.డి కార్డుల ఉపసంహరణ

ఇండియాలోని అమెరికా కాన్సలార్ సిబ్బందికి జారీ చేసిన ఐ.డి కార్డులను ఉపసంహరించుకున్నట్లు భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఉపసంహరించుకున్న ఐ.డి కార్డుల స్ధానంలో సరిగ్గా అమెరికాలో భారత కాన్సలార్ సిబ్బందికి జారీ చేసిన కార్డుల తరహాలోనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అమెరికా కాన్సలార్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఐ.డి కార్డులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో భారత సిబ్బంది కుటుంబ సభ్యులకు ఐ.డి కార్డులేమీ ఇవ్వలేదనీ అందువలన అమెరికా సిబ్బంది…

ఎడారికి కూడా ఇంత అందమా? -ఫోటోలు

ఎడారి అంటే మనకి చులకన. అక్కడ ఏమీ పండదనీ, ఇసుక తప్ప మరేమీ కనపడదనీ, అక్కడ మనుషులు బ్రతకడం దుర్లభం అనీను. ఇవన్నీ కొంతవరకు నిజమే అయినా ఎడారి దేశాల్లోనూ నాగరికతలు విలసిల్లిన వాస్తవాన్ని చరిత్ర రికార్డు చేసింది. నీరు దొరకని ఎడారుల్లో ప్రయాణించడానికి ప్రకృతి మనకి ప్రసాదించిన వరం ‘ఎడారి ఓడ.’ ఒయాసిస్సులు ఎడారి దేశాలకు ఆభరణాలై వర్ధిల్లగా నాగరికతలు మాత్రం ఎందుకు వర్ధిల్లవు? ఈ ఫోటోలు ఈజిప్టు ఎడారి సహారాకు చెందినవి. పశ్చిమ ఈజిప్టులో…

ఎకె-47 సృష్టికర్త కలష్నికోవ్ మరణం

ఈ రోజుల్లో ఎకె-47 రైఫిల్ గురించి విననివారు బహుశా ఎవరూ ఉండరు. చిన్న పిల్లాడి దగ్గర్నుండి పండు ముదుసలి వరకూ ప్రపంచ వ్యాపితంగా ఈ రైఫిల్ సాధించుకున్న పేరు ప్రతిష్టలు అసామాన్యం. ఎటువంటి వాతావరణంలోనైనా తనను ధరించిన వారి అంచనాలను ఏ మాత్రం తప్పని లక్షణం వల్లనే ఎకె-47 రైఫిల్ అంతగా పేరు సంపాదించింది. అలాంటి ఎకె-47 సృష్టికర్త  మిఖాయిల్ కలష్నికోవ్ తన 94 వ యేట సోమవారం ఉద్ముర్తియా రిపబ్లిక్ రాజధాని ఇఝెవ్స్క్ లో మరణించారు.…

తెలంగాణ: వివక్ష లేనిదేక్కడ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పునరుద్ధరణకు డిమాండ్ తలెత్తడానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి: వివక్ష రెండు: నిర్లక్ష్యం తెలంగాణ కంటే ముందుగా సంపన్నులైన సీమ, ఆంధ్ర భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలు ఆంధ్ర ప్రదేశ్ అధికార పగ్గాలను తమ చేతుల్లో ఉంచుకోగలిగారు. తద్వారా నూతనంగా సంపన్నులవుతున్న తెలంగాణ భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలకు అవకాశాలను వివిధ రూపాల్లో నిరాకరించారు. అవకాశం ఉన్న చోటల్లా వివక్ష చూపారు. అవకాశం లేనిచోట నిర్లక్ష్యం చూపారు. ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలకు…

ఊడ్చిన చెత్త బుట్టే కేజ్రివాల్ సి.ఎం సీటు! -కార్టూన్

అరవింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా తదితర అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురు. చీపురు చేతబట్టి రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆప్ కు ఢిల్లీ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్ కు అడ్రస్ లేకుండా చేశారు. 8 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మరో విధంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసింది. చీపురు ఊడ్చిన చెత్త ఎక్కడికి చేరుతుంది? చెత్త…

బాలి సదస్సు: పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగిన ఇండియా

(బాలి సదస్సు గురించి రాసిన ఆర్టికల్ పై మరింత వివరించాలని ఉమేష్ పాటిల్ అనే పాఠకులు కోరారు. ఆ కోరికను కూడా ఈ ఆర్టికల్ నెరవేర్చగలదు. ) దోహా రౌండ్ చర్చలను పునఃప్రారంభించే రందిలో ఉన్న భారత ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ గా చెప్పుకుంటున్న ఆహార భద్రతా చట్టానికి తానే తూట్లు పొడిచేవైపుగా వ్యవహరించింది. ఇండోనేషియా నగరం బాలిలో ఈ నెలలో  ‘దోహా రౌండ్’ చర్చలు పునః ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాల భారీ వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలన్న డిమాండ్…

1.1 ల.టన్నుల వాహక నౌకతో అమెరికాకు చైనా సవాలు

చైనా తన మిలట్రీ సామర్ధ్యాన్ని వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో పెద్ద ఎత్తున మిలట్రీ బలగాలను మోహరించిన అమెరికాకు దీటుగా 1.1 లక్షల టన్నుల భారీ సూపర్ విమాన వాహక నౌక నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్ధ్యంతో ఈ విమాన వాహక నౌకను రూపొందించడంతో అమెరికాకు చైనా భారీ సవాలునే విసురుతోంది. 2020 నాటికల్లా ఈ నౌకా నిర్మాణం పూర్తి చేయాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఎ) తలపెట్టినట్లు…

శపధాల ఆజ్యం పోసి దావానలం రాజేస్తాం!

(విప్లవ కమ్యూనిస్టు పార్టీ నేత మాదాల నారాయణ స్వామి గారు డిసెంబర్ 9 తేదీన 99 యేళ్ళ వయసులో మరణించారు. చివరి క్షణాల వరకూ విప్లవ రాజకీయాలను శ్వాసించిన స్వామి గారు ఎం.ఎన్.ఎస్ గా సుప్రసిద్ధులు. 1952లో ఒంగోలు అసెంబ్లీకి, 1962లో ఒంగోలు పార్లమెంటు సభ్యత్వానికి ఎన్నికయిన ఎం.ఎన్.ఎస్ గారు ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ తన జీవితం అంతా శ్రామికవర్గ విముక్తికి అంకితమై పని చేశారు. ప్రకాశం జిల్లా పల్లెలకు ‘స్వామిగారు’ గా చిరపరిచితులయిన ఎం.ఎన్.ఎస్ గారు…

జనం, స్ధలం, ప్రకృతి -ఫోటో పోటీలు

కళాకారుడికి ముఖ్యంగా చిత్రకారుడికి తాను చూసే దృశ్యాల పట్ల వివక్ష చూపకూడదని ఒక సూత్రం. అనగా గొప్ప దృశ్యం, పనికిమాలిన దృశ్యం అంటూ అతని దృష్టిలో ఏమీ ఉండకూడదని అర్ధం. ఆయన చేయాల్సిందల్లా ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించడమే. బహుశా ఫోటోగ్రాఫర్ కి కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో. కాకపోతే ఫోటోగ్రాఫర్ కి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. ఆ పరిజ్ఞానం సహాయంతో ఫోటోగ్రాఫర్ సాధారణ కంటికి పెద్దగా ఆకర్షణీయంగా కనపడని దృశ్యాన్ని కూడా అద్భుతంగా ఆవిష్కరించగల శక్తిని…

ఆర్కిటిక్ లో అమెరికా కట్టెలమ్మి, రష్యా పూలమ్మి

అమెరికా విఫలం అయిన చోట రష్యా సఫలం అయింది. అమెరికా కట్టెలమ్మిన చోట రష్యా పూలమ్ముతోంది. ఆర్కిటిక్ ఆయిల్ వెలితీతలో అమెరికా కట్టెలమ్మిగా తేలితే రష్యా పూలమ్మిగా తేలింది. ఆర్కిటిక్ సిరి సంపదల కోసం ఇండియాతో సహా ప్రధాన దేశాలన్నీ పోటీ పడుతున్న సమయంలో అమెరికాను త్రోసిరాజని రష్యా ముందుకెళ్లిపోయింది. ఆర్కిటిక్ షెల్ నుండి చమురు ఉత్పత్తి ప్రారంభించినట్లు రష్యా చమురు కంపెనీ గాజ్ ప్రోమ్ చేసిన ప్రకటన చూస్తే వరుసగా కలిగే భావాలివి. చమురు, సహజ…

ఢిల్లీ: బ్యాలట్ ఓట్ Vs సోషల్ మీడియా ఓట్ -కార్టూన్

“ధన్యవాదాలు, ఢిల్లీ! ప్రజాస్వామిక ఓటింగ్ తీర్పును పక్కన పెట్టినందుకు…” అవినీతి వ్యతిరేక నినాదంతో వినూత్న రీతిలో ఢిల్లీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. పార్టీ స్ధాపించిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టి కరిపించి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎ.ఎ.పి ఎన్నికల అనంతరం కూడా పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన బి.జె.పి, ఎ.ఎ.పి…

లిబర్టీ విగ్రహం: ఆహ్వానమా, తిరస్కారమా? -కార్టూన్

అమెరికాలో న్యూయార్క్ నగరంలో మన్ హట్టన్ లోని లిబర్టీ ఐలాండ్ లో నెలకొల్పిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ప్రాశస్త్యం ఏమిటో తెలిసిందే. ఫ్రాన్సుకి చెందిన శిల్పి అమెరికా ప్రజలకు బహుమానంగా పంపిన ఈ విగ్రహం స్వేచ్ఛా, స్వతంత్రాలకే కాకుండా అమెరికాకు కూడా సంకేతంగా నిలుస్తుంది. విదేశాల నుండి అమెరికాకు వలస రాదలుచుకున్నవారికి ఆహ్వానం పలుకుతున్నామనడానికీ, ప్రగతికీ సంకేతంగా లిబర్టీ విగ్రహానికి ఒక చేతిలో కాగడా ఉంటుంది. మరో చేతిలోని పుస్తకం అమెరికా రాజ్యాంగానికి సంకేతం. ఈ పుస్తకంపై అమెరికా…

అల్లంత శిఖరాన శూన్యంలోకి అడుగు పెడితే… -ఫోటోలు

పక్షిలా ఎగరాలని మనిషి అనుకోకపోతే విమానం ఉనికిలోకి వచ్చేది కాదు. నేలని ఒక్క తన్ను తన్ని గాల్లోకి రివ్వున దూసుకుపోయే కల బహుశా ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమై ఉంటుంది. హల్క్ పేరుతో విడుదలయిన హాలీవుడ్ సినిమాలో పచ్చ రంగు హీరో ఇలాగే గాల్లోకి ఎగురుతూ ఉంటాడు. కానీ అతనికి కోపం వస్తే తప్ప ఎగరలేడు. పైగా ఆ పరిస్ధితి వచ్చినందుకు అతను చాలా బాధపడుతుంటాడు. హల్క్ లాగా కాకుండా ఇష్టంగా గాల్లో నడుస్తూ భూమిపై…