ఎవరు దేవుడు… ఎవరు బండ…? -కవిత

‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ శీర్షికన ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ అధినేత రాధాకృష్ణగారు వివిధ రంగాల్లో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి విదితమే. ఈసారి ఆయన సినీ నటుడు రంగనాధ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అదే ఇంటర్వ్యూను ఈ రోజు (మార్చి 3) ఆంధ్ర జ్యోతి పత్రికలో ప్రచురించారు. ఆయన ఇంటర్వ్యూ చూడలేదు. కానీ  పత్రికలో ఇంటర్వ్యూ చదివాను. ఆయన ఇంటర్వ్యూ గురించి కాదు గానీ అందులో ఆయన రాసిన కవిత నాకు భలే నచ్చేసింది. కవిత…

చైనా ఇప్పుడు అతిపెద్ద సరుకుల వ్యాపారి

ఆర్ధిక రంగంలో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద సరుకుల వ్యాపారిగా కూడా అవతరించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధ లెక్కల ప్రకారం 2013లో చైనా ఈ మైలు రాయిని అధిగమించిందని జిన్ హువా వార్తా సంస్ధ తెలిపింది. 2013 సంవత్సరంలో చైనా సరుకుల వ్యాపారం మొత్తం 4.16 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రపంచ వాణిజ్య సంస్ధ గణాంకాలు తెలిపాయి. మరే దేశమూ ఈ స్ధాయిలో సరుకుల వాణిజ్యం చేయలేదు. 2013లో చైనా మొత్తం 2.21 ట్రిలియన్…

గుజరాత్ మారణకాండ: క్షమాపణలు చెప్పినట్లా, చెప్పనట్లా?

2002 నాటి గోధ్రా అనంతర మత కారణకాండకు క్షమాపణలు చెప్పాలా లేదా అన్న సంగతి బి.జె.పి నాయకులు తేల్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తప్పులు ఏమన్నా జరిగి ఉంటే శిరసు వంచి క్షమాపణలు కోరడానికి సిద్ధంగా ఉన్నాం అని బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ రోజేమో తమ అధ్యక్షుడు క్షమాపణ చెప్పలేదంటూ ఆ పార్టీ ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నక్వి వివరణతో ముందుకు వచ్చారు. ఇంతకీ బి.జె.పి క్షమాపణ…

సంఘ జీవనం మనిషి సొంతం అన్నదెవరు? -ఫోటోలు

ప్రకృతిలోని ఆయా జీవరాశుల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగితే ఒక్కో సందర్భంలో మానవ జీవితం పైన రోత పుట్టక మానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులొచ్చి గోల గోల చేయడం తెలిసిన విషయమే. పసిగుడ్డుగా ఉన్న తమ పిల్లల్ని కాపాడుకోవడానికి దాదాపు ప్రతి పక్షి, జంతువు ప్రాణాలకైనా తెగించే సాహసం ప్రదర్శిస్తుంది. మనిషి మాత్రం కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విడిపోయి మేం గొప్పంటే మేమే గొప్పంటూ కొట్టుకు చస్తూ మూగ జీవాల ముందు వెలతెలా…

భారత మందులపై అమెరికా చిందులు -ఈనాడు ఆర్టికల్

ఇండియా, అమెరికాల మధ్య ఔషధ వాణిజ్య యుద్ధం రేగుతోంది. భారత ఫార్మా కంపెనీలపై విచారణలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తూ తమ బహుళజాతి ఔషధ కంపెనీల ప్రయోజనాల కోసం అమెరికా అక్రమ చర్యలకు దిగుతోంది. మరోవైపు అమెరికా చర్యలపై డబ్ల్యూ.టి.ఓ కు ఫిర్యాదు చేయడానికి సంసిద్ధం అవుతోంది. ఈ అంశంపై ఈ రోజు ‘ఈనాడు’ దినపత్రికలో ప్రచురించబడిన నా ఆర్టికల్ ఇది. కింద బొమ్మపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో ఆర్టికల్ చూడవచ్చు. ఆర్టికల్ లో నేరుగా…

భారత వృద్ధి: పరిశ్రమలు బలహీనం, పెట్టుబడులు కరువు

భారత దేశ అభివృద్ధి కధ ఎప్పటికయినా పునరుద్ధరించబడేనా? 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ముందు వరకు సగటున 9 శాతం జి.డి.పి వృద్ధి రేటుతో పశ్చిమ పెట్టుబడులకు చైనా తర్వాత ఫేవరెట్ గా నిలిచిన ఇండియా ఇప్పుడు అందులో సగం వృద్ధి సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. ‘ఫాస్ట్ ట్రాక్’ పేరుతో స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు అనుమతులను భారత చట్టాలను బుల్ డోజ్ చేస్తూ జారీ చేస్తున్నా ఆర్ధిక వ్యవస్ధలో మునుపటి కళ గోచరించడం…

శత సహస్ర కోటీశ్వరుడు సుబ్రతో రాయ్ అరెస్ట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత సుబ్రతో రాయ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుప్రీం కోర్టులో హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. సుబ్రతో రాయ్ కోసం ఆయనకు చెందిన లక్నో నివాసంలో పోలీసులు వెతికినప్పటికి దొరకలేదు. సుబ్రతో కంపెనీల వద్దా, నివాసాల వద్దా పోలీసులు కాపు కాయడంతో పరిస్ధితి తీవ్రతను గమనించిన రాయ్ ఈ రోజు లక్నో…

పార్లమెంటు వెల్ నుంచే ప్రచారం మొదలు -కార్టూన్

సగటు పురుషుడు: పార్లమెంటులో దీన్ని ‘వెల్ ఆఫ్ ద హౌస్’ అంటారు… సగటు స్త్రీ: ఎన్నికల్లోనేమో మహా అగాధం అని పిలుస్తారు… మరో అద్భుతమైన కార్టూన్! పార్లమెంటు ఉభయ సభల్లోనూ సాధారణంగా జరిగే గొడవలకు, ముఖ్యంగా ఇటీవల తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా వివిధ పార్టీల నేతలు వేసిన వేషాలకు కారణం ఏమిటో స్పష్టంగా తెలియజెపుతున్న కార్టూన్ ఇది. 2014 సాధారణ ఎన్నికల ప్రచారం చివరి లోక్ సభ, రాజ్య సభల సమావేశాల నుండే మొదలయిందని కార్టూన్…

జనారణ్యంలో చిరుత -ఫోటోలు

మనిషి జీవనంపై మోజు పెంచుకుందో ఏమో గానీ ఓ చిరుతపులి మీరట్ జనారణ్యంలోకి ప్రవేశించింది. పోలీసు అధికారుల్ని, అటవీ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. పోలీసులు తమ సహజ స్టైల్ లో లాఠీ చార్జికి దిగినా అది అదరలేదు, బెదరలేదు. పోలీసు లాఠీ ఝళిపిస్తే బెదిరి పరుగులు పెట్టాలని దానికి తెలియదు గదా మరి! పోలీసుల పైకే లంఘించి ఏడుగురిని గాయపరిచి మరీ తన సత్తా చాటుకుంది. ఆదివారం, ఫిబ్రవరి 23…

ఇండియా, గాంధీ, బోస్… జెస్సీ జాక్సన్ అభిప్రాయాలు

అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు జెస్సి జాక్సన్ ఇండియా సందర్శించారు. జెస్సీ జాక్సన్ అమెరికాలో 1960ల కాలంలో వెల్లివిరిసిన నల్ల జాతి పౌర హక్కుల ఉద్యమానికి నేతృత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ సమకాలికులు. భారత జాతీయోద్యమ నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ‘నేతాజీ మ్యూజియం’ ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కోల్ కతా లో ఆయన సుభాష్ సోదరుని కుమార్తె కృష్ణ బోస్ కలిసి జెస్సీ…

సహారా బాస్ కి నాన్ బెయిలబుల్ వారంట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత, క్రికెట్ ఇండియా టీం మాజీ స్పాన్సరర్ అయిన సుబ్రతో రాయ్ కి సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ కోర్టుకు రాకపోవడంపై సుప్రీం ద్విసభ్య బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లిగారి ఆరోగ్యం బాగాలేనందున హాజరు కాలేకపోయారన్న సుబ్రతో రాయ్ అడ్వకేట్, సో కాల్డ్ పేరు మోసిన క్రిమినల్ లాయర్…

ఇండియా ఫార్మా పరిశ్రమ: త్వరలో అమెరికా ఆంక్షలు?

జెనెరిక్ ఔషధ తయారీలో పేరెన్నిక గన్న భారత ఫార్మా పరిశ్రమపై వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎఫ్.డి.ఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఇటీవలే ఇండియా పర్యటించారు. ఆమె వివిధ ఔషధ ఎగుమతి కంపెనీల పరిశ్రమలను తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వాతావరణం మరింత వేడెక్కింది. ‘ప్రాధామ్య విదేశాలు’ (Priority Foreign Countries –…

సోనియా చెయ్యి కట్టేసిన కె.సి.ఆర్? -కార్టూన్

తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నట్లు ఈ కార్టూన్ సూచిస్తోందా? కానీ విలీనం చర్చలు జరుగుతున్నాయని నేడో, రేపో నిర్ణయం వచ్చేస్తుందని కదా పత్రికలు చెబుతున్నది? సోనియా ముందు టి.ఆర్.ఎస్ నేతలు ఒక వాదన ఉంచినట్లు కొద్ది రోజుల క్రితం ఒక ఊహాగానం వెలువడింది. దీని ప్రకారం విలీనం కంటే కలిసి పోటీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం అని టి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ కు…

అన్నా హజారే రాజకీయం -కార్టూన్

“అవినీతి వ్యతిరేక పోరాటాన్ని నేను తేలిక చేసేశాను – మన దీదీని ఎన్నుకోండి చాలు – ఇక అవసరమైందంతా ఆమె పూర్తి చేసేస్తారు…” *** రాజకీయాలు తనకు సరిపడవని చెబుతూ అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు. మొదట అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పి కూడా కిరణ్ బేడీ మంత్రాంగంతో ఆయన వెనక్కి తగ్గారు. పైగా ఎన్నికల్లో తన పేరు వినియోగించడానికి వీలు లేదంటూ ఆప్ పార్టీపై ఆంక్షలు…

కాలిఫోర్నియా: పోలియో తరహా వ్యాధితో 25 మంది పిల్లలు

పోలియో రహిత ప్రపంచాన్ని స్ధాపిద్దాం అంటూ న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సందేశం ఇస్తుండగా ఐరాస కార్యకలాపాలకు కేంద్ర అయిన అమెరికాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కాలిఫోర్నియా రాష్ట్రంలోని పిల్లలను ఇప్పుడో వింత వ్యాధి భయపెడుతోంది. సరిగ్గా పోలియో తరహాలోనే పిల్లల కాళ్ళు, చేతులు ఒక్కసారిగా చచ్చుబడిపోతున్నాయి. పోలియో తరహా వ్యాధి అని డాక్టర్లు చెబుతున్నప్పటికీ పోలియో మాత్రం కాదని కూడా వారు చెబుతున్నారు. ఫుకుషిమా…