అక్కడ హోలీ హిందువులది కాదు క్రైస్తవులది -ఫోటోలు

అమెరికాలోని యుటా (Utah) రాష్ట్రంలో హోలీ పండుగ ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ హోలీ జరుపుకునేది హిందువులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. క్రైస్తవ మతంలో ఇటీవల శతాబ్దాల్లో ఒక శాఖగా అవతరించిన మర్మోన్లు ఇక్కడ హోలీని పెద్ద ఎత్తున జరుపుకుంటారట. ఈ అలవాటు ఎప్పటినుండి ఆచరణలో ఉన్నదో తెలియదు గానీ ఈ సంవత్సరం మాత్రం భారీ సంఖ్యలో మర్మోన్లు హోలీ జరుపుకున్నారు. అది కూడా శ్రీ శ్రీ రాధా కృష్ణ ఆలయం దగ్గర! మార్చి 29 నుండి…

అమెరికాలో ఆంధ్ర మైనింగ్ స్కామ్

ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ కుంభకోణం వీరులు అమెరికా కోర్టులో కూడా ప్రవేశించి రికార్డు సృష్టించారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన ఐదేళ్ల తర్వాత ఆయన ఆత్మ బంధువుగా పేరుగాంచిన కె.వి.పి.రామచంద్ర రావు తెలుగు నేల ఖ్యాతిని ఈ విధంగా దిగంతాలను దాటించారు. మరో ముద్దాయిపై కూడా నేరాభియోగం నమోదు చేసిన అమెరికా కోర్టు ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఆయన వై.ఎస్ పుత్రుడు వై.ఎస్.జగన్ అని ఆరోపిస్తున్నారు. కాగా అమెరికా కోర్టులు విచారణ…

ఈజిప్టులో 3,500 సం.ల నాటి వాతావరణ నివేదిక

వాతావరణ మార్పుల గురించి ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం మనకు తెలిసి ఇటీవల కాలానిదే. కానీ ప్రాచీన ఈజిప్టు నాగరికతలో కూడా అలాంటి పరిజ్ఞానం ఒకటుండేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. 3,500 సంవత్సరాల క్రితం నాటి కాల్సైట్ (కాల్షియం కార్బొనేట్) రాతి పలక పైన వాతావరణ మార్పుల గురించిన నివేదికను అమెరికాలోని పరిశోధకులు కనుగొన్నారు. 6 అడుగుల ఎత్తున ఉన్న ఈ కాల్సైట్ పలక పైన ఉన్న 40 లైన్ల పాఠ్యాన్ని ఇటీవలే చదవగలిగారని ఫ్రీ ప్రెస్…

అమెరికా దురాక్రమణలో విరగబూసిన ఆఫ్ఘన్ హెరాయిన్

ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణ దాడికి అమెరికా చెప్పిన కారణాల్లో ఒకటి ఓపియం సాగుని అరికట్టడం. అమెరికా తన ఆక్రమణను  పూర్తిగా డిసెంబర్ తో ముగిస్తానని చెబుతోంది. అప్పటికి ఓపియం సాగుని అరికట్టకపోయినా కనీసం కొంత భాగం అరికట్టినా ఏదో ప్రయత్నం చేశారని సంతృప్తి పడొచ్చు. కానీ 13 సం.ల అమెరికా ఆక్రమణలో  ఆఫ్ఘనిస్ధాన్ లో ఓపియం సాగు అరికట్టడం అటుంచి 40 రెట్లు పెరిగితే ఏమిటని అర్ధం చేసుకోవాలి. అమెరికా ఓపియం సాగుని అరికట్టడానికి ప్రయత్నించిందనా లేక…

మాన్యుఫాక్చరింగ్: బి.జె.పి యేతర రాష్ట్రాలదే పై చేయి

బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తరచుగా అభివృద్ధి మంత్రం జపిస్తుంటారు. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు ఇష్టానుసారం జనం సొమ్ము కట్టబెట్టడమే అభివృద్ధి మంత్రంలోని అంతస్సారం. పోనీ అందులోనైనా గుజరాత్ ముందు పడిందా అంటే అదీ లేదు. కాంగ్రెస్, బి.జె.పి రెండు పార్టీలూ లేని తమిళనాడు మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి, ఉద్యోగాల సృష్టి లలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారి గణాంకాలు తెలియజేస్తున్నాయి. బి.జె.పి తన ఎన్నికల ప్రచారంలో మాన్యుఫాక్చరింగ్,…

ఐ.పి.ఎల్ vis-a-vis సుప్రీం కోర్టు -కార్టూన్

బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాసన్ పుణ్యమాని సుప్రీం కోర్టు కూడా ఐ.పి.ఎల్ పాలకవర్గంలో ఒక పాత్ర పోషిస్తోంది. ధర్డ్ అంపైర్ ధాటికి గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు అంపైర్ల నిర్ణయ శక్తి దాదాపు నామమాత్రంగా మారిపోయినట్లే సుప్రీం కోర్టు ఇటీవల చూపుతున్న చొరవ వల్ల మొత్తం స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ స్వతంత్రతకు ప్రమాదం వచ్చినపడినట్లు కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ గుర్రం ఎవరు? బహుశా క్రికెట్ ఆటగాళ్లకు, అంపైర్లకు, ఆటను చూసే ప్రేక్షక దేవుళ్ళకి ఎవరికీ కనపడకుండా…

1962: చైనా కాదు ఇండియాయే దాడి చేసింది -మాక్స్ వెల్

1962 నాటి ఇండియా-చైనా యుద్ధంలో మొదట దాడి చేసింది ఇండియాయేనని చైనా కాదని  సీనియర్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు నెవిల్లే ప్రకటించారు. ఆనాటి యుద్ధానికి సంబంధించి ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న పత్రాలను తాను త్వరలో ప్రచురిస్తానని మాక్స్ వెల్ తెలిపారు. పత్రాలను ప్రచురించడం ద్వారా తాను “భ్రాంతిజనకమైన భారతీయ అభిప్రాయాలను పారద్రోలతానని” మాక్స్ వెల్ చెప్పడం విశేషం. 1962 నాటి యుద్ధం చైనా వల్లనే సంభవించిందని భారత దేశంలోని పాఠ్య పుస్తకాలు చెబుతాయి. హిందూ మతోన్మాద సంస్ధలు కూడా…

చైనా వృద్ధి కిందికి, ఉద్దీపన ఊహలకు ఊపు

చైనా ఆర్ధిక వృద్ధి అనుకున్నంత స్ధాయిలో నమోదు కావడం లేదన్న అంచనాలు పెరుగుతుండగా ఆ దేశ ప్రభుత్వం మరోసారి ఆర్ధిక ఉద్దీపన అమలు చేయనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2014 ఆర్ధిక సంవత్సరానికి గాను (చైనా ఆర్ధిక సంవత్సరం జనవరి 1 తేదీన మొదలై డిసెంబర్ 31తో ముగుస్తుంది) 7.5 శాతం జి.డి.పి వృద్ధి నమోదు చేయాలని చైనా ఆశిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పడిపోతున్న పరిస్ధితుల్లో ఇది సాధించడం అనుమానంగా మారింది. ఫలితంగా మరో…

దేవయాని: అమెరికా రాయబారి రాజీనామా

భారత దేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా చేశారు. ఆమె రాయబారిగా నియమితులై రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ఈ లోపే రాజీనామా చేయడానికి దేవయాని ఖోబ్రగదే వ్యవహారమే కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలవడం ద్వారా ఏడేళ్ళ బాయ్ కాట్ కి లాంఛనంగా తెరదించిన నాన్సీ పావెల్ రాజీనామా కొంత కాలంగా అమెరికా విదేశాంగ శాఖ చర్చల్లో నలుగుతున్నదే అని తెలుస్తోంది. రాజీనామా అనంతరం నాన్సీ…

ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

అమెరికా: మట్టి పెళ్ల కూలి ఓ పట్నం మాయం -ఫోటోలు

వాషింగ్టన్ రాష్ట్రంలోని ఓసో పట్నం వాసులకు మార్చి 22 ఓ మహా దుర్దినం అయింది. అప్పటికి మూడు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండ చరియ కూలిపోవడంతో దానికింద పడి ఆ పట్నం దాదాపు అదృశ్యం అయిపోయింది. ఇప్పటివరకూ 17 మంది మరణించారని ప్రకటించగా 90 మంది జాడ తెలియలేదు. వీరంతా చనిపోయారన్న నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చేశాయి. వారి బంధువులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. స్ధానికులు ఈ కొండను ‘స్లైడ్…

గూగుల్ Vs బైదు (చైనా): అమెరికాలో వింత తీర్పు

మనకి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఎలాగో అమెరికాలో ఫస్ట్ అమెండ్ మెంట్ అలాగ. ఈ ఫస్ట్ అమెండ్ మెంట్ ని అడ్డం పెట్టుకుని చైనా సర్చ్ ఇంజన్ బైదు పైన దెబ్బ కొట్టాలని చూసిన చైనీస్ అమెరికన్ ప్రముఖులు కొందరు అమెరికా కోర్టు ఇచ్చిన ఓ విచిత్రమైన తీర్పుతో తామే ఖంగు తినాల్సి వచ్చింది. చైనా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే భావాలను చైనాలో అడుగు పెట్టకుండా బైదు సర్చ్ ఇంజన్ ఫిల్టర్ చేసి అడ్డుకుంటోందని దీనివల్ల తమ ప్రజాస్వామిక…

ఎన్నికల మేనిఫెస్టో: ఒక పనికిరాని డాక్యుమెంట్

మేనిఫెస్టో: గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిపూర్తి చేస్తాం. జనం: ఇదిగో ఈ ఒక్క పేజీని మీ మేనిఫెస్టో చెయ్యండి చాలు! *** రాజకీయ పార్టీలు ప్రస్తుతం మేనిఫెస్టోల జాతరలో మునిగి తేలుతున్నాయి. పదేళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మళ్ళీ అవే వాగ్దానాలతో మేనిఫెస్టో విడుదల చేయగా బి.జె.పి దాన్ని అబద్ధాలు, మోసపూరితం అంటూ కొట్టిపారేస్తోంది. అక్కడికి బి.జె.పి మేనిఫెస్టో పక్కా నిజాయితీతో తయారు చేసినట్టు! ది హిందు పత్రిక ప్రకారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో…

మోడి సెకండ్ రేట్ లీడర్ -హిందూ స్వాములు

బి.జె.పి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఒక పక్క తెలుగు సినీ తారలు ఆకాశానికెత్తుతుండగా మరో పక్క హిందూ పీఠాధిపతులు ఆయన్ను విమర్శిస్తున్నారు. బి.జె.పి కార్యకర్తలను ‘వ్యక్తి పూజ’ చేసేలా ఆయన ప్రోత్సహిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ‘హర హర మహా దేవ’ కు బదులుగా ‘హర హర మోడి’ అంటున్నా మోడి వారిని వారించ లేదని విమర్శిస్తున్నారు. వారణాసిలో ఇటీవల జరిగిన బి.జె.పి ర్యాలీలో జరిగిన ఘటన పట్ల వివిధ పీఠాధిపతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.…

న్యూట్రల్ ఓటుతో భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక

ఐరాస మానవ హక్కుల సంస్ధలో ఇండియా శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరించడంతో శ్రీలంక కృతజ్ఞత చూపింది. భారత్ చర్యకు కృతజ్ఞతగా శ్రీలంక జైళ్ళలో మగ్గుతున్న 98 మంది జాలర్లను విడుదల చేసింది. ఐరాసలో భారత దేశం అనుసరించిన వైఖరికి ప్రతి సుహృద్భావ చర్యగానే భారత జాలర్లను విడుదల చేస్తున్నామని చెప్పి మరీ విడుదల చేసింది. ఉపఖండంలో మారుతున్న ధోరణులకు భారత్-శ్రీలంక చర్యలు అద్దం పడుతున్నాయి. ఐరాస మానవ హక్కుల సంస్ధ (United Nations Human Rights Commission) లో…