తప్పు లేదని నిర్ధారించినా సస్పెన్షన్ ఎందుకు?
ఏఎస్‌ఏ విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదనీ, వారు తప్పు చేశారని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలూ లేవని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అయినప్పటికీ ఆ అయిదుగురినీ యూనివర్సిటీ కౌన్సిల్ ఎందుకు సస్పెండ్ చేసింది? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పి అప్పారావు నియమితులు కావడానికి ముందు నియమించబడిన కమిటీ దళిత విద్యార్ధులది ఎలాంటి తప్పూ లేదని తేల్చింది. దానితో వారిపై ఎలాంటి చర్యకూ ఆస్కారం లేదు. కనుక సస్పెన్షన్ నన్ను రద్దు చేశారు. కానీ ఆ తర్వాతే…




