కాళ్ళు చేతులు కట్టేసి లైంగిక పరీక్షలు జరిపారు -పింకి ప్రామాణిక్

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా అధ్లెట్ పింకి ప్రామాణిక్ పట్ల ఆసుపత్రులు, పోలీసులు, సమాజం ఎంత క్రూరంగా, దయా రహితంగా వ్యవహరించారో గత కొన్ని రోజులుగా పత్రికలు వెల్లడిస్తున్నాయి. పాతిక రోజులు జైలులో గడిపి బుధవారం బెయిలు పై బైటికి వచ్చిన తర్వాత పింకీ వెల్లడించిన నిజాలు పత్రికల కధనాలను బలపరిచాయి. పోలీసు కష్టడీలో ఉండగా వేధింపులకు గురయ్యాననీ, ప్రవేటు ఆసుపత్రి వైద్యులు కాళ్ళు, చేతులు కట్టేసి లింగ నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహించారని పింకీ…

సిక్కింలో ఋతుపవనాల సొబగులు చూసి తీరాలి -ఫొటోలు

రుతుపవనాలు సిక్కింలోని ప్రకృతికి అద్దిన అందాలను ఈ ఫొటోలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. అర్జెంటుగా ఈ ఫొటోలు తీసిన గ్యాంగ్ టక్ కి పరిగెత్తుకెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఫొటోగ్రఫీని మనమూ హాబీగా ఎందుకు చేసుకోకూడదు? అని కూడా అనిపిస్తోంది. ఫొటోల్లోని మూడ్ చూస్తే మత్తుగా, మంగుగా, బద్ధకంగా కనిపిస్తున్నప్పటికీ వర్షం కురిసి వెలిసినప్పటి చురుకుదనం ఆ మత్తుని తరిమికొడతానని సవాలు చేస్తున్నట్లుగా ఉంది. విద్యుత్ దీపాల కృత్రిమ వెలుగులకి సహజత్వాన్ని ఇస్తూ, రాత్రి దుప్పటిలోకి కూడా చొరబడి తానున్నానని…

‘ఆధునికత’ ముసుగులో మెట్రోల్లో కొనసాగుతున్న కుల, మత వివక్షలు -ది హిందూ

భారత దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞానానికి రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు లో కుల, మతాల మూఢత్వం ‘ఆధునికత’ ముసుగులో పరిఢవిల్లుతోందని ‘ది హిందూ’ వెల్లడించింది. సామాజిక వ్యవస్ధల్లో మనుషుల మధ్య తీవ్ర వైరుధ్యాలకు కారణంగా నిలిచిన కుల, మతాలు కాల క్రమేణా బలహీనపడుతున్నాయన్న విశ్లేషణల్లో నిజం లేదని ‘ది హిందూ’ పత్రిక ప్రచురిస్తున్న పరిశోధనాత్మక కధనాల ద్వారా తెలుస్తోంది. భూస్వామ్య వ్యవస్ధ మూలాలయిన కులం, మత విద్వేషాలు ఆధునికతకు మారుపేరుగా భావించే మెట్రో నగరాల్లో బలహీనపడకపోగా యధాశక్తితో…

మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై సి.బి.ఐ దాఖలు చేసిన అవినీతి కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ తనంతట తాను మాయావతి కోసమే ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడాన్ని తప్పు పట్టింది. తాజ్ కారిడార్ అవినీతి కేసులో అధికారుల అవినీతిని విచారించాలని కోర్టు చెపితే దాన్ని వదిలి మాయావతి పై ప్రత్యేకంగా కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించి మాయావతి పై…

బ్యాంక్సీ వీధి చిత్రాలు… కాదు, కాదు, పెయింటింగ్స్ -ఫొటోలు

బ్యాంక్సీ, వీధి చిత్రాలకు చిరునామా అని పాఠకులకు తెలిసిన విషయమే. కులీన వర్గాల ‘అధారిటేరినియనిజం’ పై చాచి కొట్టేలా ఉండే బ్యాంక్సీ వీధి చిత్రాలకు ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో, లెక్కకు మిక్కిలిగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ టపాలో ఇస్తున్నవి బ్యాంక్సీ వీధి చిత్రాలు కావు గానీ, వాటికి ఏ మాత్రం తగ్గనివి. కాసిన్ని గీతల్లో, స్టెన్సిల్ టెక్నిక్ తో అధికార మదానికి  బ్యాంక్సీ ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్, అపహాస్యం, సునిశిత విమర్శ ఈ…

కూల్చిన మసీదులు కట్టాల్సిందే, మోడీకి సుప్రీం ఆదేశాలు

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో కూల్చిన మసీదులను తిరిగి కట్టాలంటూ గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టడం ‘సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధం’ అన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. గుజరాత్ మారణకాండ సందర్భంగా ముస్లింల ప్రార్ధనా స్ధలాలను కాపాడడంలో విఫలం అవడమే కాక కూల్చివేతకు గురయిన మసీదులను నిర్మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం…

స్పోర్ట్స్ లో పురుష దురహంకారం స్పష్టంగా ఉంది -దీపిక

ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన…

భారతీయ నటి నటించిన “మిరాల్” ప్రీవ్యూని రద్దు చేయాలి -ఇజ్రాయెల్ డిమాండ్

“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్”  పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది. జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ…