ఆఫ్రికా గడ్డ పై ‘ద లాస్ట్ సప్పర్’ -ఫొటో

లియొనార్డో డా-విన్సి గీసిన ఫేమస్ పెయింటింగ్ ‘ద లాస్ట్ సప్పర్’ ను తలపిస్తున్న ఈ ఫొటో ఆఫ్రికా దేశం మొరాకో లో తీసినది. ‘నేషనల్ జాగ్రఫీ ట్రావెలర్ ఫొటో’ పోటీల్లో మెరిట్ బహుమతి పొందిన ఈ ఫోటోని సౌఖియాంగ్ చౌ (SauKhiang Chau) అనే ఫొటోగ్రాఫర్ తీసాడు. మొరాకోతో పాటు మరి కొన్ని ఉత్తర ఆఫ్రికా దేశాల్లోనూ, మరికొన్ని పశ్చిమాసియా దేశాల్లోనూ ధరించే ‘జెల్లాబా’ (djellaba) అనే దుస్తుల వల్ల డా-విన్సి పెయింటింగ్ ని తలపిస్తూ ఫొటో…

నో ఇండియన్స్ ప్లీజ్! -ఆస్ట్రేలియాలో ఉద్యోగ ప్రకటన

భారతీయులు గానీ, ఆసియన్లు గానీ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించిన ఒక ‘ఉద్యోగ ప్రకటన’ ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సూపర్ మార్కెట్ లో క్లీనర్ ఉద్యోగాల కోసం ‘గమ్ ట్రీ’ (Gumtree) వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఇండియన్లు, ఆసియన్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయనవసరం లేదని పేర్కొంది. ఈ ప్రకటన పట్ల సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఆగ్రహం వ్యక్తం అయింది. ప్రకటన జారీ చేసిన ‘కోల్స్’ సూపర్ మార్కెట్ స్టోర్ ను ప్రజలు బహిష్కరించాలని…

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…

స్టేట్ మెంట్ పేరుతో ఆలస్యం, రక్తం ఓడుతూ పోలీసుల ముందే దుర్మరణం

తమతో బస్టాండ్ లో నిలబడి ఉన్న స్నేహితురాలిని కళ్ళముందే అసభ్యంగా వేధిస్తున్నారు. భరించలేని యువకులిద్దరూ గ్యాంగ్ అసభ్య చేష్టలకి అడ్డు చెప్పారు. అడ్డుకున్నందుకు ఇద్దరి యువకులని తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో రవిని కడుపులో పొడిచి పారిపోయారు. ‘ది హిందూ’ ప్రకారం యువకులిద్దరూ పోలీసులకి ఫోన్ చేయడంతో సమయానికి అక్కడికి వచ్చిన పోలీసులు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్ళడం మాని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేట్ మెంట్ తీసుకుంటూ రక్తం కారుతున్న రవిని 40 నిమిషాలు పోలీస్…

మహబూబ్ నగర్ పల్లెలో ‘ఐ-పలకల’ విప్లవం–ఫోటోలు

కంప్యూటర్ల నుండి మొబైల్ ఫోన్ల వరకూ సమాచార సాంకేతిక విప్లవం మానవ జీవనాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలం మనది. దేశ దేశాల సాంస్కృతిక జీవనంలోకి కూడా చొరబడి మధ్య తరగతి యువతీ, యువకుల చేత కిడ్నీలను అమ్మిస్తున్న ఐ-ఫోన్ల కాలం కూడా మనదే. బిట్లు, బైట్లుగా కాపర్ తీగల్లో ప్రవహిస్తున్న సాంకేతిక విప్లవ ఫలితం భారత దేశ పల్లెలకు అందని ద్రాక్షగా భావించవచ్చు గానీ, మహబూబ్ నగర్ జిల్లా లోని మహమ్మద్ హుసేన్ పల్లి విద్యార్ధులు అందుకు మినహాయింపు…

‘అస్సాం హింస’ ముస్లిం మిలిటెన్సీకి దారి తీయవచ్చు -మైనారిటీస్ కమిషన్

అస్సాంలోని బోడో జిల్లాల్లో చెలరేగిన హింసలో ముస్లిం ప్రజల భద్రతకు హామీ లభించకపోతే ‘ముస్లిం మిలిటెన్సీ’ కి దారి తీయవచ్చని ‘నేషనల్ మైనారిటీస్ కమిషన్’  (ఎన్ ఎం సి) హెచ్చరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జీహాదీ సంస్ధల మద్దతుతో అటువంటి మిలిటెన్సీ తలెత్తే అవకాశాలు ఉన్నాయని కమిషన్ తయారు చేసిన నివేదిక హెచ్చరించింది. ‘బోడోలాండ్ టెరిటోరియల్ అటానమస్ డిస్ట్రిక్క్ట్స్’ (బి.టి.ఎ.డి) కింద ఉన్న నాలుగు జిల్లాలను కమిషన్ సందర్శించిన అనంతరం ఈ నివేదిక తయారు చేసిందని ‘ది…

సుప్రీం కోర్టులో పిటిషన్: తప్పిపోయిన పిల్లలు 55,000

55,000 మందికి పైగా పిల్లలు తప్పిపోయారనీ, వారిని వెతికి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని పేర్కొంటూ సుప్రీం కోర్టులో ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ – పిల్) దాఖలయింది. తప్పిపోయిన పిల్లలందరిని వెతకండం కోసం కృషి చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని అడ్వకేట్ సర్వ మిత్ర దాఖలు చేసిన పిటిషన్ కోరింది. “రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకోవడంలో విఫలం అయింది. ఫలితంగా…

మమతకు ప్రజల ప్రశ్నలు సుత్తీ కొడవళ్ళుగా కనిపిస్తున్నాయా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫాసిస్టు విన్యాసాలు కొనసాగుతున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలపై విరుచుకు పడడానికే వినియోగిస్తున్నది. ప్రజలకు కావలసింది శుష్క వాగ్దానాలు కావనీ, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావని ప్రశ్నించినందుకు టి.బి తో బాధపడుతున్న ఒక సాధారణ రైతును అరెస్టు చేసి దొంగ కేసులు బనాయించింది. బుధవారం పశ్చిమ మిడ్నపూర్ లో బహిరంగ సభ పూర్తయ్యాక ఎప్పటిలాగే ప్రశ్నలు అడగాలని కోరిన మమత రైతులకోసం ఏమి చేస్తున్నారన్న ప్రశ్నను సహించలేకపోయింది.…

అక్కడ హిందువులు, ఇక్కడ ముస్లింలు: మైనారిటీలకు ఎక్కడా రక్షణ లేదు

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియాలో అయినా, మిలట్రీ కనుసన్నల్లో ఎదుగుతున్నపాకిస్ధాన్ నామమాత్ర ప్రజాస్వామ్యంలో అయినా మైనారిటీలకు  ఎక్కడా రక్షణ లేదు. మైనారిటీ మతస్ధుల ఆస్తులు లాక్కోవడానికి మతం అడ్డు పెట్టుకునే దుర్మార్గాలు రెండు చోట్లా కొనసాగుతున్నాయని పత్రికల ద్వారా తెలుస్తున్నది. ‘రింకిల్ కుమారి’ కేసు ద్వారా పాక్ సుప్రీం కోర్టు కూడా మత ఛాందస శక్తుల ముసుగులో దాక్కున్న భూస్వామ్య పాలకవర్గాల చేతిలో బందీ అని స్పష్టం అయింది. ఫలితంగా తమ ఆస్తులను భక్షించడానికి జరుగుతున్న…

ప్రజల సొమ్ము దోచుకోండి, కానీ బందిపోట్లలా కాదు -యు.పి మంత్రి

మాయావతి అవినీతి పై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధికారులకు ప్రజల సొమ్ము దొంగిలించడానికి అనుమతి ఇచ్చేసింది. కాకపోతే మరీ బందిపోటు దొంగల్లా దోచుకోకుండా, దొంగిలించవచ్చని సున్నితంగా బోధించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి బాబాయి అయిన శివ్ పాల్ సింగ్ యాదవ్ ఈ ఆణి ముత్యాలను తన శాఖ అధికారులకు బోధించాడు. తద్వారా సర్వ వ్యాపితం అయిన అవినీతి ని నాలుగు గోడల మధ్య చట్టబద్ధం చేశాడు.…

‘లండన్ ఒలింపిక్స్ 2012’ స్ట్రీట్ ఆర్ట్ -ఫోటోలు

ప్రఖ్యాత వీధి చిత్రకారుడు బ్యాంక్సీ, లండన్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సందర్భంగా రెండు వీధి చిత్రాలను తన వెబ్ సైట్ లో ప్రదర్శించాడు. ఈ చిత్రాలు ఏ వీధిలో ఉన్నదీ ఇంకా ఎవరికీ తెలిసినట్లు లేదు. బ్యాంక్సీ కూడా ఆ వివరాలేవీ చెప్పలేదు. (ఆ మాటకొస్తే తన వెబ్ సైట్ లో ఆయన ఉంచిన ఏ చిత్రానికీ వివరాలు లేవు.) వెబ్ సైట్ లో ప్రదర్శించేదాకా ఆ చిత్రాల సంగతి ఎవరికీ తెలిసినట్లు కూడా కనిపించడం…

+92, +90 లనుండి మేసేజ్ లా? మీ మొబైల్ సిమ్ క్లోనింగ్ ప్రయత్నం కావచ్చు

మొబైల్ ఫోన్ ల సిమ్ లను క్లోనింగ్ చేసి ఆర్ధిక మోసాలకు పాల్పడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా తెలుస్తోంది. ఒక ఢిల్లీ నివాసి నుండి వచ్చిన ఫిర్యాదును ఛేదించే క్రమంలో సిమ్ కార్డ్ క్లోనింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించిన సమాచారం వెల్లడయింది. మొబైల్ సిమ్ ను క్లోనింగ్ చేసే సౌకర్యం కొన్ని వెబ్ సైట్లు అందిస్తున్నాయనీ, వీటిని ఉపయోగించి సొంతదారులకు తెలియకుండానే వారి మొబైల్ సిమ్ లను రహస్య…

గీతిక శర్మ ఆత్మహత్యకు కారకుడు హర్యానా హోమ్ మంత్రి

ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఢిల్లీలోని తన గదిలో ఫ్యానుకి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హర్యానా రాష్ట్ర హోమ్ మంత్రి గోపాల్ గోయల్ కాండా, అతని ఎక్జిక్యూటివ్ అరుణ చద్దా లే తన ఆత్మహత్యకు కారకులని ఆత్మహత్య లేఖలో రాసి చనిపోయింది. వీరిద్దరూ తన జీవితాన్ని నాశనం చేశారనీ, నమ్మకద్రోహానికి పాల్పడ్డారనీ, వారి స్వప్రయోజనాల కోసం తన జీవితాన్ని బలితీసుకున్నారనీ ఆమె తన లేఖలో ఆరోపించింది. తన జీవితాన్ని నాశనం చేసిందే కాక తన తల్లిదండ్రులను…

మంగుళూరు దాడి నాయకుడు నరేంద్ర మోడీకి పరమ భక్తుడు

మంగుళూరులో ‘హిందూ సంస్కృతి’ పరిరక్షణ కోసం అంటూ బర్త్ డే పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకులపై నీచమైన రీతిలో దాడి చేసిన మూకలకు నాయకత్వం వహించిన సుభాష్ పాడిల్ గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి కి పరమ భక్తుడని ‘ది హిందూ’ వెల్లడించింది. 2009 లో పబ్ పై దాడి చేసి అమ్మాయిలపై చేయి చేసుకున్న బృందంలో కూడా సుభాష్ పాడిల్ చురుకయిన సభ్యుడని తెలిపింది. 2009 దాడిలో టి.వి చానెళ్ళు, పత్రికల ద్వారా బహుళ…

ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్

ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమై ఐదు రోజులు గడిచిపోయాయి పొరుగు దేశం చైనా 13 బంగారు పతకాలతో అగ్ర స్ధానంలో ఉండగా ఇండియా ఇంకా బంగారు ఖాతా తెరవనే లేదు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్ ల పై బంగారు ఆశలు ఉన్నా అవి మినుకు మినుకు మంటున్నవే. గగన్ ఇప్పటికైతే ఒక తామ్ర పతకాన్ని మాత్రం అందించాడు. గతంలో హాకీ లో బంగారు పతాకం గ్యారంటీ అన్నట్లు ఉండేది. ఇప్పుడలాంటి…