చదువు కోసం అడుక్కున్న ఐశ్వర్య, సమాజం బతికేఉందని నిరూపించిన దాతలు

కడుపు చూపిస్తూ అడుక్కునే భిక్షకులు కోకొల్లలు. పిల్లల్ని భిక్షక వృత్తిలో దింపి లక్షలు, కోట్లు సంపాదించే మాఫియా ముఠాలకు కొదవలేదు. పదవులు, కాంట్రాక్టులు అడుక్కోవడం రాజకీయ నాయకులు, సూపర్ ధనికుల జన్మహక్కు. కానీ పొట్ట కోసం అడుక్కుంటున్న నాయనమ్మకి తెలియకుండా పక్కనే నిలబడి చదువుకోసం రహస్యంగా సహాయం కోరిన ఐదేళ్ల ఐశ్వర్య కధ ఎవరూ విని ఉండరు. మతి చలించి తనను వదిలి వెళ్ళిపోయిన అమ్మ కోసమేనేమో తెలియదు గానీ డాక్టరీ చదువుకోవాలన్న బలమైన కోరిక ఐశ్వర్యను…

నానా జాతుల సంస్కృతుల ప్రతిబింబాలు ఈ పెళ్ళిళ్ళు -ఫోటోలు

ఒక జాతి సంస్కృతిని ప్రతిబింబించే అంశాల్లో ముఖ్యమైనది పెళ్లి. చరిత్రలో కుటుంబ జీవనం స్ధిరపడ్డాక పెళ్లి వేడుకలకు ఎనలేని ప్రాముఖ్యత పెరిగిపోయింది. కాల క్రమంలో సంఘంలో హోదాను, ఆస్తుల గొప్పతనాన్నీ చూపుకోవడానికి పెళ్లి కూడా ఒక సాధనంగా మారినా, వివాహం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత మాత్రం పెరిగిందే గానీ తగ్గిపోలేదు. పెళ్ళిళ్ళు ఆడంబరాలకు వేదికలుగా మారి ఖరీదు పెరిగిపోవడం ఒక విపరిణామం. దానివల్ల మెజారిటీ పేద వర్గాలకు అవి అందుబాటులో లేకుండా పోయాయి. పెళ్లి అంటేనే ఒక…

ప్రభుత్వాలు కూడా ఖాఫ్ పంచాయితీలేనా? -కార్టూన్

“నిన్ను ఇప్పటికిప్పుడే బదిలీ చేసేశాం. ‘అవినీతి’ కులాన్ని నువ్వు గాయపరిచావు” వాద్రా భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించినందుకు హర్యానా లాండ్ రిజిష్ట్రేషన్ ఉన్నతాధికారి ‘అశోక్ ఖేమ్కా’ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దానికి హర్యానా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలే కారణమని ప్రభుత్వం ఇప్పుడు బొంకుతోంది. నాలుగు రోజుల క్రితం అధికారుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ‘విచక్షణాధికార హక్కు’ అని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అశోక్ బదిలీని సమర్ధించుకున్నాడు. బదిలీ పై విమర్శలు…

సోనియా అల్లుడి కేసులో ‘విచ్ హంట్’ మొదలు

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులో విచ్ హంట్ మొదలయింది. వాద్రా, డి.ఎల్.ఎఫ్ ల అక్రమ భూ దందా పై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసింది. ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం ఏమీ ఇవ్వడం లేదు. 21 సంవత్సరాల సర్వీసులో 43 బదిలీలు ఎదుర్కోవడం అధికారి నిజాయితీకి తార్కాణం గా నిలుస్తుండగా, వాద్రా అక్రమ ఆస్తులపై విచారణకు ఆదేశించిన సదరు అధికారిని ఉన్నపళంగా బదిలీ…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -2

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ట తీర్ధ ఒప్పుకోలు ఇక్కడ పరిగణిచాలి. ఆమె ఒప్పుకున్నది గనుక పరిగణించడం కాదిక్కడ. ఐరాస ఒప్పందం, సుప్రీం కోర్టు పరిశీలన, సామాజిక అధ్యయనవేత్తల లెక్కలు అన్నీ పరిగణిస్తే కృష్ట తీర్ధ ఒప్పుకోలు, పరిగణించవలసిన వాస్తవం అని గ్రహించవచ్చు. మంత్రి ఒప్పుకోలును పరిగణిస్తే భారత దేశ జి.డి.పి 2010 లో 1143 బిలియన్లు కాదు. దాని విలువ 1747 బిలియన్ డాలర్లు. ఇందులో 35 శాతం కేవలం గృహిణుల శ్రమనుండి…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -1

సెప్టెంబర్ మొదటివారంలో అకస్మాత్తుగా దేశ పత్రికలు, చానెళ్ళు వేతనంలేని ఇంటిపని గురించి మాట్లాడడం మొదలు పెట్టాయి. ఇంటి పని చేసినందుకుగాను భర్తల వేతనంలో కొంతభాగం భార్యలకు చెల్లించేలా చట్టం తెస్తామని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ తీర్ధ ప్రకటించడంతో వివిధ వేదికలపైన దేశవ్యాపితంగా చర్చలు మొదలయ్యాయి. మహిళా సంఘాలు, సామాజిక శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్ధల ఎజెండాల్లోనూ, డిమాండ్లలోనూ దశాబ్దాలుగా నలుగుతున్నప్పటికీ, పత్రికల సామాజిక బాధ్యతలో మాత్రం ‘ఇంటిపని వేతనం’ పెద్దగా చోటు సంపాదించలేకపోయింది.…

అమరనాధ్ హిందూ భక్తి యాత్రను మోసేది కాశ్మీర్ ముస్లింలే -ఫోటోలు

కాశ్మీరీ జాతి స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పరితపించే కాశ్మీరీలను వేర్పాటువాదులుగా ముద్ర వేసి ద్వేషించడం హిందూ మతోన్మాదులకు పరిపాటి. తమ వర్తమానం, భవిష్యత్తు తమకే అప్పజెప్పాలని కోరే కాశ్మీరీ యువకులను టెర్రరిస్టులని చెప్పి కరకు తుపాకులకు బలి చేయడం భారత మిలట్రీ దశాబ్దాలుగా సాగిస్తున్న దుశ్చర్య. హిందూ మతోన్మాదం తమ ప్రజాస్వామిక ఆకాంక్షలపై విద్వేషం వెళ్లగక్కుతున్నప్పటికీ అమర్ నాధ్ హిందూ భక్తి యాత్రీకులను కాశ్మీరీ యువతే తమ భుజస్కందాలపై మోసి గమ్యం చేర్చే సంగతి చాలా…

ఈ దళిత మహిళల ఆత్మగౌరవం మహోన్నతం

భారతదేశ ప్రతిష్ట, ఆత్మగౌరవాలు దేశంలోని కోట్లాది శ్రమజీవుల్లో ఉన్నాయి తప్ప డాలర్ల కోసం దేశ సరిహద్దులు దాటడానికి అవలీలగా సిద్ధపడేవారిలోనో, తెల్లరాజ్యాల పౌరసత్వం కోసం అర్రులుచాచే బుద్ధి జీవుల్లోనో లేదని దళిత మహిళలు అక్కు, లీల లు చాటి చెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల పౌరసత్వం సంపాదిస్తేనే ప్రపంచాన్ని జయించినంత సంబరపడే కొద్ది బుద్ధుల అల్పజీవులు, దశాబ్దాల బెత్తెడు వేతన జీవనంలోనూ నిలువెత్తు ఆత్మ గౌరవాన్నీ త్యజించలేని అక్కు, లీలలను చూసి నిష్కళంక హృదయాలతో సిగ్గుపడవచ్చు. లేదంటే…

లెట్రిన్ లు కడిగే ఈ దళిత మహిళల నెలజీతం 15/-

అక్కు, లీల అనే ఇద్దరు దళిత మహిళలు 42 సంవత్సరాలుగా లెట్రిన్ లు కడుగుతున్నారు. వీరి నెల వేతనం అప్పుడూ, ఇప్పుడూ 15 రూపాయలే. కోర్టుకి వెళ్ళినందుకు ఆ 15 రూపాయలు కూడా చెల్లించడం మానేశారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హై కోర్టు, చివరికి సుప్రీం కోర్టు కూడా మహిళలకు అనుకూలంగా తీర్పులిచ్చి వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించాయి. కోర్టు ధిక్కారం నోటీసులు అందుకున్నాక కూడా, తీర్పులను అమలు చేయకపోగా, రిటైర్ మెంట్ వయసుకి…

దేశ దేశాల్లోని రైతు భాష ‘శ్రమే’ -ఫోటోలు

ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా రైతు కూలీలకి తెలిసిన భాష ‘శ్రమ’ ఒక్కటే. కొండలనుండి గడ్డిమోపులు దింపే స్విస్ రైతయినా, జొన్న చేలో కలుపు తీసే సత్నాపూర్ పేద రైతయినా వొళ్ళు వంచి రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించవలసిందే. ఇండియానాలో బ్లూ బెర్రీ ని తుంచి పోగు చేసే పెద్దా పిన్నా అయినా, బోర్డీక్స్ (ఫ్రాన్స్) లో ద్రాక్ష గుత్తుల్ని తెంచే ఆడా మగా అయినా సిగలు ముడేసి, నడుం బిగించి చెమట చుక్కలతో పుడమితల్లిని…

కేంద్ర మంత్రి జైస్వాల్ కి ముసలి భార్యపై మోజు తగ్గిందట!

కేంద్ర బొగ్గు మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ తానింకా ప్రాచీన యుగాల్లోనే మగ్గుతున్నానని చెప్పుకున్నాడు. వివాహ బంధాన్ని క్రికెట్ మ్యాచ్ తోనూ, భార్యలని కాలక్రమేణా మోజు తగ్గిపోయే విజయాలతోనూ పోల్చి తన ఫ్యూడల్ బుద్ధి చాటుకున్నాడు. వయసు పెరిగిన భార్యలపై మోజు కోల్పోయే పురుష పుంగవుల వక్రబుద్ధికి ఆమోద ముద్ర వేసేశాడు. భార్య అంటే మనసు, మెదడు, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ కాదనీ, కేవలం మగ శరీరాలకి సుఖాల్ని పంచే మాంసపు ముద్దలేననీ ‘మనసులో మాట’ బయట పెట్టాడు.…

మిమ్మల్నీ, దేశాన్నీ దేవుడే కాపాడాలి, కేంద్రంతో సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. జడ్జిలకు ఇంటి సౌకర్యం కల్పించాలన్న రూల్ ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించింది.  వాటర్ ట్రిబ్యునల్ లో సభ్యులైన జడ్జిలకు ఢిల్లీలో ఇంటి సౌకర్యం కల్పించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వాన్ని దేవుడే కాపాడాలని ఆకాంక్షించింది. ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉన్నందుకు దేశాన్ని కూడా దేవుడే కాపాడాలని ప్రార్ధించింది. ఇళ్ళు ఇవ్వడం ఇష్టం లేకపోతే వాటర్ ట్రిబ్యూనళ్ళకు జడ్జిలను సభ్యులుగా నియమించే చట్టాన్ని రద్దు చేయాలని కోరింది. “రూల్స్ ప్రకారం ఇంటి సౌకర్యానికి వారు…

ఉన్నత విద్యకు చేరుతున్న ఎస్.సిలు 10 శాతమే -ప్రభుత్వ సర్వే

షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలనుండి యూనివర్సిటీ లాంటి ఉన్నత చదువుల వరకూ రాలేకపోతున్నారని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జరిపిన సర్వేలో తెలిసింది. ఇతర వెనుకబడిన కులాల విద్యార్ధులు వారి జనాభా దామాషాలోనే ఉన్నత స్ధాయి చదువుల వరకూ రాగలుగుతున్నారనీ, కానీ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన విద్యార్ధులలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నతస్ధాయి చదువులకు చేరగలుగుతున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ విడుదల చేసిన సర్వే నివేదిక తెలిపింది.…

12 మృగాలు దళిత బాలికపై అత్యాచారం చేసి, వీడియో తీసి…

మృగాలు సైతం చీదరించుకునే మానవ మృగాల అకృత్యం హర్యానాలో వెలుగు చూసింది. కోరిక తీర్చమన్న మృగ సమానుడి వికృత తృష్ణను నిరాకరించినందుకు 11 మంది సో కాల్డ్ అగ్రకుల మృగాలబారిన పడి సామూహిక అత్యాచారానికి గురయింది. వేంపైర్ రక్తం అవసరం లేని తోడేళ్ళు తమ నీచ కృత్యాన్ని వీడియో తీసాయి. అత్యాచారం విషయం బైటికి చెబితే వీడియో అందరికీ పంచుతామని, చంపేస్తామనీ బెదిరించాయి. ఫలితంగా 16 సంవత్సరాల దళిత బాలిక అత్యాచారం గురించి కుటుంబానికి కూడా చెప్పుకోలేక…

భేదాభిప్రాయాలు సహజం, సత్యాన్వేషణే అంతిమ లక్ష్యం!

(ఇది చందుతులసి గారి వ్యాఖ్య. మరో వ్యాఖ్యాత చందు గారితో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయం. సమస్యను విభిన్న కోణంలో చూస్తారని చందుగారిని అభినందిస్తూ, భేదాభిప్రాయాలను ఎలా చూడవచ్చో, చూడాలో చెప్పిన అమూల్యాభిప్రాయం.  నచ్చని అభిప్రాయాలను కూడా గౌరవంగా ఎలా చూడవచ్చో క్లుప్తంగా ఈ నాలుగు మాటలు వివరిస్తున్నాయి. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ మరింత వెలుగు కోసం టపాగా మారుస్తున్నాను. -విశేఖర్)                        ***                                           ***                                             *** మనందరికీ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది.…