‘దేవతా స్త్రీలు’ ఎస్.సి, ఎస్.టి ల్లోనే ఎక్కువ -సెన్సస్

“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” తాము స్త్రీలను దేవతలుగా కొలుస్తామని చెప్పుకోడానికి హిందువులు చెప్పుకునే మాట ఇది. కానీ ఈ సూత్రాన్ని వాస్తవంగా ఆచరిస్తున్నది నాలుగు హిందూ వర్ణాలలో లెక్కకు రాని అవర్ణాల జనమే అని తాజా జనాభా లెక్కల ద్వారా తేలింది. హిందువుల్లో ‘ఇతరుల’ కంటే ఎస్.సి, ఎస్.టి ల్లోనే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్నదని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. పిల్లల్లో చూసినా, పెద్దల్లో చూసినా, మొత్తంగా చూసినా సవర్ణ హిందూ…

అగ్రరాజ్యాన్ని వణికించిన శాండి: ఏడాది తర్వాత… -ఫోటోలు

మిన్ను మన్ను ఏకం చేసే పెను తుఫాను ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసి పోయాక భారత దేశంలో పరిస్ధితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం నుండి సాయం అందే దారి లేక జనం ఎప్పటిలాగా కష్టాలను ఈదడం ప్రారంభిస్తారు. వారికి తుఫాను తర్వాత ఏ పరిస్ధితి ఉంటుందో దానికి ముందు కూడా దాదాపు అదే పరిస్ధితి కనుక ఒక ఎదురు దెబ్బ తగిలిందని సమాధానం చెప్పుకుని జీవన పయనంలో సాగిపోతారు. వారి నష్టాన్ని రెండింతలు చేసి చెప్పుకునే పాలక…

విభజన గీతా మకరందం

-రచన: పైడి తెరేష్ బాబు (పైడి శ్రీ) మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి అపార్థా! గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము. రథము…

కారుతోలే హక్కుకోసం సౌదీ మహిళల పోరాటం

ప్రజల చైతన్యం ‘వెర్రి’ తలలు వేస్తే తన బతుకు ఏమవుతుందో సౌదీ రాచరికానికి బాగానే తెలుసు. ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత కలిగిన అమెరికా తోడు నిలవగా రాచరిక ప్రజాస్వామ్యం అనబడే విచిత్ర వ్యవస్ధను నెట్టుకొస్తున్న సౌదీ రాచరికానికి మహిళల ‘గొంతెమ్మ’ కోరికల పట్ల ఈ మధ్య మహా దిగులు పట్టుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ‘Women2Drive’ ఉద్యమాన్ని అరెస్టులతో అణచివేసిన సౌదీ ప్రభుత్వం అది మళ్ళీ తలెత్తడంతో గంగ వెర్రులెత్తుతోంది. సోషల్ నెట్ వర్క్…

విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు

రచన: తెరేష్ బాబు పైడి (పైడిశ్రీ) “బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!” అపార్థా…! ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము] ***                ***                *** కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి! జీవస్య ఎంజీవం…

ఆ గ్రామాలకు సూర్యరశ్మి ఇచ్చేది అద్దాలే -ఫోటోలు

నార్వే, ఇటలీ లలో ఉన్న రెండు గ్రామాలకు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. మిగిలిన ఆరు నెలలూ వారు చీకటిలో మగ్గాల్సిందే. ఆ రెండు గ్రామాలూ లోతైన లోయల్లో ఎత్తైన కొండలతో చుట్టుముట్టబడి ఉండడమే దానికి కారణం. వణికించే చలికి తోడు సూర్యరశ్మి లేకపోవడం ఆ గ్రామాలకు శాపంగా మారింది. ఈ సమస్యకు వారు ఓ వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. కొండలపై పెద్ద పెద్ద ఉక్కు అద్దాలు అమర్చి సూర్య రశ్మిని గ్రామాలపైకి పరావర్తనం…

అంగారుకుడిపై బంగారం తవ్వకాలు ట్రై చేస్తే! -కార్టూన్

రాజకీయ నాయకుడు: ప్రొఫెసర్, ఈ ఉపగ్రహ ప్రయోగంలో కొద్ది మార్పులు చేసి అంగారకుడి పైన బంగారం నిల్వలు ఉన్నాయో లేదో కనిపెట్టేలా చెయ్యగలమా? ప్రొఫెసర్ గారు నోరు తెరిచారు. ***          ***          *** భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) అంగారక గ్రహాన్ని చుట్టి రావడానికి PSL-XL ఉపగ్రహాన్ని పంపే ఏర్పాట్లలో చురుగ్గా ఉంది. వాస్తవానికి అక్టోబర్ 28 తేదీన ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రయోగం కోసం పసిఫిక్ మహా సముద్రంలో టెర్మినల్…

కేంద్ర ప్రభుత్వాన్ని పరుగెత్తిస్తున్న స్వామీజీ బంగారం కల

‘ఎద్దు ఈనింది అంటే దూడను కట్టెయ్యి’ అన్నాట్ట. మన జియోలాజికల్ సర్వే, ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ తీరు చూడబోతే అలాగే ఉంది. ఒక ఆలయ పూజారి తనకు రాజు కలలో కనిపించి ఫలానా చోట బంగారం దాచి పెట్టానని చెప్పాడని చెప్పడంతోటే పలుగూ, పారా పట్టుకుని బయలుదేరిన జి.ఎస్.ఐ, ఎ.ఎస్.ఐ శాస్త్రవేత్తలను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాకుండా ఉంది. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ కు దాదాపు 150 యేళ్ళ ఘన చరిత్ర ఉన్నది. చరిత్ర…

ముస్లిం ప్రార్ధనల్లో క్రమ శిక్షణే వేరు -ఫోటోలు

ముస్లిం మతావలంబకుల ప్రార్ధనలో క్రమ శిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒంటరిగా ప్రార్ధించినా / నమాజు చేసినా లేదా వందలు, వేలు, లక్షల మంది ప్రార్ధనల్లో పాల్గొన్నా వారు క్రమ శిక్షణ తప్పరు. బహుశా క్రైస్తవ మత ప్రార్ధనల్లో కూడా క్రమ శిక్షణ ఉంటుందనుకుంటాను. క్రమ శిక్షణ అంటే నా ఉద్దేశ్యం హంగూ, ఆర్భాటాలు, శబ్దం, హడావుడి ఇత్యాదులు ఉండవని. ఇవే కాకుండా ఒక వరుస వెనుక మరొక వరుసలో ఎవరూ చెప్పనవసరం లేకుండానే, నిర్వాహకులు అనేవారి అవసరం…

డబ్బు పరుపు కల తీర్చుకున్న మార్క్సిస్టు కాంట్రాక్టర్

అవటానికి ఆయన మార్క్సిస్టు పార్టీ నాయకుడు. ఆయన కలలు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతాయి. బాగా డబ్బు సంపాదించాలని, సుఖంగా బతకాలనీ దాదాపు అందరూ కనే కలే కావచ్చు. కానీ సమాజాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నవారు ఎలాంటి కలలు కనాలి? విప్లవం వచ్చేసిందన్న కల కాకపోయినా కనీసం విప్లవోద్యమం పురోగమిస్తోందన్న కల లేదా కోరిక కలిగి ఉండాలి. కానీ త్రిపుర సి.పి.ఏం పార్టీ నాయకుడు మాత్రం ఏనాటికయినా డబ్బు పడక పై పడుకోవాలన్న కాలతో ఎన్నాళ్లుగానో వేగిపోతున్నాడట.…

బానిసత్వంలో 3 కోట్ల మంది, సగం ఇండియాలోనే

బానిస సమాజం అంతరించిందని గొప్పగా చెప్పుకుంటాం. అది నిజం కాదన్న చేదు నిజం మనం అంగీకరించాల్సిందే. వర్తమాన ప్రపంచంలో 3 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ‘గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013’ (జి.ఎస్.ఐ 2013) సర్వేలో తేలింది. గత సంవత్సరం సర్వే చేసిన ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎల్.ఓ) బానిస బతుకులు నెట్టుకొస్తున్నవారి సంఖ్య 2.1 కోట్లని తెలిపింది. వాస్తవం దానికంటే ఘోరమని జి.ఎస్.ఐ 2013 సర్వేలో స్పష్టం అయింది. ప్రపంచంలోని మొత్తం బానిసత్వంలో సగం బానిసత్వాన్ని…

ఈ జైపూర్ బాల మాంత్రికుడి మేజిక్ చూడండి -వీడియో

జైపూర్ లో స్వదేశీ, విదేశీ టూరిస్టులను తన కనికట్టుతో కట్టి పడేస్తున్న బాల మాంత్రికుడి చిట్టి పొట్టి మాయాజాలం చూడండి. భుజానికి గుడ్డ సంచి తగిలించుకుని, అందులో కాసిన్ని మేజిక్ సరంజామా నింపుకుని తెచ్చి టూరిస్టులను ఆకర్షిస్తూ పొట్ట పోసుకోవడం ఈ బాలుడి దినచర్యలా కనిపిస్తోంది. బాలుడి మేజిక్ అభినందనీయమే అయినా ఇంత చిన్న వయసులో తన పొట్ట తానే నింపుకోవలసి రావడం ఈ బాల మాంత్రికుడి వెనుక దాగిన ఒక విషాధం. మన పుణ్య భూమిలో…

దతియా దసరా తొక్కిసలాట, 115 పైగా దుర్మరణం -ఫోటోలు

దుర్గాష్టమి రోజున మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 115 మందికి పైగా దుర్మరణం చెందడం ఏ విధంగా చూసినా అనివార్యం కాదు. ఇదే చోట ఏడేళ్ళ క్రితం జరిగిన తొక్కిసలాటలో పాతిక మందికి పైగా చనిపోయారు. రెండు రాష్ట్రాల నుండి జనం ఈ చోటికీ వస్తారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘోరమైన రీతిలో భద్రతా చర్యలు తీసుకోవడం బట్టి వారికి ప్రజల పట్ల ఉన్న బాధ్యత ఏపాటిదో అర్ధం అవుతోంది. వెనుకబడిన…

మై గుడ్ నెస్! ఇవి శిల్పాలంటే నమ్మక తప్పదు -ఫోటోలు

మానవుడి సృజన శక్తికి అంతెక్కడ అంటే చెప్పడం కష్టం అనుకుంటాను. ఎక్కడ హోమో సెపియన్, ఎక్కడ సెల్యులార్ ఫోన్?! మనిషి సాధించిన సాంకేతిక పరిజ్ఞానం ఒక ఎత్తైతే సంస్కృతీ, సృజనల పరంగా అతను అధిరోహించిన అత్యున్నత శిఖరాలు మరో ఎత్తు. ఈ శిల్పాలే చూడండి. ఇవి శిల్పాలంటే నమ్మగలమా? వాస్తవత్వానికి ఏమాత్రం తేడా చూపకుండా చిత్రాలు గీయడమే అద్భుతం అనుకుంటే ఏకంగా శిల్పాలకూ మనిషికీ తేడా లేకుండా సృజించడం పరమాద్భుతం కాదా? దీనిని ‘హైపర్ రియలిస్టిక్ స్కల్ప్ఛర్’…

ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు

ఢిల్లీ పోష్ లోకాలిటీ ‘వసంత్ కుంజ్’ లో ఒక మైనర్ బాలిక ను పనిలో పెట్టుకుని హింసించిన కేసులో నిందితురాలికి కోర్టు బెయిలు నిరాకరించింది. నోయిడాలో ఒక పేరు పొందిన బహుళజాతి సంస్ధలో కమ్యూనికేషన్ విభాగాని అధిపతిగా పని చేస్తున్న వందన ధీర్ కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల జార్ఖండ్ బాలిక ఆర్తనాదాలు విని పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ, పోలీసుల సాయంతో బాలిక…