అమెరికన్లు: ఉక్రెయిన్ ఎక్కడో తెలియదు, దాడికి రెడీ

ఉక్రెయిన్ ఎక్కడ ఉంది అనడిగితే అమెరికన్లకు తెలియదు. కానీ అమెరికా జాతీయ భద్రత పేరుతో మిలట్రీ దాడి చేయడానికి మాత్రం మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అమెరికాకే చెందిన యూనివర్శిటీల ప్రొఫెసర్ల బృందం ఒకటి జరిపిన సర్వేలో ఈ సంగతి తెలిసింది. యువకుల దగ్గర్నుండి పెద్దవారి దాకా ప్రపంచంలో ఉక్రెయిన్ ఎక్కడుందో గుర్తించమంటే సరిగ్గా గుర్తించినవారు నూటికి 16 మంది మాత్రమే. ఉక్రెయిన్ ని సరిగ్గా గుర్తించినవారు మిలట్రీ దాడికి వ్యతిరేకత వ్యక్తం చేయగా అసలు చోటుకు…

సూర్యనెల్లి పిల్లకు న్యాయం, 24 మందికి శిక్షలు

ఎట్టకేలకు సూర్యనెల్లి అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగింది. కానీ న్యాయం దక్కడానికి అప్పటి బాలికకు, ఇప్పటి సమాజ వంచితకు 18 యేళ్ళ కాలం పట్టింది. మధ్యలో ఎన్నో కుట్రలు మరెన్నో మలుపులు ఆమెను, ఆమె కుటుంబాన్ని పట్టి పల్లార్చాయి. ఆమెను ఎలాగైనా దారికి తెచ్చుకోవడానికి, పెద్దవారితో పెట్టుకున్నందుకు తగిన ఫలితం అనుభవించేలా చేయడానికి జరగని ప్రయత్నం లేదు. ఆ పిల్ల తండ్రి అన్నట్లు ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం జరగనట్లయితే తన కూతురి పట్ల కోర్టులు ఇంత…

అక్కడ హోలీ హిందువులది కాదు క్రైస్తవులది -ఫోటోలు

అమెరికాలోని యుటా (Utah) రాష్ట్రంలో హోలీ పండుగ ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ హోలీ జరుపుకునేది హిందువులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. క్రైస్తవ మతంలో ఇటీవల శతాబ్దాల్లో ఒక శాఖగా అవతరించిన మర్మోన్లు ఇక్కడ హోలీని పెద్ద ఎత్తున జరుపుకుంటారట. ఈ అలవాటు ఎప్పటినుండి ఆచరణలో ఉన్నదో తెలియదు గానీ ఈ సంవత్సరం మాత్రం భారీ సంఖ్యలో మర్మోన్లు హోలీ జరుపుకున్నారు. అది కూడా శ్రీ శ్రీ రాధా కృష్ణ ఆలయం దగ్గర! మార్చి 29 నుండి…

ఈ శ్రామిక మహిళ, మౌనంగానే… ఎదిగింది -కత్తిరింపు

వ్యవసాయాన్ని కనిపెట్టింది మహిళలని సామాజిక చరిత్రకారులు చెబుతారు. ఈ విషయంలో ఎవరికన్నా అనుమానం ఉంటే ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు మండలం జిన్నెల గూడెం నివాసి సాయమ్మను చూస్తే తమ అనుమానాన్ని ఇట్టే పోగొట్టుకుంటారు. సొంత పొలంలో వ్యవసాయం చెయ్యడమే కాకుండా సొంత పనిలేనప్పుడు కూలీకి కూడా వెళ్ళే సాయమ్మ తన జీవితాన్ని శ్రమకే అంకితం చేసింది. ఒంటరి వ్యవసాయంతో సోదరి కుటుంబాన్ని సైతం ఆదుకుంటున్న సాయమ్మ సాహసిక జీవనాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి విలేఖరి ఎం.ఏ.సమీర్ అభినందనీయులు.…

చందోగ్రఫి: లండన్ లో తెలుగుదనం -ఫోటోలు

లండన్, న్యూయార్క్ నగరాల్లో ఓ తెలుగు కుర్రాడు తన కెమెరాలో బంధించిన అద్భుత దృశ్యాలివి. తనను తాను అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పోలేపెద్ది చంద్ర శేఖర్ (ఈ బ్లాగ్ లో వ్యాఖ్య ద్వారా) చెప్పుకున్నారు. కానీ ఆయన తీసిన ఈ ఫోటోలు చూస్తే మాత్రం ఆయన అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటే నమ్మ బుద్ధి అయ్యేలా లేవు. చేయి తిరిగిన (కన్ను తిరిగిన అనాలేమో!) ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోలివి అని చెప్పినా ఇట్టే నమ్మొచ్చు. ఈ ఫొటోల్లో మనుషులు…

సోనీ ప్రపంచ ఫోటోగ్రఫి పోటీ -ఫోటోలు

సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల ఫలితాలను వారం రోజుల క్రితం ప్రకటించారు. ప్రస్తుతానికి మూడు విభాగాల ఫలితాలను విభాగాల వారీగా ప్రకటించారు. మూడు కేటగిరీలకు (ఓపెన్, యూత్, నేషనల్) గానూ ప్రపంచం నలుమూలల నుండి ఎంట్రీలు వచ్చాయి. మూడు విభాగాలకు కలిపి మొత్తం 70,000 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. మొత్తం మీద (ఓవరాల్) విజయులు ఎవరో ఏప్రిల్ 30 తేదీన మాత్రమే ప్రకటిస్తారు. ఈ లోపు వివిధ విభాగాలలో గెలుపొందిన వారి వివరాలు ప్రకటించారు. అనేక…

చే గువేరా: ఒకటో నెంబరు హెచ్చరిక

(ఈ రచనను మిత్రులు తిరుపాలు గారి ద్వారా ఫేస్ బుక్ లో చూశాను. ఇది అరుణ్ సాగర్ గారి రచన. షేర్ చేయాలనీ, ప్రచారం చేయాలనీ ఆయనే కోరినందున ప్రత్యేక అనుమతి అవసరం లేదన్న భరోసాతో అడగకుండానే ప్రచురిస్తున్నాను. -విశేఖర్) డియర్ చె. మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైటు తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికి కొత్తగా పరిచయమవుతావనీ నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావనీ నువ్వు…

తమ్ముడూ పవనూ, నీ కాల్మొక్త!

ప్రముఖ జర్నలిస్టు జి.ఎస్.రామ్మోహన్ గారి ఫేస్ బుక్ ఖాతా నుండి దీన్ని సంగ్రహించాను. కొత్త ఓట్ల బిచ్చగాడు పవన్ కళ్యాణ్ గారి సర్కస్ ఫీట్లను సంక్షిప్తంగా వివరిస్తోంది. ********* తమ్ముడూ పవనూ, ఏమన్నా జేస్కో, ఎవురితోనన్నా కలువ్‌, నీ ఇష్టం. కానీ చే బొమ్మ పక్కన మాత్రం మోదీని పెట్టమాకయ్యా! నీకు పుణ్యముంటది. బాంచెన్‌ నీ కాల్మొక్త! భగత్‌ సింగ్‌ పక్కన కూడా వద్దయ్యా! పాటలెన్నైనా పాడుకో! గబ్బర్‌ సింగ్‌ పాటలే పాడుతవో, గద్దర్‌ పాటలే పాడుతవో…

Z++ సెక్యూరిటీ -నిజం ఫోటో

ఈ ఫోటో ఫేస్ బుక్ లో చూశాను. ఈ కుక్కలకు తాము కాపలా కాస్తున్నది ఏ.టి.ఎం కి అని తెలుసో లేదో గానీ ఫోటోకి భలే విలువ తెచ్చి పెట్టాయి. లేకపోతే ఆ పక్కనే ఉన్న ‘అంబికా వైన్స్’ కి కాపలా కాస్తున్నాయా? కొంపదీసి ఇవి తాగుబోతు కుక్కలు కావు కదా? కాపలా కాస్తున్నాయో, పడిగాపులు పడుతున్నాయో తెలిస్తే అవి ఏ కుక్కలో తెలుస్తుంది. కాపలా కాస్తే గనక ఎ.టి.ఎం కి కాపలా కాస్తున్నట్లు. పడిగాపులు పడుతుంటే…

ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు

అనూహ్య పరిస్ధితుల్లో అదృశ్యం అయిన మలేషియా విమానం కోసం సముద్రం జల్లెడ పడుతున్నా ఇంకా ఫలితం దక్కలేదు. మొత్తం 10 దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆలవాలం అయిన దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాల హక్కులపై నెలకొన్న తగాదాలను పక్కనబెట్టి మరీ ఆయా దేశాలకు చెందిన మిలట్రీ విమానాలు, సివిల్ ఏవియేషన్ విభాగాలు, సముద్ర రక్షక బలగాలు, తీర రక్షక బలగాలు (కోస్ట్ గార్డ్)  గాలింపు జరుపుతున్నాయి.…

మలేషియా ప్రమాదం: అది విమాన ఇంధనం కాదు

మలేషియా విమాన ప్రమాదం మరింత మిస్టరీలోకి జారిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో కనపడిన రెండు భారీ చమురు తెట్లు విమాన ఇంధనంకు సంబంధించినవి కావని పరీక్షల్లో తేలింది. వియత్నాం నావికా బలగాలకు కనపడ్డాయని చెబుతున్న విమాన శిధిలాలు కూడా వాస్తవానికి ఎక్కడా కనపడలేదని తెలుస్తోంది. దీనితో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చుట్టూ మరింత మిస్టరీ అల్లుకున్నట్లయింది. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రయాణీకులు మలేషియా దేశస్ధులు కారని, చైనా…

ప్రశ్న: భారత్ విదేశాలపై దాడి ఎందుకు చేయలేదు?

కె.బ్రహ్మయ్య: 1) ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ESPECIALLY FOR MUSLIMS INVADERS. 2) గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు? IS THERE NOT ENOUGH STRENTH FOR INDIA? సమాధానం: ప్రాచీన క్షాత్ర పరంపర…

హిందు పండగలతో పోలిన కేధలిక్ కార్నివాల్ -ఫోటోలు

భారత దేశంలో పండగలు సాంస్కృతిక కలయికలకు వేదికలుగా నిలుస్తాయి. శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం, వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం, దీపావళి రోజున బాణసంచా పేలుళ్లు, సంక్రాంతి సంబరాల్లో పంటలు, అల్లుళ్ళ సందడి మొదలయినవన్నీ భారత దేశంలో సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండగలు కాకుండా వివిధ నదుల వద్ద జరిగే పుష్కరాలు, కుంభమేళాల సంగతి చెప్పనే అవసరం లేదు. రోజువారీ శ్రామిక జీవితం నుండి ఆటవిడుపుగానూ, పూర్వీకులు సాధించిన విజయాలను సెలెబ్రేట్ చేసుకునే రోజులుగానూ…

ఎవరు దేవుడు… ఎవరు బండ…? -కవిత

‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ శీర్షికన ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ అధినేత రాధాకృష్ణగారు వివిధ రంగాల్లో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి విదితమే. ఈసారి ఆయన సినీ నటుడు రంగనాధ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అదే ఇంటర్వ్యూను ఈ రోజు (మార్చి 3) ఆంధ్ర జ్యోతి పత్రికలో ప్రచురించారు. ఆయన ఇంటర్వ్యూ చూడలేదు. కానీ  పత్రికలో ఇంటర్వ్యూ చదివాను. ఆయన ఇంటర్వ్యూ గురించి కాదు గానీ అందులో ఆయన రాసిన కవిత నాకు భలే నచ్చేసింది. కవిత…

కొత్త కంప్యూటర్ కనిపెట్టిన అస్సాం 10 క్లాస్ విద్యార్ధి

అస్సాం కు చెందిన పదో తరగతి విద్యార్ధి అఫ్రీద్ ఇస్లాం సరికొత్త కంప్యూటర్ కనిపెట్టి సంచలనం సృష్టించాడు. హార్డ్ డిస్క్ కు బదులుగా మైక్రో చిప్ ని వినియోగించడం ఈ కొత్త కంప్యూటర్ విశిష్టత. జర్మనీకి చెందిన ఒక కంపెనీ అఫ్రీద్ కు సహకారం అందించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు తనకు 7వ తరగతిలో ఇచ్చిన కంప్యూటర్ తో సమస్యలు ఎదుర్కొన్న అఫ్రీద్ ఆ సమస్యలే పునాదిగా కొత్త తరహా కంప్యూటర్ తయారీకి ఆలోచన మొదలు పెట్టి మూడేళ్లలో…