కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా జవాబులు -ఈనాడు

సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా జవాబు తీరు మలుచుకునే అంశాన్ని ఈ రోజు ఈనాడు పత్రికలో వివరించాను. అధ్యయనం శీర్షికన వెలువడుతున్న వ్యాస పరంపరలో ఇది 3వది కాగా సివిల్స్ కొశ్చెన్ టాగ్స్ వివరణకు సంబంధించి రెండవది. బ్లాగ్ పాఠకులు ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి. జవాబు తీరు మలుచుకునేదెలా? పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో ఆర్టికల్ చదవాలంటే కింది బొమ్మపైన క్లిక్…

ఉత్తర కొరియా: ఓ యువ నియంత దృశ్య కధ

వర్తమాన చరిత్రలో నియంతృత్వం-ప్రజాస్వామ్యంల మధ్య సరిహద్దు రేఖ చెరిగిపోయి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనీ, సుదీర్ఘ ప్రజాస్వామ్యం అనీ చెప్పుకునే దేశాల్లో ప్రజల ప్రయోజనాలకు కాణీ విలువ కూడా లేదు. నియంతృత్వ ప్రభుత్వాలుగా సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలు ముద్రవేసిన దేశాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలకు కొదవలేని పరిస్ధితి. సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఇరాక్ దేశం అన్నీ విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది. చమురు వనరులను ప్రతి పైసాను దేశం దాటి పోనివ్వనందుకు సద్దాం హుస్సేన్…

షీలా ఇంటికి 31 ఏ.సిలు! -కార్టూన్

“బహుశా ఆమె ఢిల్లీ మొత్తాన్ని చల్లగా ఉంచాలని భావించి ఉంటారు!” ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసానికి ఏకంగా 31 ఏ.సి మిషన్లు అమర్చారట. పోనీ అంతటితో ఆగారా అంటే, లేదు. 31 ఏ.సిలతో పాటు 15 ఎయిర్ కూలర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్లు, 14 హీటర్లు కూడా షీలా ఇంటిలో అమర్చారు. ఇంతా చేసి ఆ ఇల్లు 4 పడక గదుల ఇల్లు. నాలుగు పడకగదుల ఇంట్లో ఇన్ని ఏ.సిలు, ఎయిర్ కూలర్లు…

ఈ దేశంలో బిచ్చగాళ్లూ ధనికులే -కార్టూన్

మేధావులు: ఈయన భోజనంలో రు. 15/- ల అన్నం, రు. 10/- ల పప్పు, రు. 5/0 ల ఉల్లి, రు. 5/- ల మసాలాలు ఉన్నాయి. కాబట్టి ఈయన దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్లే! *** ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ తాజాగా తన దరిద్ర ప్రమాణాల లెక్కలు విడుదల చేయడంతో దేశంలో పేదలు ఎంతమంది అన్న చర్చ మరోసారి రేగింది. సురేష్ టెండూల్కర్ లెక్క సరికాదని చెప్పిన రంగరాజన్ పట్టణ, గ్రామీణ దరిద్రం లెక్కని…

తిక్కవెధవలతో వాదన చేటు తెస్తుంది -వీడియో

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ఈ పద్యం ఎవరు రాశారో నాకు గుర్తు లేదు గానీ ఇప్పటికీ ఆచరణీయం అని మూర్ఖ, తిక్క శిఖామణులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు. అంతర్జాలం చాటు చూసుకుని తిక్క వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్న తల తిక్క వెధవల నుండి శాశ్వతంగా తప్పించుకునే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా ఫేస్ బుక్ లో యాదృచ్ఛికంగా…

స్వీయ దృక్పధం ఏర్పరుచుకునేదెలా? -ఈనాడు

ఈనాడులో చదువు పేజీలో మరో కొత్త సిరీస్ రాస్తున్నాను. ఈసారి రాజకీయార్ధిక దృక్కోణంలో సమాజాన్ని పరిశీలించడం గురించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ వ్యాసాల రచన ఉంటుంది. సిరీస్ లో మొదటి వ్యాసం ఈ రోజు (సోమవారం, జూన్ 30) ఈనాడు దినపత్రికలో ప్రచురితం అయింది. వ్యాసాన్ని నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి చదవచ్చు. ఈ లింకు ఈ వారం రోజులు మాత్రమే పని చేస్తుంది. మళ్ళీ వచ్చే…

భవనం కూలిన ఘటనలో హృదయవిదారక దృశ్యాలు -ఫోటోలు

నిర్మాణ కాంట్రాక్టర్ల అత్యాశ ఫలితంగా చెన్నైలో నిర్మాణంలో ఉండగానే 11 అంతస్ధుల భవనం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 7గురు నిర్మాణ కూలీలు మరణించారని నిన్న ప్రకటించగా, ఈ రోజు మృతుల సంఖ్య 11కు పెరిగింది. భవన శిధిలాల కింద అనేకమంది చిక్కుకుని ఉన్నారని భయపడుతున్నారు. శిధిలాల సందుల నుండి చేతులు చాచి తమను కాపాడమంటూ బాధితులు వేడుకుంటున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. తలవరకు కనిపిస్తున్న బాధితులు కొందరయితే, చేయి మాత్రమే కనిపిస్తూ కాపాడమని చేస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తున్నది మరి…

ప్రశ్న: పదహారణాల తెలుగమ్మాయి అంటే?

నిఖిల్: ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలీదు, కానీ మీకు తెలుసనుకుంటున్నాను. తెలుగు సాంప్రదాయంలో ఉన్న ఆడపిల్లని పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం కదా, అంటే ఏమిటి? మనం తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడటానికి నామోషి ఎందుకు? సమాధానం: తెలుగు సంస్కృతిని అచ్చంగా, కల్తీ లేకుండా, ఇతర సంస్కృతుల ప్రభావం లేకుండా ప్రతిబింబించే అమ్మాయిని ఊహించుకుని ఆమెకు పదహారణాల విలువ కట్టారు. మీరు చెబుతున్నదే ఆ విలువ. అణ విలువ భిన్నంలో (1/16) ఉంటుంది. కానీ పదహారు…

పనస పండు దొంగ కోసం పోలీసుల ఉరుకులు

‘రాజు గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అని సామెత. మన ఎం.పిలు, ఎమ్మేల్యేలు ఆధునిక రాజులు కదా, వారు తలచుకున్నా అదే పరిస్ధితి సంభవించగలదు. లేకపోతే ఎం.పి గారి ఇంటి ఆవరణలోని పనస చెట్టు నుండి పనస పండ్లను దొంగిలించిన దొంగ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం, ఆధునిక అపరాధ పరిశోధన పద్ధతులన్నీ ప్రయోగించడం… ఎలా అర్ధం చేసుకోవాలి? ఎఎపి ప్రభుత్వం విదేశీ వ్యభిచార గృహాలపై దాడులు చేయమన్నా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగిన…

మొండి వినికిడి సమస్యా? ఐతే బసవనగుడికి రండి!

బసవన గుడి అంటే దేవుడి గుడి కాదు. బెంగుళూరులో అదొక ఏరియా. ఈ ఏరియాలో అద్భుతమైన చెవి (ENT) డాక్టర్ ఉన్నారు. ఈ టపాని ఇప్పుడు ఆయన ఆసుపత్రిలోని ఓ రూమ్ నుండే రాస్తున్నాను. పెద్దగా ప్రచార పటాటోపం జోలికి పోని డాక్టర్ మహదేవయ్య ఈ ఆసుపత్రిలో ప్రధాన డాక్టర్. చాలా పెద్దాయన. నాకు చిన్నప్పటి నుండి చెవి సమస్య ఉంది. గత పాతికేళ్ళ నుండి వినికిడి సమస్య కూడా ఉంది. ఈ పాతికేళ్లలో ఒకే స్ధాయిలో…

ఇండియాయే అందరికీ నేర్పింది -రష్యా టుడేలో ఓ వ్యాఖ్య

రష్యా టుడే పత్రిక ఈ రోజు (జూన్ 11, 2014) ఒక వార్త ప్రచురించింది. దాని ప్రకారం భూమి, చంద్రుల వయస్సు గతంలో ఊహించినదాని కంటే 6 కోట్ల సంవత్సరాలు ఎక్కువని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్య కుటుంబం ఏర్పడిన 10 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి, చంద్రుడు గ్రహాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో సేకరించిన Xenon ఐసోటోప్ లను పరిశోధించాక ఇది తప్పనీ సూర్య కుటుంబం ఏర్పడిన 4 కోట్ల సంవత్సరాలకే…

ఆపదలో స్త్రీని ఎందరు ఆదుకుంటారు? -ప్రయోగం (వీడియో)

“YesNoMaybe” అన్న పేరుతో ఓ ఫిల్మ్ మేకింగ్ సంస్ధ ఉంది(ట). ఆ సంస్ధ వాళ్ళు ఈ మధ్య ఒక ప్రయోగం చేశారు. ఢిల్లీ బస్సు అత్యాచారానికి వ్యతిరేకంగా లక్షలమంది దేశవ్యాపితంగా స్పందించారు. కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్లకార్డులు రాసుకుని ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోనైతే ఏకంగా పోలీసులతో యుద్ధమే చేశారు. అయితే నిజంగా ఒక స్త్రీ ఆపదలో ఉండి ఆర్తనాదం చేస్తే ఆమెను ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి “YesNoMaybe”…

బి.జె.పి ఎం.పిల మద్దతు: ఒకరు రేప్ కి, మరొకరు హత్యకి!

భారతీయ జనతా పార్టీ తరపున పార్లమెంటులో ప్రవేశించిన లోక్ సభ సభ్యులు ఒక్కొక్కరు తమ తమ నిజస్వరూపాలను బట్టబయలు చేసుకుంటున్నారు. బి.జె.పిని మితవాద భావాల పార్టీగా విశ్లేషకులు ఎందుకు చెబుతారో వారు తమ వెనుకబాటు భావాలను వెల్లడి చేసుకుంటూ వివరించి చెబుతున్నారు. ఒకరు యు.పిలో అత్యాచారానికి మద్దతుగా వచ్చి ములాయం పట్ల సానుభూతి ప్రకటిస్తే, మరొకరేమో శివాజీ, ధాకరేలను ఫేస్ బుక్ లో అవమానిస్తే తత్పరిణామాలు ‘సహజం’ అంటూ ముస్లిం టెకీ హత్యను సమర్ధించుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్…

ముస్లిం టెకీ హత్య: హిందూ రాష్ట్ర సేన ఘాతుకం

నరేంద్ర మోడి నేతృత్వం లోని హిందూ జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో సరిగ్గా వారం రోజులు పూర్తయింది. బి.జె.పి గానీ, మోడి గానీ అట్టహాసంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలులోకి వచ్చేదీ వివరాలేవీ ఇంకా వెల్లడి కానేలేదు. కాంగ్రెస్/యు.పి.ఏ అమలు చేసిన నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను మరింత దీక్షతో నిర్నిరోధంగా అమలు చేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు పెట్టుకున్న ఆశలను ప్రజలను మెప్పిస్తూ ఎలా నెరవేర్చవచ్చో తగిన ఐడియాలేవీ ఇంకా ప్రకటించబడనే లేదు.…

ఇడిగో, ఇంకో బూతోన్మాది!

ఏకంగా ఏడుకొండలవాడి నామాన్ని ధరించిన హిందూ బూతోన్మాది దురహంకారం ఇది! ఈ అక్కు పక్షి ఏదో వివరణాత్మకంగా వ్యాసం రాశాడట, దాన్ని ప్రచురించలేదని ఇతగాడికి ఉన్మాదం ఆవహించేసింది. మతోన్మాదం జనంలో కూడా ఎలాంటి ఫాసిస్టు ప్రేమికులను సృష్టిస్తుందో తెలియడానికి ఈ వింత పదార్ధం ఒక ఉదాహరణ! తిరుపాలు గారిని తిరు’పాల్’ అని రాసి శునకానందం పొందిన ఈ వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి పేరును మీ ఇష్టం వచ్చినట్లు మార్చి రాసే హక్కు మీకు ఎక్కడిది అని…