2జి కుంభకోణం: మంత్రివర్గంలో రాలిపడే తదుపరి తల కపిల్ సిబాల్?
2జి స్పెక్ట్రం కుంభకోణం ఫలితంగా కేంద్ర మంత్రివర్గం నుండి దొర్లిపడే తదుపరి తల విద్యా, టెలికం శాఖల మంత్రి కపిల్ సిబాల్‌ది కావచ్చనడానికి తగిన పరిణామాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. మాజీ టెలికం మంత్రి, డి.ఎం.కె పార్టీ నాయకుడు ఎ.రాజా, సి.బి.ఐ దర్యాప్తు ఫలితంగా జైలు పాలు కావడంతో ఆయన స్ధానంలో కపిల్ సిబాల్ టెలికం శాఖ బాధ్యతలు చేపట్టాడు. ఆయన వచ్చీ రావడంతోనే 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి) నివేదించినట్లు, కేంద్ర ప్రభుత్వం…