అమెరికన్లను ఇబ్బంది పెట్టడం ఆపాలని పాక్‌ని కోరిన అమెరికా
పాకిస్దాన్ లో ఉన్న అమెరికన్లను ఇబ్బంది పెట్టడం (harassment) ఆపాలని అమెరికా కోరింది. అమెరికా రాయబారుల కదలికలపై పాకిస్ధాన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని కూడా అమెరికా పాక్ ప్రభుత్వాన్ని కోరింది. లాహోర్ లో నివసిస్తున్న ఒక అమెరికన్‌ను తుపాకులు ధరించిన కొద్దిమంది కిడ్నాప్ చేసిన అనంతరం ఈ విజ్ఞప్తులు అందాయి. అమెరికా సీనియర్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ (ఒబామాతో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన రిపబ్లికన్) పాకిస్ధాన్ సైన్యం అధిపతి జనరల్ అష్‌ఫాక్…