గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి… -కార్టూన్

– ఏమైందీ, తొక్కిసలాటా? కాదు – చట్టం తనపని తాను చేసుకుపోయింది లేండి! – పాలక పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అంతా కట్ట గట్టుకుని 17 యేళ్ళ నాడు మేసిన గడ్డి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ సౌధాన్ని కూల్చేసే పెను భూతమై నిలిచింది. నితీశ్ కుమార్ (జెడి-యు), బి.జె.పి ల విడాకుల నుండి లబ్ది పొందాలని భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆశలు ప్రత్యేక సి.బి.ఐ కోర్టు తీర్పుతో ఒక్కసారిగా అవిరయ్యాయి. కోర్టు…

మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…

అందరూ దొంగలే, ఎవరికీ ఓటు వేయం -కార్టూన్

ఎన్నికల్లో ఓటు హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఒక తీర్పు ప్రకటించింది. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్ధులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉండాలనేది ఆ తీర్పు తాత్పర్యం. అభ్యర్ధులందరిని తిరస్కరించే హక్కు ఓటర్ కి ఉండాలనీ, అది కూడా భావ ప్రకటనా స్వేచ్చలో భాగమేననీ సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఇ.వి.ఎం మిషన్లలో ‘ఎవరూ కాదు’ అనే బటన్ చేర్చాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశిస్తున్నట్లు పేర్కొంది.…

హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు…

ఆహా రాహుల్! ఏమి మీదు నాటకంబు?

“కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు” ఇది మన రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనిక రాజకీయవేత్తలకు వర్తించేది మాత్రమే’ అన్న నిర్వచనం ఏమన్నా ఉన్నట్లయితే ఆయన చెప్పిందాంట్లో సందేహం అనేదే లేదు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమే హడావుడిగా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, మరోపక్క ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే, తమ పార్టీలోని మరోనేత ఆ…

స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2

మొదటి భాగం తరువాత……… కొమింట్ పత్రంలోని వివరాలు భయంకరమైన నిజాలని మనముందు ఉంచాయని ది హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. మన్ హట్టన్ (న్యూయార్క్) లోని ఐరాస భారత శాశ్వత కార్యాలయం ఎన్.ఎస్.ఏ టాప్ టార్గెట్లలో ఒకటి. ఇక్కడ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ఉప శాశ్వత ప్రతినిధి, ఒక మంత్రి, ఒక రాజకీయ సమన్వయకర్త, ఆరుగురు కౌన్సిలర్లు, ఒక కల్నల్ ర్యాంకులోని మిలట్రీ సలహాదారు, ఇంకా ప్రపంచ దేశాలతో ఇండియాకు ఉండే వివిధ సంబంధాలకు సంబంధించిన అనేకమంది…

జనరల్ వి.కె.సింగ్ విశ్రాంత కాలం తీరే వేరు -కార్టూన్

పదవీ విరమణ చేశాక ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విశ్రాంత కాలాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ జనరల్ వి.కె.సింగ్ పదవీ విరమణ చేశాక తన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరు మాత్రం ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఒకసారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే పక్కన కనిపిస్తారు. మరోసారి ఆర్మీ కుంభకోణాలపై గొంతెత్తుతారు. మరోసారేమో ఏకంగా బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తోనే వేదిక పంచుకుంటారు. జనరల్ వి.కె.సింగ్ ఎంజాయ్ మెంటు ఎలా ఉన్న దానివల్ల…

సి.బి.ఐ సుత్తితో బాది సానపెడితే, ఆ కత్తే వైకాపా -కార్టూన్

ఈ కార్టూన్ చూసి నవ్వని, కనీసం నవ్వుకోని వారు ఎవరన్నా ఉంటే వారికి ఏదో సమస్య ఉన్నట్లే అనుకోవాలి. ‘మాట తప్పని, మడమ తిప్పని’ వంశం అని చెప్పుకున్నవారు సోనియాగాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ ఇప్పించుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పక్క ఆరోపిస్తున్నారు. టి.డి.పి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి వై.ఎస్.ఆర్ భార్య వై.ఎస్.విజయ నిన్న సోనియాగాంధీకి ఫోన్ చేసి ‘బెయిల్’ ఇప్పించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారని ఆరోపించారు. అదే నిజమైతే…

పోల్: జగన్ బెయిలు దేనికి సూచన?

టి.వి ఛానెళ్ళు ప్రసారం చేస్తున్న వార్తల ప్రకారం కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన రెడ్డి జైలు నుండి విడుదల అయ్యారు. ఆయనకు స్వాగత సత్కారాలు అందించడం కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్ గూడ జైలుకు చేరుకున్నారట. వారికి పోలీసులకు మధ్య వాదులాట, తోపులాట, ఘర్షణ గట్రా జరుగుతున్నాయట కూడా. “నీకిది, నాకది” (క్విడ్ ప్రో కో) పద్ధతిలో జగన్ కి చెందిన అనేక కంపెనీల్లో వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, దానికి బదులుగా వై.ఎస్.రాజశేఖర రెడ్డి…

జగన్ కి బెయిలు వచ్చేసింది!

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. దర్యాప్తు పూర్తయిందని సి.బి.ఐ చెప్పడంతో కడప ఎం.పికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పెషల్ సి.బి.ఐ కోర్టు తెలిపింది. దాదాపు సంవత్సరంన్నర పైగా జైలులో గడుపుతున్న జగన్, బెయిల్ పై విడుదల కానున్న వార్త ఆయన అభిమానుల్లో సంతోషాతిరేకాలు నింపాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్న ఫలితంగా జగన్ త్వరలో విడుదల కానున్నాడని ఆరోపించిన టి.డి.పి జోస్యం నిజం అయినట్లా? జగన్ ను విషపురుగుగా అభివర్ణించిన…

యువరాజా నాయకత్వ విలువ! -కార్టూన్

ఉల్లి, తదితర ఆహార సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయి? తరుగు ఉత్పత్తిని పసిగట్టిన వ్యాపారులు సదరు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచి తద్వారా లబ్ది పొందాలని చూసినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఇది పై నుండి కింది వరకూ అందరికీ తెలిసిన నిజమే. ఈ సంగతి తెలిసి కూడా ధరల పెరుగుదల పైన ప్రధాని తదితర ఢిల్లీ నాయకుల నుండి ఛోటా మోటా గల్లీ నాయకుల వరకు ధరల పెరుగుదల పైన ఒకటే…

దారికొచ్చిన అద్వానీ

“చూశావా మరి! వాళ్ళ మధ్య విభేదాలని ఇస్త్రీ చేసేసుకుంటారని నేను ముందే చెప్పలేదా?” మొత్తం మీద అద్వానీ దారికొచ్చారు. ఛత్తీస్ ఘడ్ పర్యటనలో నరేంద్ర మోడిపై ప్రశంసలు కురిపించడం ద్వారా బి.జె.పి వృద్ధాగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపారు. మోడికి ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వం కట్టబెట్టడం ద్వారా బి.జె.పి చేసిన ప్రయత్నం సఫలం అయితే దేశం అంతా గుజరాత్ నమూనా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని కూడా అద్వానీ వ్యక్తం చేశారు. ‘బోడి,…

అమెరికన్లను ఉద్దేశిస్తూ పుతిన్ రాసిన లేఖ -అనువాదం

(ఈ లేఖను సెప్టెంబర్ 11 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. సిరియా తిరుగుబాటుదారులు ఆగస్టు 21 తేదీన సౌదీ అరేబియా అందించిన రసాయన ఆయుధాలు ప్రయోగించి వందలాది మంది పౌరులను బలిగొన్న దుర్మార్గాన్ని సిరియా ప్రభుత్వంపై మోపి ఆ దేశంపై దాడికి అమెరికా సిద్ధపడుతున్న నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ లేఖ రాశాడు. లేఖ రాసేనాటికి సిరియా రసాయన ఆయుధాలను ఐరాస పర్యవేక్షణలోకి తేవడానికి రష్యా ప్రతిపాదించడం, సిరియా అందుకు అంగీకరించడం జరిగిపోయింది. అమెరికా…

అద్వానీ స్ధానం అదే! -కార్టూన్

“చివరికి ఈ పరిస్ధితి వచ్చిందా! మన గురువుగారు అద్వానీజీని గురువు స్ధానంలోనే ఉండమని నచ్చజెప్పడానికి ఒక రధయాత్ర చేయాల్సివచ్చిందన్నమాట!” మొత్తం మీద బి.జె.పి పార్టీకి ఒక యజ్ఞం పూర్తయింది. ప్రధాన మంత్రి పదవి కుర్చీలో కూర్చోవాలన్న అద్వానీ కలను నరేంద్ర మోడి గద్దలా వచ్చి తన్నుకుపోయారు. రధయాత్రతో మత ఘర్షణల మంటలు రేపి పార్లమెంటులో సీట్ల చలి కాచుకున్న గురువు గారికి, దేశచరిత్రలో మచ్చగా మిగలాల్సిన కరసేవకుల దహనాన్ని ముస్లింల దహనకాండతో మాపుకున్న శిష్యుడు! గురువును మించిన…

సీమాంధ్ర ఉద్యమానిది కేవలం సెంటిమెంటు కాదు

(ఇది అవ్వారి నాగరాజు గారి వ్యాఖ్య.) తెలంగాణాకు అనుకూలంగా నేనూ, వ్యతిరేకంగా నా మిత్రులూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని పాఠకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను. నా మిత్రుల వాదనలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినవి నదీ జలాలను పంచుకోవడం, కొత్త రాష్ట్రాన్నీ, కొత్త రాజధానినీ నిర్మించుకోవడానికి కావలసిన నిధులు, ఆదాయాలూ- ఆస్తులూ వాటి పంపకాలూ ప్రస్తావనకు వచ్చాయి. నదీ జలాల విషయం ఒక్కొక్క నదినీ సోదాహరణంగా తీసుకొని అవి కేవలం ఒక్క…